హిట్ కాంబోను రిపీట్ చేసే ప్లాన్ లో బాలయ్య…!

Blockbuster Trio Repeats Again

ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో బాలయ్యను గతంలో ఎన్నడూ చూపించని విధంగా అఘోర పాత్రలో చూపించబోతున్నట్టు తెలుస్తుంది. కాగా గతంలో వీరి కాంబినేషన్లో సింహ, లెజెండ్ సినిమాలు వచ్చాయి. ఈ రెండు కూడా భారీ విజయం సొంతం చేసుకున్నాయి. ఈ సినిమాలు విజయం సాధించడంతో ఈ సినిమాపై కూడా అంచనాలు పెరిగాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈ సినిమాలో ఉండగానే బాలయ్య మరో సినిమాను లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది. ఇంతకీ డైరెక్టర్ ఎవరో తెలుసా… ఒకప్పుడు తనకు ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’ లాంటి బ్లాక్‌బస్టర్లు ఇచ్చిన బి.గోపాల్‌. నిజానికి ఫ్యాక్షన్ సినిమాల్లో కొత్త ఒరవడి తెచ్చాడని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు మళ్ళీ ఈయనతో సినిమా తీయాలని చూస్తున్నాడట బాలయ్య. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ సినిమాకు చిన్నికృష్ణ రైటర్ గా పనిచేస్తున్నాడట. బాలకృష్ణ హీరోగా, బి.గోపాల్ దర్శకుడిగా.. చిన్ని కృష్ణ రైటర్ గా 2001 లో వచ్చిన నరసింహ నాయుడు రాగా అది సూపర్ హిట్ అయింది. దీనితో బాలయ్య మళ్ళీ ఈ కాంబినేషన్ ను రిపీట్ చేయాలనుకుంటున్నాడట.

[custom_ad]

మరి బాలయ్యకు ‘పలనాటి బ్రహ్మనాయుడు’ లాంటి డిజాస్టర్ ఇచ్చిన తర్వాత ఆయన నుండి చెప్పుకో తగ్గ సినిమా ఏం రాలేదు. చివరగా గోపీచంద్‌తో తీసిన ‘ఆరడుగుల బుల్లెట్టు’ విడుదలకే నోచుకోలేదు. ఇక చిన్నికృష్ణ పేరు అయితే ఎక్కడా వినిపించడం లేదు కూడా. మరి వీరితో బాలయ్యకు సినిమా చేయాలని ఎందుకు అనిపించిందో ఆయనకే తెలియాలి. ప్రస్తుతానికైతే వార్తలుగానే వినిపిస్తున్నాయి.. ఇందులో నిజమెంత ఉందో..?లేదో? తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × four =