సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో వస్తున్న ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకునే పనిలో ఉంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టేశారు మేకర్స్. ఇక క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై మొదటినుండీ భారీ అంచనాలే ఉన్నాయి. దానికితోడు ఫస్ట్ లుక్ పోస్టర్లతోనే ఈసినిమా మంచి బజ్ క్రియేట్ చేశారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి రెండు అప్ డేట్లు వచ్చిన సంగతి తెలిసిందే కదా. రెండు రోజుల ముందు టైటిల్ ను రిలీజ్ చేస్తే బర్త్ డే రోజు టీజర్ ను రిలీజ్ చేసి ఫుల్ మీల్స్ అందించారు. ఇక టీజర్ కు మాములు రెస్పాన్స్ రాలేదు. బాలయ్య మాస్ డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయి. అందుకే టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. అంతేకాదు 15 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకొని ప్రస్తుతం టాప్ లో ట్రెండింగ్ అవుతుంది. ఇక ఈవిషయాన్ని చిత్రయూనిట్ కూడా పోస్టర్ రిలీజ్ చేస్తూ మరీ తెలియచేసింది.
కాగా ఈసినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీలీల ఒక కీలక పాత్రలో నటిస్తుంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ ఈసినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఈ చిత్రానికి కూడా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: