టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ మరియు డైరెక్టర్ అనిల్ రావిపూడి కలయికలో కొత్త చిత్రం తెరకెక్కనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. మరో కథానాయికగా ‘గుంటూరు కారం’ ఫేమ్ మీనాక్షి చౌదరి కనిపించనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా బుధవారం ఈ క్రేజీ ప్రాజెక్టు లాంఛనంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగిన ఈ కార్యక్రమానికి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, గీతా ఆర్ట్స్ అధినేత, అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథులుగా విచ్చేసి చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. వెంకటేష్, మీనాక్షిలపై చిత్రీకరించిన తొలి షాట్ కు అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా.. రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ వెంకటేశ్వర క్రియేషన్స్ సోషల్ మీడియా వేదికగా.. “అద్భుతమైన ప్రయాణం అధికారికంగా గ్రాండ్ పూజా కార్యక్రమంతో శుభవార్తతో ప్రారంభమైంది. ఈ అసాధారణ ట్రయాంగిల్ క్రైమ్ ఎంటర్‌టైనర్‌ను పెద్ద స్క్రీన్‌లపైకి తీసుకురావడానికి త్వరలో రెగ్యులర్ షూట్ ప్రారంభమవుతుంది” అని తెలిపింది. ఇక ఈ చిత్రంలో నటించనున్న ఇతర నటీనటులు, పనిచేయనున్న సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.
ఎక్సలెంట్ వైఫ్, ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మధ్య జరిగే కథతో ట్రయాంగిల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో వెంకటేష్ మాజీ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుండగా.. ఆయన భార్యగా ఐశ్వర్య రాజేష్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్‌గా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. కాగా వెంకటేష్, అనిల్ రావిపూడి కలయికలో ఇంతకుముందు వచ్చిన ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ చిత్రాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిన విషయమే. అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబోలో వస్తోన్న హ్యాట్రిక్ చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: