లవ్ టుడే సినిమాతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు తమిళ యంగ్ డైరెక్టర్ & హీరో ప్రదీప్ రంగనాథన్.ఈసినిమాను తనే డైరెక్ట్ చేశాడు.ఇక ఈసినిమా తరువాత తను హీరోగా వస్తున్న సినిమా డ్రాగన్.తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ గా విడుదలకానుంది.నిన్న ట్రైలర్ ను రిలీజ్ చేశారు.ఈ ట్రైలర్ ప్రామిసింగ్ గా అనిపించింది.లవ్ టుడే లాగా ఇది కూడా యూత్ టార్గెట్ గా తెరకెక్కింది.ఇంజినీరింగ్ లో చేరి జల్సాలు చేసిన హీరో ఆ తరువాత ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు.చివరికి లైఫ్ లో సక్సెస్ కోసం ఏం చేశాడు అనే కథతో వస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అనుపమా పరమేశ్వరన్ , కయదు లోహర్ హీరోయిన్లు గా నటించగా ఓరి దేవుడా ఫేమ్ అశ్వత్ మరిముత్తు ఈసినిమాను తెరకెక్కించాడు.లియోన్ జేమ్స్ సంగీతం అందించాడు.ప్రముఖ నిర్మాణ సంస్థ ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తుంది.ఇక తమిళంలో ఈసినిమాకు హైప్ మాములుగా లేదు.ట్రైలర్ 24గంటల్లోపే 10 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టుకొని ట్రెండింగ్ లో కొనసాగుతుంది.తెలుగులో 1 మిలియన్ మార్క్ చేరువలో వుంది.
ఈనెల 21న ఈసినిమా రిలీజ్ కానుంది.అయితే అదే రోజు ధనుష్ డైరెక్ట్ చేసిన నీక్ సినిమా కూడా విడుదలవుతుంది.తెలుగులో ఈసినిమా జాబిలమ్మ నీకు అంత కోపమా అనే టైటిల్ తో విడుదలకానుంది.ఇది కూడా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వస్తుంది.దాంతో డ్రాగన్ కు బాక్సాఫీస్ వద్ద పోటీ ఎదురుకానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: