`జై సింహా` తరువాత నటసింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కె.యస్.రవికుమార్ కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో బాలయ్యకి జోడీగా వేదిక, సోనాల్ చౌహాన్ నటిస్తుండగా… కీలక పాత్రల్లో భూమికా చావ్లా, జయసుధ, ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. `గౌతమిపుత్ర శాతకర్ణి`, `జై సింహా` చిత్రాల స్వరకర్త చిరంతన్ భట్ బాణీలు అందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ శరవేగంగా జరుగుతుండగా… మరోవైపు డబ్బింగ్ వర్క్ కూడా మొదలైంది. ఇందులో భాగంగా… తాజాగా శబ్ధాలయ స్టూడియోస్‌లో బాలకృష్ణ తన పాత్రకి డబ్బింగ్ చెప్పడం ప్రారంభించారు. అయితే, ఇదంతా ఫస్ట్ షెడ్యూల్‌లో షూట్ చేసిన సీన్స్‌కు సంబంధించిన డబ్బింగ్ వర్క్ అని సమాచారం.
కాగా… పోలీస్ ఆఫీసర్‌గా, గ్యాంగ్‌స్టర్‌గా రెండు విభిన్న ఛాయలున్న పాత్రలో బాలయ్య నటిస్తున్న ఈ చిత్రం… ఈ ఏడాది చివరలో రిలీజ్ కానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: