అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా పరదా.రీసెంట్ గా రిలీజైన టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఈరోజు అనుపమ బర్త్ డే సందర్భంగా స్పెషల్ ప్రోమోను రిలీజ్ చేశారు.ఇందులో అనుపమ పరదాలు అమ్మడం ప్రాక్టీస్ చేస్తూ కనిపించింది. పక్కా రూరల్ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది ఈసినిమా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఓవరాల్ గా అనుపమ ఇంతకుముందు ఎప్పుడు చేయని పాత్ర చేస్తుండడంతో సినిమా పై అంచనాలు ఏర్పడ్డాయి.సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల ఈసినిమాను తెరకెక్కిస్తుండగా గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు.ఆనంద మీడియా ఈసినిమాను నిర్మిస్తుంది.
ఇక అనుపమ తమిళంలో నటించిన డ్రాగన్ మరో మూడు రోజుల్లో థియేటర్లలోకి రానుంది.తెలుగులో ఈసినిమా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ గా విడుదలకానుంది.లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించగా అశ్వత్ మరిముతు డైరెక్ట్ చేశాడు.
దింతో పాటు అనుపమ తమిళంలో బైసన్ అనే సినిమా కూడా కంప్లీట్ చేసింది.విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా నటిస్తున్న ఈసినిమాను మరి సెల్వరాజ్ తెరకెక్కిస్తున్నాడు.నిన్నటితో షూటింగ్ కంప్లీట్ అయ్యింది.తెలుగు విషయానికి వస్తే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 11వ సినిమాలో అనుపమ హీరోయిన్ గా నటిస్తుంది.కౌశిక్ పెగుళ్ళపాటి ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా షైన్ స్క్రీన్స్ నిర్మిస్తుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























