బిగ్ అనౌన్స్‌మెంట్.. బాలయ్య-బోయపాటి కాంబో షురూ

Nandamuri Balakrishna and Director Boyapati Sreenu Join Hands For New Film #BB4

టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్స్‌లో గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను కాంబో ఒకటి. ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్‌లో మూడు చిత్రాలు రాగా అన్నీ ఒకదానిని మించి ఒకటి బ్లాక్ బస్టర్ అయ్యాయి. తొలిసారిగా వీరి కాంబోలో వచ్చిన మూవీ ‘సింహా’. 2010లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఆ తర్వాత 2014లో ‘లెజెండ్’ సినిమాతో మరోసారి సూపర్ హిట్ అందుకున్నారు. అనంతరం 2021లో ‘అఖండ’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుని హ్యాట్రిక్ సాధించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీంతో బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబో మళ్ళీ రిపీట్ కావాలని నందమూరి అభిమానులు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిని సర్‌ప్రైజ్ చేస్తూ బిగ్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. మరోసారి బాలయ్య, బోయపాటి శ్రీను కాంబోలో కొత్త చిత్రం (#BB4) రూపొందనున్నట్లు ప్రకటన వచ్చింది. ఈ మేరకు తాజాగా సోమవారం బాలకృష్ణ జన్మదినం సందర్భంగా ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించింది. ఈ సందర్భంగా అనౌన్స్‌మెంట్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రబృందం.

ఇక ఈ పోస్టర్‌ను గమనిస్తే బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక పెద్ద కోటపై భారీ రథచక్రం కనిపిస్తోంది. వర్కింగ్ టైటిల్ #BB4 అని ఉండగా.. 4కి రుద్రాక్ష బ్రాస్‌లెట్‌ కట్టబడివుంది. ఇంకా ఎర్రటి సూర్యుడి వెలుగులు పడి వింత శోభతో మెరుస్తున్న దట్టమైన మేఘాలు, అలాగే నింగి నుంచి వేగంగా దూసుకొస్తున్న తోకచుక్కలు.. ఇలా అద్భుతంగా డిజైన్ చేసి ఉంది. కాగా ఈ పోస్టర్ ఆకట్టుకునేలా, సినిమాపై ఆసక్తిని కలిగించేలావుంది. ఇక ఈ చిత్రం కోసం అగ్రశ్రేణి సాంకేతిక సిబ్బంది పనిచేయనున్నారు. #BB4కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.

కాగా రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మాణ్ సారధ్యంలో బాలకృష్ణ చిన్న కుమార్తె ఎం తేజస్విని సమర్పణలో #BB4 తెరకెక్కతుండటం విశేషం. కాగా ఇంతకుముందు 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై ‘లెజెండ్’ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాలకృష్ణ, బోయపాటి కాంబో నాలుగోసారి రిపీట్ కానుండగా.. #BB4 చిత్రంతో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ వీరితో రెండోసారి జట్టుకడుతోంది. దీంతో మేకర్స్ #BB4ని భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.