ట్యాగ్ · 17 కథనాలు

బాలయ్యతో ఆ ఇద్దరు.. నాలుగోసారి?

మరోమారు బాలకృష్ణ, బి.గోపాల్ కాంబినేషన్?
'లక్ష్మీస్ ఎన్టీఆర్' నటుడికి బాలకృష్ణ సాయం
బాలకృష్ణ, చిరంతన్... హ్యాట్రిక్ కొడతారా?
ఆ దర్శకుడికి మరో ఛాన్స్ ఇస్తున్న బాలకృష్ణ?
బాలకృష్ణకి విలన్ గా శ్రీకాంత్?
మరోసారి ముఖ్యమంత్రిగా బాలకృష్ణ?
మరోసారి ఇద్దరు నాయికలతో బాలకృష్ణ?
వరుస చిత్రాలతో బాలకృష్ణ సందడి

అక్టోబర్ 5 నుంచి NBK105 నెక్స్ట్ షెడ్యూల్?
దసరాకు బాలకృష్ణ సినిమా టీజర్..?
అప్పుడే డబ్బింగ్ మొదలుపెట్టిన బాలకృష్ణ

జూలై 15 నుంచి బాలకృష్ణ తాజా చిత్రం రెగ్యులర్ షూటింగ్

ఈ నెల 12న ప్రారంభం కానున్న బాలకృష్ణ 105?

కొత్త సినిమాకు ముహూర్తం ఫిక్స్
హిట్ కాంబోను రిపీట్ చేసే ప్లాన్ లో బాలయ్య...!
ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో బాలయ్యను గతంలో ఎన్నడూ చూపించని విధంగా అఘోర పాత్రలో చూపించబోతున్నట్టు తెలుస్తుంది. కాగా గతంలో వీరి కాంబినేషన్లో సింహ, లెజెండ్ సినిమాలు వచ్చాయి. ఈ రెండు కూడా భారీ విజయం సొంతం చేసుకున్నాయి. ఈ సినిమాలు విజయం సాధించడంతో ఈ సినిమాపై కూడా అంచనాలు పెరిగాయి.

బాలయ్యతో ఆ ఇద్దరు.. నాలుగోసారి?
నటసింహ బాలకృష్ణ, యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీనుది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. గతంలో ఈ ఇద్దరి కలయికలో వచ్చిన `సింహా`, `లెజెండ్` సంచలన విజయం సాధించాయి. కట్ చేస్తే.. సుదీర్ఘ విరామం అనంతరం ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఈ ఇరువురు జట్టుకట్టారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న సదరు చిత్రం... త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభించుకోనుంది.

