రివ్యూ: డాకు మహారాజ్

Daaku Maharaaj review in telugu

నటీనటులు : బాలకృష్ణ ,శ్రద్దా శ్రీనాథ్ , ఊర్వశి రౌతేలా,ప్రగ్యా జైస్వాల్ ,బాబీ డియోల్
ఎడిటింగ్ : నిరంజన్ దేవరమానే , రూబెన్
సినిమాటోగ్రఫీ : విజయ్ కార్తీక్
సంగీతం : తమన్
దర్శకత్వం : బాబీ
నిర్మాతలు : నాగవంశీ, సాయి సౌజన్య

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సంక్రాంతి సీజన్ బాగా కలిసొచ్చింది సీనియర్ హీరో బాలకృష్ణకు.ఈసీజన్ లో వచ్చిన తన సినిమాలు అన్ని దాదాపు విజయాలు సాధించాయి.ఇక ఈ సంక్రాంతికి డాకు మహారాజ్ తో వచ్చాడు. ఈరోజే థియేటర్లలోకి వచ్చింది.ట్రైలర్లు ,సాంగ్స్ సూపర్ తెచ్చుకోవడంతో సినిమాపై అంచనాలు భారీగా వున్నాయి.మరి భారీ హైప్ తో వచ్చిన ఈసినిమా ఎలా వుంది ? ఈసినిమా హ్యాట్రిక్ విజయాలతో వున్న బాలకృష్ణ కు మరో విజయాన్ని అందించిందో లేదో తెలుసుకుందాం.

కథ :

కృష్ణమూర్తి (సచిన్ ఖేడ్కర్) విద్యావేత్త. చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఓ పెద్ద పాఠశాలను నడుపుతుంటాడు. ఆయనకు ఒక పెద్ద కాఫీ ఎస్టేట్ వుంటుంది. స్థానిక ఎమ్మెల్యే త్రిమూర్తులు (రవి కిషన్) దీనిని లీజుకి తీసుకుని అక్కడ అసాంఘిక కార్యకలాపాలు చేస్తుంటాడు. వన్యమృగాలని అక్రమంగా తరలిస్తుంటాడు. ఈ క్రమంలో త్రిమూర్తులు అరాచకాలు హద్దుమీరడంతో పోలీసులని ఆశ్రయిస్తాడు కృష్ణమూర్తి.

దీంతో కృష్ణమూర్తిపై పగతో రగిలిపోతాడు త్రిమూర్తులు. ఆయన మనవరాలు వైష్ణవిని చంపడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ ఆపద నుంచి గట్టెక్కించడానికి ఆ ఇంట్లో పని చేస్తున్న మకరంద్ దేశపాండే సలహాపై చంబల్ లోని మహారాజ్ (బాలకృష్ణ) అనే మోస్ట్ వాంటెడ్ కు కబురుపెడతాడు కృష్ణమూర్తి.

ఈ నేపథ్యంలో మహారాజ్ పాప ప్రాణాలు కాపాడటానికి నానాజీగా పేరు మార్చుకొని డ్రైవర్ గా చేరుతాడు. అయితే అసలు ఈ మహారాజ్ ఎవరు? ఆ పాపకి అతనికి సంబంధం ఏమిటి? మరోవైపు సినిమాలో కీలక పాత్రల్లో కనిపించే బల్వంత్ ఠాకూర్ (బాబీ డియోల్) నందిని (శ్రద్ధా శ్రీనాథ్) ఎవరు? మహారాజ్ పేరు మార్చుకొని రావాల్సిన అవసరం ఏమిటి? చివరికి ఏం జరిగింది? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ :

బాలకృష్ణ సినిమాలు అంటేనే పవర్ ఫుల్ డైలాగ్స్ , యాక్షన్స్ సీన్లు, ఎలేవేషన్స్.ఇవే అయన సినిమాలనుండి ఫ్యాన్స్ కోరుకునేది. ఈసినిమాలోకూడా ఇవి కావాల్సినవన్ని వున్నాయి. డైరెక్టర్ బాబీ బాలకృష్ణ ను ప్రజెంట్ చేసిన తీరును మెచ్చుకోవాల్సిందే. ఇందులో రెండు షేడ్స్ లో కనిపించాడు బాలకృష్ణ.సినిమా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఇంట్రో సీన్ నుండి ఇంటర్వెల్ వరకు ఎక్కడా హై తగ్గకుండా ఎంటర్టైన్ చేస్తుంది.ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశాలు సెకండ్ హాఫ్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాయి.ఇక సెకండ్ హాఫ్ కూడా ఎంగేజింగ్ ఉండి ఫస్ట్ హాఫ్ ఇచ్చిన హై ను కంటిన్యూ చేస్తుంది.ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. ఎమోషన్ కూడా బాగా వర్క్ అవుట్ అయ్యింది.

బాలకృష్ణను ఈసినిమాలో బాబీ నెవర్ బిఫోర్ అనేలా చూపించాడు. ఎలివేషన్ సీన్లు ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇస్తాయి.బాలకృష్ణ సినిమానుండి ఏవైతే ఆశిస్తారో అన్ని ఇందులో వున్నాయి. ప్రాపర్ కమర్షియల్ మూవీని అందించడంలో డైరెక్టర్ బాబీ విజయం సాధించాడు.బాలకృష్ణ డైలాగ్స్ ,యాక్షన్స్ సీక్వెన్స్ ,తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్,విజువల్స్ సినిమాలో హైలైట్ అయ్యాయి. ఈసినిమా బాలకృష్ణ కు మరో విజయాన్ని అందించిందని చెప్పొచ్చు.

ఇక నటీనటుల విషయానికి వస్తే బాలకృష్ణ నటన సినిమాకు ప్రధాన బలం.స్క్రీన్ మీద చాలా ఎనర్జిటిక్ గా కనిపించాడు.యాక్షన్ సన్నివేశాలను కూడా బాగా చేశాడు. ఇందులో ముగ్గురు హీరోయిన్లు వున్నారు. శ్రద్దా శ్రీనాథ్ ,ప్రగ్యా జైస్వాల్ ,ఊర్వశి రౌతేలా.వీరి ముగ్గురికి మంచి పాత్రలు దక్కాయి.విలన్ రోల్ లో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ అదరగొట్టాడు. చాందిని చౌదరి కీలక పాత్రలో కనిపించింది.

టెక్నికల్ గా సినిమా ఉన్నంతగా వుంది.సినిమాటోగ్రఫీ స్టన్నింగ్ అనిపిస్తుంది.విజయ్ కార్తీక్ చాలా క్వాలిటీ విజువల్స్ ఇచ్చాడు.తమన్ సంగీతం, బీజీఎమ్ ప్లస్ అని చెప్పొచ్చు.ముఖ్యంగా ఎలివేషన్ సీన్లకు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు.బాలకృష్ణ సినిమాలకు తమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇస్తాడని పేరుంది. ఈ సినిమాతో మరోసారి నిరూపించాడు.ఎడిటింగ్ కూడా బాగుంది.నిర్మాతలు సినిమాకు ఏం కావాలో అది చేశారు.హై క్యాలిటీ తో సినిమాను నిర్మించారు.

ఓవరాల్ గా భారీ అంచనాల మధ్య డాకు మహారాజ్ ఆ అంచనాలను అందుకొందని చెప్పొచ్చు.ఇందులో బాలకృష్ణ నటన , డైరెక్షన్ ,యాక్షన్ సీక్వెన్స్ , బీజీఎమ్ ,విజువల్స్ హైలైట్ అయ్యాయి. ఈసంక్రాంతికి ప్రాపర్ కమర్షియల్ ఎంటర్టైనర్ ను చూడాలనుకుంటే డాకు మహారాజ్ ను చూసేయొచ్చు.ఈసినిమా ఫ్యాన్స్ ను మాత్రమే కాదు అందరిని అలరిస్తుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.