ఎవర్ గ్రీన్ క్లాసిన్ భైరవద్వీపం రీ రిలీజ్ డేట్ ఫిక్స్

balakrishnas bhairava dweepam movie re release date fixed

ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే కదా. రీ రిలీజ్ ల సందడి ఎక్కువైంది. స్టార్ హీరోల బర్త్ డేలకు.. స్పెషల్ అకేషన్స్ కు సినిమాలు రీ రిలీజ్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఇప్పటికే పలు సినిమాలు రీ రిలీజ్ అయి సందడి చేశాయి. ఇక ఇప్పుడు మరో ఎవర్ గ్రీన్ క్లాసిక్ రీ రిలీజ్ కు సిద్దమైంది. ఆ సినిమా మరేదో కాదు బాలయ్య సినీ కెరీర్ లో ఎప్పటికీ గొప్ప సినిమాగా మిగిలిపోయే సినిమా భైరవద్వీపం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలకృష్ణ, రోజా హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా భైరవద్వీపం. అప్పట్లోనే ఈసినిమాతో ఒక సోషియో ఫాంటసీ వరల్డ్ ను చూపించాడు సింగీతం శ్రీనివాసరావు. ఇక ఇప్పుడు ఈసినిమాను రీ రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు మేకర్స్. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా రీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. 4కే వెర్షన్ లో ఈసినిమాను ఆగష్ట్ 5వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

కాగా తాను ప్రేమించిన యువరాణిని ఓ రాక్షసుడి భారీ నుండి సామాన్యుడైన విజయ్ ఎలా కాపాడాడు.. ఆ క్రమంలో ఎన్ని సవాళ్లను ఎదుర్కొన్నాడు అనే నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. 1994 ఏప్రిల్ 14వ తేదీన రిలీజ్ అయిన ఈసినిమా అప్పట్లో ప్రభంజనం సృష్టించింది. ఈసినిమాకు రావి కొండలరావు కథను అందించారు. ఇక పాటల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాదవపెద్ది సురేష్ స్వరపరిచిన ప్రతి ఒక్కపాట కూడా సూపర్ హిట్టే. ముఖ్యంగా నరుడా ఓ నరుడా పాట ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 3 =