
ట్యాగ్ · 167 కథనాలు


బాలకృష్ణ నెక్స్ట్ మూవీ ఫిక్స్ ?

డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు

అఖండ 2.. అదిరిపోయే అప్‌డేట్

నందమూరి బాలకృష్ణ సినీ ప్రస్థానానికి 50 ఏళ్ళు

పాపులర్ ఇండియన్ సెలబ్రటీస్ లిస్ట్ లో బాలయ్య

నందమూరి బాలకృష్ణ నటజీవితానికి 49 ఏళ్ళు పూర్తి

రీ రిలీజ్‌కు సిద్ధమైన బాలకృష్ణ 'భైరవ ద్వీపం'

జైలర్ కు బాలకృష్ణ ను అనుకున్నారట కానీ ...

క్లైమాక్స్ లో బాలయ్య భగవంత్ కేసరి

హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లో భగవంత్ కేసరి

రాముని గా వెండితెరపై అలరించిన హీరోలు

టాప్ ట్రెండింగ్ భగవంత్ కేసరి లో టీజర్

బాలకృష్ణ తో నయనతార మరోసారి
అఖండ 2 తరువాత నటసింహం నందమూరి బాలకృష్ణ నెక్స్ట్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తో సినిమా చేయనున్నాడని తెలిసిందే. వీరి కాంబినేషన్ లో ఇది రెండో సినిమా.ఇంతకుముందు వీర సింహా రెడ్డి రాగ ఆ సినిమా సూపర్ హిట్ అనిపించుకుంది.ఇక ఇప్పుడు రెండో సినిమా రానుంది. NBK 111 గా పిలవబడుతున్న ఈసినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ చిత్రాన్ని నవంబర్ 7న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించి అదే నెల మూడో వారంలో సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు.

బాలకృష్ణ నెక్స్ట్ మూవీ ఫిక్స్ ?
మినిమమ్ గ్యాప్ తీసుకోకుండా సినిమాలు పూర్తి చేసే హీరోల్లో బాలకృష్ణ ఒకరు.ఒక సినిమా పూర్తయ్యే లోపు మరో సినిమాను లైన్లో పెడతాడు.అంతేకాదు అఖండ నుండి ప్లాప్ అన్నదే తెలియకుండా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు ఈ సీనియర్ హీరో.రీసెంట్ గా సంక్రాంతికి డాకు మహారాజ్ తో వచ్చి మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు.ఇక ప్రస్తుతం బాలకృష్ణ అఖండ 2 చేస్తున్నాడు.బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వస్తుంది.అఖండ సీక్వెల్ కావడంతో ఈసినిమాపై అంచనాలు భారీగా వున్నాయి.తమన్ సంగీతం అందిస్తుండగా 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తుంది.షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.

రివ్యూ: డాకు మహారాజ్
ఓవరాల్ గా భారీ అంచనాల మధ్య డాకు మహారాజ్ ఆ అంచనాలను అందుకొందని చెప్పొచ్చు.ఇందులో బాలకృష్ణ నటన , డైరెక్షన్ ,యాక్షన్ సీక్వెన్స్ , బీజీఎమ్ ,విజువల్స్ హైలైట్ అయ్యాయి. ఈసంక్రాంతికి ప్రాపర్ కమర్షియల్ ఎంటర్టైనర్ ను చూడాలనుకుంటే డాకు మహారాజ్ ను చూసేయొచ్చు.ఈసినిమా ఫ్యాన్స్ ను మాత్రమే కాదు అందరిని అలరిస్తుంది.

డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు
సీనియర్ హీరో బాలకృష్ణ ,యంగ్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో వస్తున్న డాకు మహారాజ్ మరో మూడు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. సాంగ్స్ , ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సినిమాపు అంచనాలు భారీగా వున్నాయ్.ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు అనంతపురం లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపాలనుకున్నారు. అయితే నిన్న దురదృష్టవశాత్తు తిరుపతి లో తొక్కిసలాట లో జరగడం తో ఈవెంట్ ను నిర్వహించడానికి ఇది సరైన సమయం కాదని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

అఖండ 2.. అదిరిపోయే అప్‌డేట్
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను సూపర్ హిట్ కాంబినేషన్‌లో వస్తోన్న నాలుగో సినిమా 'అఖండ 2'. 'తాండవం' అనేది ట్యాగ్‌లైన్‌గా ఉంది. 2021లో వీరి కలయికలోనే వచ్చిన 'అఖండ' సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. కరోనా ప్రభావం తగ్గుతున్న సమయంలో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద రూ.130 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.

నందమూరి బాలకృష్ణ సినీ ప్రస్థానానికి 50 ఏళ్ళు
టాలీవుడ్‌లోనే కాదు, ఏ చిత్ర పరిశ్రమలోనైనా ఒక హీరో 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం అనేది సాధారణ విషయం కాదు. ఈ అరుదైన ఫీట్ సాధించారు టాలీవుడ్ అగ్ర హీరో ‘నటసింహా’ నందమూరి బాలకృష్ణ. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, అలనాటి తెలుగు చలనచిత్ర అగ్ర నటుడు, దివంగత నందమూరి తారక రామారావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలకృష్ణ నటుడిగా నేటితో 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు.

బిగ్ అనౌన్స్‌మెంట్.. బాలయ్య-బోయపాటి కాంబో షురూ
టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్స్‌లో గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను కాంబో ఒకటి. ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్‌లో మూడు చిత్రాలు రాగా అన్నీ ఒకదానిని మించి ఒకటి బ్లాక్ బస్టర్ అయ్యాయి. తొలిసారిగా వీరి కాంబోలో వచ్చిన మూవీ 'సింహా'. 2010లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఆ తర్వాత 2014లో 'లెజెండ్' సినిమాతో మరోసారి సూపర్ హిట్ అందుకున్నారు. అనంతరం 2021లో 'అఖండ' చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుని హ్యాట్రిక్ సాధించారు.

పాపులర్ ఇండియన్ సెలబ్రటీస్ లిస్ట్ లో బాలయ్య
అగ్రహీరో బాలకృష్ణ మాత్రం ఈ వయసులో కూడా ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క టెలివిజన్ షోస్.. రాజకీయాలు ఇలా బిజీ బిజీగా గడుపుతున్నారు. అంతేకాదు యంగ్ హీరోలకు సైతం పోటీఇస్తూ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గానే భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈసినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టడమే కాదు.. ఈసినిమాతో హ్యాట్రిక్ ను సైతం అందుకుంది. ఈసినిమా రీసెంట్ గానే ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ఓటీటీ లో కూడా ఈసినిమా తన హవా ను చాటింది. ఈసినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

థమన్ బాలయ్య కు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో మీకు నచ్చింది?
టాలీవుడ్ లో థమన్ కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. థమన్ సినిమాకు మ్యూజిక్ ఇస్తే పాటలు సూపర్ హిట్టే అన్న పేరు తెచ్చుకున్నాడు థమన్. దానికి కారణం ఇటీవల తను ఏ ఆల్బమ్ చేసినా ఆ పాటలు సోషల్ మీడియా వేదికగా రికార్డులు సృష్టించడమే. ప్రస్తుతం అయితే థమన్ పలు సినిమాతో బిజీగా ఉన్నాయి. ఇక ఇప్పుడు హ్యాట్రిక్ అందుకున్నాడు థమన్. బాలకృష్ణ సినిమాలకు కూడా ఇప్పుడు థమన్ ఆస్థాన్ మ్యూజిక్ డైెరెక్టర్ అయ్యాడు. డిక్టేటర్ నుండి నిన్న వచ్చిన భగవంత్ కేసరి వరకూ థమన్ బాలయ్య పలు సినిమాలకు సంగీతం అందించాడు. అఖండకు థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాకే హైలెట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తరువాత…

నందమూరి బాలకృష్ణ నటజీవితానికి 49 ఏళ్ళు పూర్తి
నటసింహ నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ పరిశ్రమలో 49 గ్లోరియస్ ఇయర్స్ పూర్తి చేసుకున్నారు. నటుడిగా నేటితో 50వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. బాలకృష్ణ తన పుట్టిన రోజైన జూన్ 10కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో.. ఆగస్టు 30ని కూడా అంతే గొప్పగా చూస్తారు. ఎందుకంటే..? 'తాతమ్మకల' అనే సినిమాతో బాలకృష్ణ తొలిసారిగా తన 14వ ఏట సినిమా ఇండస్ట్రీలో అరంగేట్రం చేశారు. అప్పటినుంచి ఇప్పటివరకూ బాలకృష్ణ దాదాపు ఐదు దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను తనదైన నటనతో అలరిస్తున్నారు. బాలకృష్ణ హీరోగా.. కథానాయకుడు, ముద్దుల మావయ్య, నారీ నారీ నడుమ మురారి, ఆదిత్య 369, భైరవద్వీపం, రౌడీ ఇనస్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహా, లెజెండ్…

రీ రిలీజ్‌కు సిద్ధమైన బాలకృష్ణ 'భైరవ ద్వీపం'
టాలీవుడ్‌లో రీసెంట్‌గా రీ రిలీజ్ ట్రెండ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఒకప్పుడు సూపర్ హిట్ అయిన అగ్ర హీరోల సినిమాలను మళ్ళీ విడుదల చేస్తూ లాభాలు గడిస్తున్నారు ఆయా చిత్రాల నిర్మాతలు. తాజాగా ఈ లిస్టులోకి నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన ఆల్ టైమ్ క్లాసిక్ హిట్ ‘భైరవ ద్వీపం’ సినిమా చేరింది. కాగా 1974లో తెరంగేట్రం చేసిన నందమూరి బాలకృష్ణ.. సినీ పరిశ్రమలో 50 గ్లోరియస్ ఇయర్స్ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ అద్భుతమైన ప్రయాణాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి, ఈ తరం ప్రేక్షకులను అద్భుత ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి 'భైరవ ద్వీపం' సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా.. ‘భైరవద్వీపం’ చిత్రాన్ని దాదాపు రెండు దశాబ్దాల…

భగవంత్ కేసరి సెట్‌లో సందడి చేసిన నందమూరి మోక్షజ్ఞ
నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తేజ సినీ ఎంట్రీ గురించి అభిమానులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే మోక్షజ్ఞ సినీ అరంగేట్రం గురించి తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా జోరుగా చర్చ జరుగుతోంది. అయితే ఇంతవరకూ ఆయన ఎంట్రీ గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కాగా ప్రస్తుతం మోక్షజ్ఞ అమెరికాలో యాక్టింగ్ కోర్సు చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది మోక్షజ్ఞ తెరంగేట్రం చేయొచ్చనే టాక్ నడుస్తోంది. దీనికితోడు ఈ మధ్య మోక్షజ్ఞ తండ్రి సినిమాల షూటింగ్స్ మరియు సెట్స్‌ను తరచుగా సందర్శిస్తున్నాడు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లవుతోంది. ఇక బాలకృష్ణ, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో…

జైలర్ కు బాలకృష్ణ ను అనుకున్నారట కానీ ...
సూపర్ స్టార్ రజినీకాంత్ చాలా రోజుల తరువాత బాక్సాఫీస్ వద్ద తన సత్తా చూపిస్తున్నాడు.ఆయన నటించిన లేటెస్ట్ మూవీ జైలర్.మొన్న విడుదలైన ఈసినిమా పాజిటివ్ మౌత్ టాక్ తో అద్భుతమైన వసూళ్లను రాబడుతుంది.ఒక్క తమిళనాడు లోనే కాదు మిగితా దక్షిణాది రాష్ట్రాల్లో అలాగే ఓవర్సీస్ లో సెన్సేషన్ సృష్టిస్తుంది.మాస్ ఎంటర్టైనర్ గా నెల్సన్ దిలీప్ కుమార్ ఈసినిమాను తెరకెక్కించాడు.

ఎవర్ గ్రీన్ క్లాసిన్ భైరవద్వీపం రీ రిలీజ్ డేట్ ఫిక్స్
ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే కదా. రీ రిలీజ్ ల సందడి ఎక్కువైంది. స్టార్ హీరోల బర్త్ డేలకు.. స్పెషల్ అకేషన్స్ కు సినిమాలు రీ రిలీజ్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఇప్పటికే పలు సినిమాలు రీ రిలీజ్ అయి సందడి చేశాయి. ఇక ఇప్పుడు మరో ఎవర్ గ్రీన్ క్లాసిక్ రీ రిలీజ్ కు సిద్దమైంది. ఆ సినిమా మరేదో కాదు బాలయ్య సినీ కెరీర్ లో ఎప్పటికీ గొప్ప సినిమాగా మిగిలిపోయే సినిమా భైరవద్వీపం.

క్లైమాక్స్ లో బాలయ్య భగవంత్ కేసరి
నట సింహం బాలకృష్ణ, సక్సెస్ పుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా భగవంత్ కేసరి. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈసినిమా రూపొందుతుంది. ఈ కాంబినేషన్ సెట్ అయినప్పటినుండే సినిమాకు మరింత హైప్ పెరిగింది. ఇక ఈసినిమా నుండి వరుసగా అప్ డేట్లు ఇస్తూ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాడు అనిల్ రావిపూడి. ఇక రీసెంట్ గానే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

బాలయ్య పాటతో అదరగొట్టిన కాజల్, శ్రీలీల
నట సింహం బాలకృష్ణ, సక్సెస్ పుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా భగవంత్ కేసరి. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈసినిమా రూపొందుతుంది. ఈ కాంబినేషన్ సెట్ అయినప్పటినుండే సినిమాకు మరింత హైప్ పెరిగింది. ఇక ఈసినిమా నుండి వరుసగా అప్ డేట్లు ఇస్తూ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా ఫస్ట్ లుక్, టీజర్‌ను రిలీజ్ చేయగా.. ఆ తర్వాత ఇందులో ఓ కీలక పాత్రలో నటిస్తున్న శ్రీలీల లుక్‌ని కూడా ఆమె బర్త్‌డే సందర్భంగా విడుదల చేశారు. కాజల్ అగర్వాల్ బర్త్‌డే స్పెషల్‌గా ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ని మేకర్స్ వదిలారు. ప్రస్తుతం అయితే షూటింగ్ ను ముగించుకునే పనిలో ఉన్నారు.

హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లో భగవంత్ కేసరి
అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా భగవంత్ కేసరి అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మొదటినుండీ భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో రెండు హిట్లను అందుకోవడంతో బాలయ్య ఫ్యాన్స్ హ్యాట్రిక్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక రీసెంట్ గా ఈసినిమా నుండి బాలకృష్ణ పుట్టినరోజు కు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఇంకా టీజర్ రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ రావడంతో ఈసినిమాతో హ్యాట్రిక్ పక్కా అన్న అభిప్రాయానికి వచ్చేశారు.

20 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్న భగవంత్ కేసరి టీజర్
ఈఏడాది వీరసింహారెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు బాలకృష్ణ. ఇక ఇప్పుడు మరో సినిమాతో బిజీ అయిపోయారు. బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. భగవంత్ కేసరి అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది.క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మొదటినుండీ భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాదు అనిల్ రావిపూడి ఇంతవరకూ సక్సెస్ లే కొట్టాడు.. దీంతో ఈసినిమాతో బాలకృష్ణ కు హ్యాట్రిక్ పక్కా అన్న అభిప్రాయాలు కూడా వస్తున్నాయి.

రాముని గా వెండితెరపై అలరించిన హీరోలు
కాలం ఎంత మారుతున్నాా కొన్ని కథలలో నిజం మాత్రం మారదు. ముఖ్యంగా ఇతిహాసాలు మహాభారతం, రామాయణం లాంటి కావ్యాలు మాత్రం ఎప్పటికీ అలానే నిలిచిపోయేవి. తరాలు మారినా కూడా మార్చడానికి వీలులేని స్పూర్తి కలిగించే కావ్యాలు అవి. పూర్వికులు విన్నారు.. మనం వింటున్నాం.. భవిష్యత్తు తరాలవారు కూడా వింటారు. ఇక రామాయణం మీద ఇప్పటికే వెండితెరపై ఎన్నో సినిమాలు వచ్చాయి. కథ ఒకటే అయినా దానికి ఆవిష్కరించే వారి పద్దతి ఒక్కోరకంగా ఉంటుంది. త్వరలో ఇదే కథతో ప్రభాస్ ఆదిపురుష్ తో రాబోతున్నాడు. ఈసినిమాకు ఎలాంటి క్రేజ్ ఉందో చూస్తూనే ఉన్నాం. ఇంకా రెండు రోజుల్లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ వెండితెరపై…

టాప్ ట్రెండింగ్ భగవంత్ కేసరి లో టీజర్
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో వస్తున్న ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకునే పనిలో ఉంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టేశారు మేకర్స్. ఇక క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై మొదటినుండీ భారీ అంచనాలే ఉన్నాయి. దానికితోడు ఫస్ట్ లుక్ పోస్టర్లతోనే ఈసినిమా మంచి బజ్ క్రియేట్ చేశారు మేకర్స్.