మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఈగల్’. యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించగా… నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రీమియర్ షోల నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. ఇక విడుదలకు ముందే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో సినిమా ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో ‘ఈగల్’ సినిమా బాగుందంటూ ఈ ఉదయం నుంచే సోషల్ మీడియాలో నెటిజెన్లు పోస్టులు పెడుతున్నారు. కాగా దీనికిముందు వచ్చిన ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా రవితేజకు చేదు ఫలితాన్నే మిగిల్చింది. దీంతో ఈ సినిమాపై ఆయనతో పాటుగా ఫ్యాన్స్ కూడా ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో వచ్చిన ఈగల్.. అంచనాలకు తగ్గట్లే హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా రవితేజతో ప్రస్తుతం ‘మిస్టర్ బచ్చన్’ సినిమాను తెరకెక్కిస్తున్న క్రేజీ డైరెక్టర్ హరీష్ శంకర్ స్పందించారు.
Stylish director @harish2you drops this BTS click of Mass Maharaja @Raviteja_offl from the sets of #MrBachchan and extends his wishes for the movie #Eagle! 📸❤️🔥#RaviTeja #HarishShankar #TeluguFilmNagar pic.twitter.com/7hfMOuvWAJ
— Telugu FilmNagar (@telugufilmnagar) February 9, 2024
ఈ మేరకు హరీష్ శంకర్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. అందులో ఆయన ఇలా తెలిపారు.. “ఈగల్ సినిమాకు అన్ని ప్రాంతాల నుండి భారీ స్పందన వినబడుతోంది. అయితే మాస్ మహారాజాని స్క్రీన్‌పై మిస్ అవుతున్నా.. కానీ లొకేషన్‌లో ఆయనతో చాలా ఎంజాయ్ చేస్తున్నా” అని పేర్కొన్నారు హరీష్ శంకర్. కాగా వీరి కాంబోలో గతంలో వచ్చిన ‘మిరపకాయ్’ సూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో ‘మిస్టర్ బచ్చన్’తో మరోసారి వీరు కలిసి పనిచేస్తున్నారు. దీంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: