విక్టరీ వెంకటేష్,. వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న లేటెస్ట్ చిత్రం ఎఫ్ 3. గతంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ఎఫ్ 2కు సిక్వెల్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా షూటింగ్ ఇటీవలే పూర్తవ్వగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టేశారు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ “లబ్ డబ్ లబ్ డబ్” అనే పాట ప్రోమోను రేపు ఉదయం 10:08 గంటలకు రిలీజ్ చేయబోతున్నారు. ఫుక్ లిరికల్ సాంగ్‌ను ఫిబ్రవరి 7వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ పాటకు భాస్కర్ భట్ల సాహిత్యం అందించగా, రామ్ మిర్యాల ఆలపించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్

దిల్‌రాజు సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక F2 నటించిన తమన్నా, మెహ్రిన్ లే ఈ సినిమాలో కూడా నటిస్తుండగా.. ఇంకా ఈసినిమాలో రాజేంద్ర ప్రసాద్, సునీల్, సోనాల్ చౌహాన్ తదితరులు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్ 28నే ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ఎఫ్ 3 మేకర్స్ రీసెంట్ గానే ప్రకటించారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