మరోమారు బాలకృష్ణ, బి.గోపాల్ కాంబినేషన్?
నటసింహ నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బి. గోపాల్ ది తెలుగునాట తిరుగులేని కాంబినేషన్ అనే చెప్పాలి. `లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్ పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు` వంటి బ్లాక్ బస్టర్స్ తో బాక్సాఫీస్ ని షేక్ చేసిన ఈ జోడీ.. సుదీర్ఘ విరామం అనంతరం మరోమారు జట్టుకట్టనుంది. ఇప్పటికే ఈ కాంబినేషన్ మూవీకి ఓ పవర్ ఫుల్ సబ్జెక్ట్ రెడీ అయిందని, బోయపాటి శ్రీను కాంబినేషన్ ఫిల్మ్ తరువాత బాలకృష్ణ నటించే సినిమా ఇదే అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
'లక్ష్మీస్ ఎన్టీఆర్' నటుడికి బాలకృష్ణ సాయం
మరోసారి బాలకృష్ణ తన ఉదార స్వభావాన్ని చూపించారు.అది కూడా తమ కుటుంబంపై నెగిటివ్ గా ప్రచారం చేస్తూ తీసిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' నటుడికి. అసలు సంగతేంటంటే.. ఈ సినిమాలో కీలక పాత్ర అయిన ఎన్టీఆర్ పాత్రలో ‘విజయ్‌కుమార్’ అనే స్టేజ్ ఆర్టిస్ట్ నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈయన భార్యకు ఇటీవల క్యాన్సర్ సోకింది. దాంతో విజయ్‌కుమార్ వైద్య ఖర్చులతో ఇబ్బంది పడుతున్నాడట.దీంతో బాలయ్య తన బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ లో ‘విజయ్‌కుమార్’ భార్యకు ఉచితంగా క్యాన్సర్ చికిత్సను అందిస్తున్నారట.
బాలకృష్ణ, చిరంతన్... హ్యాట్రిక్ కొడతారా?
నటసింహ నందమూరి బాలకృష్ణకి అచ్చొచ్చిన స్వరకర్తల్లో చిరంతన్ భట్ ఒకరు. బాలయ్య వందో చిత్రం `గౌతమీపుత్ర శాతకర్ణి`(2017)కి చిరంతన్ నే బాణీలు అందించాడు. హిస్టారికల్ డ్రామాగా రూపొందిన సదరు సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. అనంతరం ఈ ఇద్దరి కలయికలో వచ్చిన `జై సింహా` (2018) కూడా విజయతీరాలకు చేరుకుంది.
ఆ దర్శకుడికి మరో ఛాన్స్ ఇస్తున్న బాలకృష్ణ?
`అధినాయకుడు` (2012)... నటసింహ బాలకృష్ణ కెరీర్ లో ప్రత్యేకంగా నిలచిన చిత్రం. ఇందులో మూడు తరాలకు చెందిన మూడు విభిన్న పాత్రల్లో నటించి అలరించాడు బాలయ్య. అలాగే త్రిపాత్రాభినయంలో తనదైన ముద్రవేశాడు. అలాంటి... `అధినాయకుడు`కి దర్శకత్వం వహించిన పరుచూరి మురళి డైరెక్షన్ లో బాలయ్య ఎనిమిదేళ్ళ సుదీర్ఘ విరామం తరువాత మరో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు... వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశముందని టాక్.
బాలకృష్ణకి విలన్ గా శ్రీకాంత్?
బ్లాక్ బస్టర్స్ హిట్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలచిన కాంబినేషన్ ల్లో నటసింహ బాలకృష్ణ, యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను జోడీ ఒకటి. వీరిద్దరి కలయికలో వచ్చిన `సింహా`(2010), `లెజెండ్`(2014) సంచలన విజయం సాధించడమే కాకుండా ఆ యా సంవత్సరాలలో హయ్యస్ట్ గ్రాసర్స్ గా నిలిచాయి. కట్ చేస్తే... ఐదేళ్ళ విరామం అనంతరం ఈ సెన్సేషనల్ కాంబినేషన్ మరోసారి జట్టుకడుతోంది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... ఇటీవలే పూజ జరుపుకుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళనుంది.
మరోసారి ముఖ్యమంత్రిగా బాలకృష్ణ?
`యన్టీఆర్ మహానాయకుడు` చిత్రంలో ముఖ్యమంత్రిగా దర్శనమిచ్చిన నటసింహ నందమూరి బాలకృష్ణ... త్వరలో మరో సినిమాలోనూ సీఎమ్ గా కనిపించబోతున్నారట.
మరోసారి ఇద్దరు నాయికలతో బాలకృష్ణ?
‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తరువాత నటసింహ నందమూరి బాలకృష్ణ, యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రాన్ని... ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి (‘జయ జానకి నాయక’ ఫేమ్) నిర్మించనున్నారు.
బోయపాటి సినిమా కోసం బరువు తగ్గనున్న బాలయ్య
‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తరువాత నటసింహ నందమూరి బాలకృష్ణ, యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను మరోసారి జట్టుకట్టబోతున్న సంగతి తెలిసిందే. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఈ ఏడాది డిసెంబర్ నుంచి పట్టాలెక్కనున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే... ఈ సినిమాకి సంబంధించి ఆసక్తికరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.
వరుస చిత్రాలతో బాలకృష్ణ సందడి
`యన్టీఆర్` బయోపిక్ తరువాత స్వల్ప విరామం తీసుకున్న నటసింహ నందమూరి బాలకృష్ణ... ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ కానున్నారు. ప్రస్తుతం కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తన 105వ చిత్రాన్ని చేస్తున్న బాలయ్య... అది సెట్స్‌పై ఉండగానే యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీనుతో తన 106వ సినిమాని, ఇస్మార్ట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో తన 107వ చిత్రాన్ని చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఇక ఈ రెండు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ లైన్‌లో ఉండగానే... ఇప్పుడు తన 108వ సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాలీవుడ్ టాక్.

అక్టోబర్ 5 నుంచి NBK105 నెక్స్ట్ షెడ్యూల్?
‘జై సింహా’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇంకా పేరు నిర్ణయించని ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో పవర్ ఫుల్ పోలీస్ అధికారి గానూ, గ్యాంగ్ స్టర్ గానూ... రెండు విభిన్న ఛాయలున్న పాత్రలో కనిపించనున్నాడు బాలయ్య. సోనాల్ చౌహాన్, వేదిక కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో భూమికా చావ్లా, ప్రకాష్ రాజ్, జయసుధ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
దసరాకు బాలకృష్ణ సినిమా టీజర్..?
`జై సింహా` తరువాత బాలకృష్ణ, కె.యస్.రవికుమార్ కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోవైపు డబ్బింగ్ వర్క్ కూడా మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే బాలకృష్ణ తన పాత్రకి డబ్బింగ్ చెప్పడం ప్రారంభించారట.
అప్పుడే డబ్బింగ్ మొదలుపెట్టిన బాలకృష్ణ
`జై సింహా` తరువాత నటసింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కె.యస్.రవికుమార్ కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో బాలయ్యకి జోడీగా వేదిక, సోనాల్ చౌహాన్ నటిస్తుండగా... కీలక పాత్రల్లో భూమికా చావ్లా, జయసుధ, ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. `గౌతమిపుత్ర శాతకర్ణి`, `జై సింహా` చిత్రాల స్వరకర్త చిరంతన్ భట్ బాణీలు అందిస్తున్నాడు.

జూలై 15 నుంచి బాలకృష్ణ తాజా చిత్రం రెగ్యులర్ షూటింగ్
గత ఏడాది సంక్రాంతికి ‘జై సింహా’ రూపంలో మంచి విజయాన్ని అందుకున్న నటసింహ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్... మరోసారి జట్టుకట్టిన సంగతి తెలిసిందే. పోలీస్ ఆఫీసర్‌గానూ, గ్యాంగ్‌స్టర్‌గానూ... ఇలా రెండు షేడ్స్ ఉన్న పాత్రలో బాలయ్య కనిపించనున్న ఈ సినిమాకి ‘రూలర్’, ‘క్రాంతి’ అనే పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ నెల 12న ప్రారంభం కానున్న బాలకృష్ణ 105?
నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ‘రూలర్’ (ప్రచారంలో ఉన్న పేరు) అనే సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను కోలీవుడ్ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ తెరకెక్కించనున్నాడు. బాలయ్య 105వ చిత్రంగా రూపొందనున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మించనున్నాడు.

కొత్త సినిమాకు ముహూర్తం ఫిక్స్
బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాలు ఎంత పెద్ద ఘన విజయం సాధించాయో అందరికీ తెలుసు. యాక్షన్ ఎంటర్టైనర్స్ గా తెరకెక్కిన ఈ సినిమాలు ఒక ట్రెండ్ సెట్ చేశాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ లో కొత్త సినిమా రాబోతున్నట్టు గత కొద్ది కాలంగా వార్తలు వస్తున్న సంగతి కూడా విదితమే.