
ట్యాగ్ · 17 కథనాలు


వెంకీ 76 గురించి క్లారిటి ఇచ్చిన డైరెక్టర్

గ్రాండ్‌గా ప్రారంభమైన వెంకీ-అనిల్ రావిపూడి మూవీ

వెంకటేష్, అనిల్ రావిపూడి హ్యాట్రిక్ మూవీ షురూ

హీరో అవ్వాలన్న ఆశ లేదు..!

పోల్ గేమ్ : టాలీవుడ్ బెస్ట్ డైరెక్టర్ ?

పాన్ ఇండియా సినిమాలు తీయను..!

'ఎఫ్ 3' ఫస్ట్ సింగిల్ అప్ డేట్

మెహరీన్ కు బంపర్ ఆఫర్ ?

మెగా ఆఫర్ కోసం ఎదురు చూస్తున్నా - అనిల్ రావిపూడి

కూల్ డైరెక్టర్ కు హ్యాపీ బర్త్ డే

బాలకృష్ణ తో సీరియస్ యాక్షన్ డ్రామ

వరుస ప్రాజెక్ట్స్ తో బాలకృష్ణ

ముగింపు దశలో "F3 "

చిరు -అనిల్ మూవీ రేపే లాంఛ్
మెగా స్టార్ చిరంజీవి ,సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. రేపు ఉగాదికి ఈసినిమా లాంఛ్ కానుంది. రామానాయుడు స్టూడియో లో పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించనున్నారు.జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుగనుంది.సినిమాను తొందరగా పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలచేయనున్నారు.

ఈ అవార్డ్ తీసుకోవడం గర్వంగా ఫీలౌతున్నా - అనిల్ రావిపూడి
''విజయకృష్ణా సిల్వర్ క్రౌన్ అవార్డ్ తీసుకోవడం చాలా సంతోషంగా వుంది. కృష్ణ గారు రియల్ సూపర్ స్టార్. విజయ నిర్మల గారు ఆడపులి. వారి పేరు మీద ఈ అవార్డ్ ని తీసుకోవడం గర్వంగా ఫీలౌతున్నాను" అని అన్నారు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ మేరకు ఆయన ప్రముఖ నటీమణి, దర్శకురాలు విజయనిర్మల గారి జయంతి సందద్భంగా విజయకృష్ణా సిల్వర్ క్రౌన్ అవార్డ్ 2025ని అందుకున్న సందర్భంగా వ్యాఖ్యానించారు.

వెంకీ 76 గురించి క్లారిటి ఇచ్చిన డైరెక్టర్
విక్టరీ వెంకటేష్,అనిల్ రావిపూడి కాంబినేషన్ లో మూడో సినిమా తెరకెక్కనుందని తెలిసిందే.రెండు రోజుల క్రితం లాంఛ్ కూడా అయ్యింది.ఈ నెల మూడో వారం నుండి షూటింగ్ కూడా మొదలుకానుంది.నవంబర్ కల్లా పూర్తి చేయనున్నారు.ఇక ఈసినిమా లో మరో హీరో కూడా ఉంటాడని వార్తలు వచ్చాయి.అయితే ఈ న్యూస్ పై స్పందించాడు అనిల్ రావిపూడి.ఇందులో వెంకటేష్ గారు ఒక్కరే హీరో మరో హీరో లేడు.ఇది ఎఫ్ 4 కాదు వేరే జోనర్ లో రానుంది.వచ్చే సంక్రాంతి కి విడుదలకానుందని క్లారిటీ ఇచ్చాడు.ఇందులో ఐశ్వర్య రాజేష్,మీనాక్షి చౌదరి ఫిమేల్ లీడ్ రోల్స్ లో కనిపించనున్నారు.భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు.మరి వెంకీ ,అనిల్…

గ్రాండ్‌గా ప్రారంభమైన వెంకీ-అనిల్ రావిపూడి మూవీ
టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ మరియు డైరెక్టర్ అనిల్ రావిపూడి కలయికలో కొత్త చిత్రం తెరకెక్కనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. మరో కథానాయికగా 'గుంటూరు కారం' ఫేమ్ మీనాక్షి చౌదరి కనిపించనుంది.

వెంకటేష్, అనిల్ రావిపూడి హ్యాట్రిక్ మూవీ షురూ
టాలీవుడ్‌లోని క్రేజీ కాంబినేషన్‌లలో ఒకటి స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ మరియు డైరెక్టర్ అనిల్ రావిపూడి. వీరి కలయికలో ఇంతకుముందు వచ్చిన 'ఎఫ్ 2', 'ఎఫ్ 3' చిత్రాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిన విషయమే. తాజాగా మరోసారి ఈ కాంబినేషన్‌లో కొత్త మూవీ రాబోతోంది. కాగా ఈ చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించి ఓ కీలక అప్‌డేట్ అందించింది చిత్ర బృందం.

బాలయ్య పాటతో అదరగొట్టిన కాజల్, శ్రీలీల
నట సింహం బాలకృష్ణ, సక్సెస్ పుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా భగవంత్ కేసరి. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈసినిమా రూపొందుతుంది. ఈ కాంబినేషన్ సెట్ అయినప్పటినుండే సినిమాకు మరింత హైప్ పెరిగింది. ఇక ఈసినిమా నుండి వరుసగా అప్ డేట్లు ఇస్తూ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా ఫస్ట్ లుక్, టీజర్‌ను రిలీజ్ చేయగా.. ఆ తర్వాత ఇందులో ఓ కీలక పాత్రలో నటిస్తున్న శ్రీలీల లుక్‌ని కూడా ఆమె బర్త్‌డే సందర్భంగా విడుదల చేశారు. కాజల్ అగర్వాల్ బర్త్‌డే స్పెషల్‌గా ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ని మేకర్స్ వదిలారు. ప్రస్తుతం అయితే షూటింగ్ ను ముగించుకునే పనిలో ఉన్నారు.

అనిల్ రావిపూడి కిల్లింగ్ డ్యాన్స్
డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. పటాస్ తో డైరెక్టర్ గా కెరీర్ మొదలుపెట్టిన అనిల్ రావిపూడి ఆ సినిమా తరువాత వెనక్కి తిరిగి చూసుకేలేదు ఇప్పటివరకూ. పటాస్ దగ్గర నుండి చివరిగా వచ్చిన ఎఫ్3 వరకూ అన్నీ హిట్ లనే అందుకున్నాడు. ప్రస్తుతం అనిల్ నటసింహం బాలకృష్ణ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

హీరో అవ్వాలన్న ఆశ లేదు..!
డాక్టర్ కావాలనుకొని యాక్టర్ అయ్యాను అంటూ పలువురు పలు సందర్భాల్లో అనడం చూస్తుంటాం. అలానే ఇండస్ట్రీలో కూడా కొంతమంది ఏదో కావాలనుకుంటారు.. కానీ ఇండస్ట్రీలో సెటిల్ అవుతారు. ఇక కొంతమంది ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలనుకున్నా పలు కారణాల వల్ల సెటిల్ అవ్వలేరు. అయితే ఓ డైరెక్టర్ మాత్రం అయితే మాములు ఆర్టిస్ట్అవుతా కానీ హీరో మాత్రం అవ్వను అంటున్నాడు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు టాలీవుడ్ వరుస హిట్లతో టాప్ డైరెక్టర్ గా ఉన్న అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఎఫ్ 3 సినిమా మే 27న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది.

పోల్ గేమ్ : టాలీవుడ్ బెస్ట్ డైరెక్టర్ ?
రాజమౌళి : స్వప్న సినిమా బ్యానర్ పైఎస్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “స్టూడెంట్ నెం 1” మూవీ తో ఎస్ ఎస్ రాజమౌళి టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. దర్శకుడు రాజమౌళి ఈ మూవీ లో యాక్షన్ సీన్స్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించారు. "సింహాద్రి ", "సై ", "ఛత్రపతి ", "విక్రమార్కుడు ", "యమదొంగ ", "మగధీర ", "మర్యాద రామన్న ", "ఈగ ","బాహుబలి ", "బాహుబలి 2" వంటి సూపర్ హిట్ మూవీస్ తో రాజమౌళి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "బాహుబలి "మూవీ తో రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటారు. రామ్ చరణ్ , ఎన్టీఆర్ లు హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన "ఆర్ ఆర్ ఆర్ "మూవీ ప్రపంచవ్యాప్తంగా…

పాన్ ఇండియా సినిమాలు తీయను..!
ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల క్రేజ్ ఎక్కువైన సంగతి తెలిసిందే కదా. ఏ ఇండస్ట్రీలో చూసినా పెద్ద హీరోలు, స్టార్ డైరెక్టర్లు పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దాదాపు పెద్ద హీరోల నుండి సినిమా అంటే పాన్ ఇండియా రేంజ్ లోనే చేయడానికే మేకర్స్ కూడా ఎక్కువగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ తాను మాత్రం పాన్ ఇండియా సినిమాలు తీయలేనంటున్నాడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్. ఆ డైరెక్టర్ ఎవరో కాదు అనిల్ రావిపూడి.

'ఎఫ్ 3' ఫస్ట్ సింగిల్ అప్ డేట్
విక్టరీ వెంకటేష్,. వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న లేటెస్ట్ చిత్రం ఎఫ్ 3. గతంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ఎఫ్ 2కు సిక్వెల్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా షూటింగ్ ఇటీవలే పూర్తవ్వగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టేశారు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ “లబ్ డబ్ లబ్ డబ్” అనే పాట ప్రోమోను రేపు ఉదయం 10:08 గంటలకు రిలీజ్ చేయబోతున్నారు. ఫుక్…

మెహరీన్ కు బంపర్ ఆఫర్ ?
సక్సెస్ ఫుల్ “కృష్ణ గాడి వీర ప్రేమ గాథ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పంజాబీ బ్యూటీ మెహరీన్ “మహానుభావుడు “, రాజా ది గ్రేట్ “,” F 2:ఫన్ &ఫ్రస్టేషన్ “వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. మెహరీన్ ప్రస్తుతం ” F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ “F 3 “మూవీలో కథానాయికగా నటిస్తున్నారు. శివరాజ్‌కుమార్ కథానాయకుడిగా రూపొందనున్న కన్నడ మూవీ, హవీష్ కోనేరు హీరోగా ఒక రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ కి మెహరీన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న "ఘోస్ట్ " మూవీ లో హీరో నాగార్జున కు జోడీగా మెహరీన్ ఎంపిక అయినట్టు సమాచారం.

మెగా ఆఫర్ కోసం ఎదురు చూస్తున్నా - అనిల్ రావిపూడి
పలు సూపర్ హిట్ మూవీస్ కు డైలాగ్ ,స్క్రీన్ ప్లే రైటర్ గా పనిచేసిన అనిల్ రావిపూడి సూపర్ హిట్ "పటాస్" మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. "సుప్రీమ్ ", "రాజా ది గ్రేట్", "F 2":ఫన్ & ఫ్రస్టేషన్", "సరిలేరు నీకెవ్వరు "వంటి సూపర్ హిట్ మూవీస్ ను అద్భుతంగా తెరకెక్కించి అనిల్ ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం అనిల్"F 2":ఫన్ & ఫ్రస్టేషన్" మూవీ సీక్వెల్ "F 3 "మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆ మూవీ ముగింపు దశలో ఉంది.

కూల్ డైరెక్టర్ కు హ్యాపీ బర్త్ డే
అనిల్ రావిపూడి సినిమాల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కామెడీనే ప్రధానంగా చేసుకునే తన సినిమాలు అటు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడమే కాదు బాక్సాఫీస్ వద్ద కలక్షన్స్ కూడా కురిపిస్తుంటాయి. ‘పటాస్’ నుంచి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా వరకూ అనిల్ తీసిన సినిమాలు అన్ని సూపర్‌హిట్లుగా నిలిచాయి. ఇక వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్3 సినిమా తీస్తున్నాడు. ఇది ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ గా వస్తుంది. ఇక వెంకటేష్-వరుణ్ తేజ్ హీరోలుగా వస్తున్న ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది.

బాలకృష్ణ తో సీరియస్ యాక్షన్ డ్రామ
'సింహా', 'లెజెండ్' సినిమాల తర్వాత బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ తో మూడో సినిమా అఖండ తో వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా మరికొద్దిరోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో హ్యాట్రిక్ ఖాయం అన్న నమ్మకంతో ఉన్నారు అభిమానులు.

వరుస ప్రాజెక్ట్స్ తో బాలకృష్ణ
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరో గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ "అఖండ"మూవీ డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ,ట్రైలర్ లకు ప్రేక్షకులనుండి అనూహ్య స్పందన లభించింది. హీరో బాలకృష్ణ రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో నటించిన "అఖండ " మూవీ పై భారీఅంచనాలు నెలకొన్నాయి. "అఖండ " మూవీ తరువాత హీరో బాలకృష్ణ వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా మారారు.

ముగింపు దశలో "F3 "
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ , వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ ప్రధాన పాత్రలలో రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ "F2 "ఫన్ &ఫ్రస్టేషన్" మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. హీరో వెంకటేష్ తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా "F2 "మూవీని దర్శకుడు అనిల్ తెరకెక్కించారు.