జూలై 15 నుంచి బాల‌కృష్ణ తాజా చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్

Balakrishna – Ks Ravi Kumar Movie Regular Shoot From July 15,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Balakrishna-KS Ravikumar film to kick-start in Bihar,Balakrishna teams up with KS Ravikumar again,Balakrishna Upcoming Movie News,Balakrishna Next Film Updates,Balakrishna New Movie News
Balakrishna - Ks Ravi Kumar Movie Regular Shoot From July 15

గత ఏడాది సంక్రాంతికి ‘జై సింహా’ రూపంలో మంచి విజయాన్ని అందుకున్న నటసింహ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కె.ఎస్.రవికుమార్ కాంబినేష‌న్‌… మరోసారి జట్టుకట్టిన సంగతి తెలిసిందే. పోలీస్ ఆఫీస‌ర్‌గానూ, గ్యాంగ్‌స్ట‌ర్‌గానూ… ఇలా రెండు షేడ్స్ ఉన్న పాత్రలో బాల‌య్య కనిపించనున్న ఈ సినిమాకి ‘రూలర్’, ‘క్రాంతి’ అనే పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్… జూలై 15 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంద‌ని స‌మాచారం. బీహార్‌లో జ‌రిగే తొలి షెడ్యూల్‌లో పోరాట ఘ‌ట్టాల‌తో పాటు కొన్ని కీలక సన్నివేశాలను కూడా తెరకెక్కించనున్నారట. కాగా, నిర‌వ‌ధికంగా జ‌రిగే చిత్రీక‌ర‌ణ‌తో చ‌క‌చ‌కా నిర్మాణాన్ని పూర్తి చేసి… 2020 సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేసే దిశ‌గా ద‌ర్శ‌క‌నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

[subscribe]

[youtube_video videoid=ZS9yvoAGGIY]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 3 =