
ట్యాగ్ · 127 కథనాలు


శర్వా 38లో హీరోయిన్ ఫిక్స్

పరదా నుండి స్పెషల్ ప్రోమో రిలీజ్

రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ట్రైలర్ రిలీజ్

పరదా నా కెరీర్ లోనే ఫేవరేట్ ఫిలిం - అనుపమ

అనుపమ పరమేశ్వరన్ పరదా టీజర్ రిలీజ్

అనుపమ చేతిలో నాలుగు సినిమాలు

మీ లవ్, సపోర్ట్ కు థ్యాంక్స్

ఈగల్ లో లాస్ట్ 40నిమిషాలు .. బ్లాస్ట్

టిల్లు స్క్వేర్ గట్టిగానే వర్కౌట్ అయ్యేలావుంది

జయంరవి సైరెన్ ట్రైలర్ రిలీజ్

ఈగల్ అక్కడ సహదేవ్ గా

టిల్లు స్క్వేర్ సెకండ్ సింగిల్ ప్రోమో రిలీజ్

టిల్లు స్క్వేర్ విడుదల వాయిదా

పరదా నుంచి మా అందాల సిరి సాంగ్ రిలీజ్
తన తొలి సినిమా 'సినిమా బండి' ప్రశంసలు అందుకున్న దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల ఇప్పుడు తన రెండవ చిత్రం 'పరదా'తో వస్తున్నారు. మోస్ట్ ట్యాలెంటెడ్ అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత వంటి అద్భుతమైన తారాగణం ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో పాపులరైన రాజ్, డికె ఈ చిత్రానికి మద్దతు ఇస్తున్నారు.

శర్వా 38లో హీరోయిన్ ఫిక్స్
యంగ్ హీరో శర్వానంద్ వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా వున్నాడు.ప్రస్తుతం అతని చేతిలో మూడు సినిమాలు వున్నాయి.అందులో రెండు సెట్స్ మీద ఉండగా మరొకటి ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది.అదే సంపత్ నంది తో చేయనున్న 38వ సినిమా.యాక్షన్ ఎంటర్టైనర్ గా రానుంది.ఇక ఈసినిమాకు హీరోయిన్ ను ఫిక్స్ చేశారు.ఇందులో అనుపమ పరమేశ్వరన్,శర్వా కు జంటగా నటించనుంది.ఇంతకుముందు వీరిద్దరు కలిసి శతమానం భవతి లో నటించారు.ఆసినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇక ఇప్పుడు చాలా గ్యాప్ తరువాత మళ్ళీ కలిసి నటించనున్నారు.

పరదా నుండి స్పెషల్ ప్రోమో రిలీజ్
అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా పరదా.రీసెంట్ గా రిలీజైన టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఈరోజు అనుపమ బర్త్ డే సందర్భంగా స్పెషల్ ప్రోమోను రిలీజ్ చేశారు.ఇందులో అనుపమ పరదాలు అమ్మడం ప్రాక్టీస్ చేస్తూ కనిపించింది. పక్కా రూరల్ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది ఈసినిమా.

రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ట్రైలర్ రిలీజ్
లవ్ టుడే సినిమాతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు తమిళ యంగ్ డైరెక్టర్ & హీరో ప్రదీప్ రంగనాథన్.ఈసినిమాను తనే డైరెక్ట్ చేశాడు.ఇక ఈసినిమా తరువాత తను హీరోగా వస్తున్న సినిమా డ్రాగన్.తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ గా విడుదలకానుంది.నిన్న ట్రైలర్ ను రిలీజ్ చేశారు.ఈ ట్రైలర్ ప్రామిసింగ్ గా అనిపించింది.లవ్ టుడే లాగా ఇది కూడా యూత్ టార్గెట్ గా తెరకెక్కింది.ఇంజినీరింగ్ లో చేరి జల్సాలు చేసిన హీరో ఆ తరువాత ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు.చివరికి లైఫ్ లో సక్సెస్ కోసం ఏం చేశాడు అనే కథతో వస్తుంది.

పరదా నా కెరీర్ లోనే ఫేవరేట్ ఫిలిం - అనుపమ
అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, ప్రముఖ నటి సంగీత లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా పరదా. సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల ఈసినిమాను తెరకెక్కిస్తుండగా గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు.ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో పాపులరైన రాజ్, డికె ఈ చిత్రానికి మద్దతు ఇస్తున్నారు.ఇక నిన్న ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.

అనుపమ పరమేశ్వరన్ పరదా టీజర్ రిలీజ్
మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ గతేడాది 'టిల్లు స్క్వేర్' మూవీతో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ సినిమా ఇచ్చిన జోష్ తో ఆమె ఇప్పుడు 'పరదా' అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాకు 'సినిమా బండి' ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంతో మరో ప్రముఖ మలయాళీ హీరోయిన్ దర్శన రాజేంద్రన్ తొలిసారిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. సీనియర్ నటి సంగీత ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.

2024 నేషనల్ అవార్డ్స్- బెస్ట్ తెలుగు చిత్రం కార్తికేయ2
ప్రతి ఏడాది నేషనల్ అవార్డ్స్ ను ప్రకటిస్తారన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈ ఏడాది కూడా 70వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించారు. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో నిర్మించిన సినిమాలను పరిగణలోకి తీసుకొని దాదాపు 11మంది జ్యూరీ సభ్యులు సినిమాలను పరిశీలించి అవార్డులను ప్రకటిస్తారు. ఈమేరకు డిసెంబర్ 31 2022 నాటికి సెన్సార్ అయిన చిత్రాలకు అవార్డులను అందిస్తుంది. దీనిలో భాగంగానే తాజాగా 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల జాబితాను ప్రకటించారు.

అనుపమ చేతిలో నాలుగు సినిమాలు
మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ చేతినిండా ఆఫర్ల తో ప్రస్తుతం ఫుల్ బిజీ మోడ్ లో వుంది.రీసెంట్ గా టిల్లు స్క్వేర్ తో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన ఈ హీరోయిన్ ఏకంగా నాలుగు సినిమాలను లైన్లో పెట్టింది.అందులో మూడు ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు వున్నాయి. అందులో ఒకటి పరదా.సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల తెరకెక్కిస్తున్న ఈసినిమాలో అనుపమతోపాటు దర్శన రాజేంద్రన్,సంగీత లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.

మీ లవ్, సపోర్ట్ కు థ్యాంక్స్
కెరీర్ ప్రారంభంలోనే పలు హిట్లను తన ఖాతాలో వేసుకుంది టాలెంటెడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. తన ఉంగరాల జుట్టుతో, అభినయంతో ఎంతో మంది యువతకు క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. అయితే మధ్యలో కాస్త ఫ్లాప్స్ తో కెరీర్ డల్ అయినా ఇప్పుడు మాత్రం వరుసగా సినిమాలను చేస్తూ బిజీ అయిపోయింది. ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉండగా త్వరలో రిలీజ్ కాబోతున్న సినిమా టిల్లు స్క్వేర్. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

ఈగల్ రిలీజ్ వేళ.. రవితేజపై హరీష్ శంకర్ ట్వీట్, నెట్టింట వైరల్
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఈగల్'. యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించగా… నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రీమియర్ షోల నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. ఇక విడుదలకు ముందే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో సినిమా ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

రవితేజ ఈగల్ రివ్యూ
ఓవరాల్ గా మంచి అంచనాల మధ్య వచ్చిన ఈగల్ అంచనాలను అందుకుంది అని చెప్పొచ్చు.ఫస్ట్ హాఫ్ డీసెంట్ అనిపించుకోగా సెకండ్ హాఫ్ సూపర్ అనేలా వుంది.రవితేజ ఫ్యాన్స్ కు అలాగే యాక్షన్ లవర్స్ కు ఈసినిమా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.మిగితా వారు కూడా ఒకసారి చూసేయొచ్చు.

ఈగల్ లో లాస్ట్ 40నిమిషాలు .. బ్లాస్ట్
మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఈగల్ మరి కొన్ని గంటల్లో థియేటర్లలోకి రానుంది. ప్రమోషన్స్ భారీగా చేశారు.హైప్ కూడా వచ్చింది.రవితేజ అయితే సినిమా విజయం ఫై కాన్ఫిడెంట్ గా వున్నాడు.బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా పెద్దది ఏం కాదు.23కోట్ల షేర్ రాబడితే చాలు.హిట్ టాక్ వస్తే ఈ టార్గెట్ కేక్ వాకే. ముఖ్యంగా సినిమాలో చివరి 40నిమిషాలు అదిరిపోయిందట.

ఈగల్ కాన్సెప్ట్ లోనే విధ్వంసం వుంది-కార్తీక్ ఘట్టమనేని
మాస్ మహారాజా రవితేజ నటించిన మోస్ట్ ఎవైటెడ్ స్టయిలీష్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 9న ఈగల్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఈసినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

టిల్లు స్క్వేర్ గట్టిగానే వర్కౌట్ అయ్యేలావుంది
డీజే టిల్లు తో యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ.రెండేళ్ల క్రితం విడుదలైన ఈసినిమా బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.ఇక ఈసినిమాకు సీక్వెల్ కూడా రెడీ అవుతుంది.టిల్లు స్క్వేర్ అనే టైటిల్ తో వస్తున్నఈసినిమాలో సిద్దుకు జోడీగా అనుపమా పరమేశ్వరన్ నటిస్తుండగా మల్లిక్ రామ్ డైరెక్ట్ చేస్తున్నాడు.ఆల్మోస్ట్ షూటింగ్ కూడా పూర్తి అయ్యింది. ఈసినిమానుండి నిన్న సిద్దూ బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేశారు.

జయంరవి సైరెన్ ట్రైలర్ రిలీజ్
ఆంటోనీ భాగ్యరాజ్ దర్శకత్వంలో జయం రవి హీరోగా వస్తున్న సినిమా సైరెన్ 108. అన్నాత్తే, విశ్వాసం, హీరో సినిమాలకు రచయితగా పనిచేసిన ఆంటోని ఈసినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రివేంజ్ డ్రామాగా ఈసినిమా రాబోతుంది. ఈసినిమా ప్రస్తుతం అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది.

ఈగల్ అక్కడ సహదేవ్ గా
మాస్ రాజా రవితేజ ఈగల్ షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా విడుదల వాయిదా పడనుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి అయితే నిర్మాతలు రిలీజ్ విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చారు.సంక్రాంతికి సినిమా విడుదలవుతుందని తెలిపారు.ఇక ఈసినిమా తెలుగుతోపాటు హిందీలోకూడా విడుదలకానుంది.

టిల్లు స్క్వేర్ సెకండ్ సింగిల్ ప్రోమో రిలీజ్
టాలీవుడ్ యంగ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ టిల్లు స్క్వేర్. ఈసినిమా డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. విమల్ కృష్ణ దర్శకత్వంలో యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈసినిమా గత ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టింది. యూత్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు టిల్లు స్క్వేర్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. నిజానికి ఈసినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సింది కానీ సినిమా పనులు ఇంకా పెండింగ్ లో ఉండటంతో రిలీజ్ డేట్ ను వాయిదా వేస్తూ ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 9వ తేదీన ఈసినిమాను రిలీజ్…

టిల్లు స్క్వేర్ విడుదల వాయిదా
బ్లాక్ బాస్టర్ డీజే టిల్లుకు సీక్వెల్ గా వస్తున్న చిత్రం టిల్లు స్క్వేర్. సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్నారు.ఈసినిమాఫై మంచి అంచనాలు వున్నాయి.అయితే ఇంతకుముందు ఈసినిమాను సెప్టెంబర్ 15న విడుదలచేయాలని మేకర్స్ భావించారు.ఈ డేట్ ను అఫీషియల్ గా కూడా ప్రకటించారు. కానీ ఇప్పుడు అనుకున్న సమయానికి విడుదలచేయలేకపోతున్నారు.దాంతో విడుదల వాయిదా పడింది.

టిల్లు స్క్వేర్ నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్
బ్లాక్ బాస్టర్ మూవీ డీజే టిల్లు కు సీక్వెల్ గా వస్తున్న సినిమా టిల్లు స్క్వేర్.యంగ్ సెన్సేషన్ సిద్దు జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న ఈసినిమాను మల్లిక్ రామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.ఇక ఈసినిమా నుండి ఫస్ట్ సాంగ్ లిరికల్ వీడియో ను కొద్దీ సేపటి క్రితం విడుదలచేశారు.టిక్కెట్టే కొనకుండా అంటూ సాగే ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా రామ్ మిర్యాల సంగీతం అందించాడు అంతే కాదు తనే పాడాడు.క్యాచీ లిరిక్స్ తో రిపీట్ వాల్యూమ్ వున్నా ఈ సాంగ్ సూపర్ హిట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.లిరికల్ వీడియో లో అనుపమా చాలా గ్లామర్ కనిపించింది. ఈ సాంగ్ కి జానీ మాస్టర్…

టిల్లు స్క్వేర్ నుండి సాంగ్ ప్రోమో రిలీజ్
మచ్ అవైటెడ్ సీక్వెల్ టిల్లు స్క్వేర్ నుండి మొదటి సాంగ్ టిక్కెట్టే కొనకుండా ఈనెల 26న విడుదలకానుంది.ఈసంధర్భంగా కొద్దీ సేపటి క్రితం ఈ సాంగ్ ప్రోమో ను విడుదలచేశారు మేకర్స్.ఇక ఈప్రోమో ఇంట్రెస్టింగ్ గా వుంది.పాటకు సంబంధించిన ప్రోమో అయినా ఆ సాంగ్ కు ముందు జరిగే సీన్ ను ప్రోమోగా రిలీజ్ చేశారు.హీరో సిద్దు జొన్నలగడ్డ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ ను మొదటి సారి చూసి మనసు పారేసుకుంటాడు ఆసందర్భంలో వచ్చే సాంగ్ ఇది.ప్రోమోలో అనుపమా ఇంతకుముందు ఎప్పుడు కనిపించని విధంగా చాలా గ్లామర్ గా కనబడి షాక్ ఇచ్చింది.ఇక ఈప్రోమో చూస్తుంటే టిల్లు స్క్వేర్, డీజే టిల్లు కు మించి వుండేలానే వుంది.