మచ్ అవైటెడ్ సీక్వెల్ టిల్లు స్క్వేర్ నుండి మొదటి సాంగ్ టిక్కెట్టే కొనకుండా ఈనెల 26న విడుదలకానుంది.ఈసంధర్భంగా కొద్దీ సేపటి క్రితం ఈ సాంగ్ ప్రోమో ను విడుదలచేశారు మేకర్స్.ఇక ఈప్రోమో ఇంట్రెస్టింగ్ గా వుంది.పాటకు సంబంధించిన ప్రోమో అయినా ఆ సాంగ్ కు ముందు జరిగే సీన్ ను ప్రోమోగా రిలీజ్ చేశారు.హీరో సిద్దు జొన్నలగడ్డ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ ను మొదటి సారి చూసి మనసు పారేసుకుంటాడు ఆసందర్భంలో వచ్చే సాంగ్ ఇది.ప్రోమోలో అనుపమా ఇంతకుముందు ఎప్పుడు కనిపించని విధంగా చాలా గ్లామర్ గా కనబడి షాక్ ఇచ్చింది.ఇక ఈప్రోమో చూస్తుంటే టిల్లు స్క్వేర్, డీజే టిల్లు కు మించి వుండేలానే వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటున్న టిల్లు స్క్వేర్ ను మల్లిక్ రామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. రామ్ మిర్యాల,శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా నాగవంశీ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.ఈసెప్టెంబర్ 15న ఈసినిమా ప్రేక్షకులముందుకు రానుంది.ఇక డీజే టిల్లు బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్ గా వస్తున్న టిల్లు స్క్వేర్ ఫై భారీ అంచనాలు వున్నాయి.మరి ఈసినిమా ఆఅంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: