అనిల్ రావిపూడి సినిమాల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కామెడీనే ప్రధానంగా చేసుకునే తన సినిమాలు అటు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడమే కాదు బాక్సాఫీస్ వద్ద కలక్షన్స్ కూడా కురిపిస్తుంటాయి. ‘పటాస్’ నుంచి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా వరకూ అనిల్ తీసిన సినిమాలు అన్ని సూపర్‌హిట్లుగా నిలిచాయి. ఇక వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్3 సినిమా తీస్తున్నాడు. ఇది ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ గా వస్తుంది. ఇక వెంకటేష్-వరుణ్ తేజ్ హీరోలుగా వస్తున్న ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా నేడు అనిల్ రావిపూడి తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈసందర్భంగా పలువురు సినీ సెలబ్రిటీలు అనిల్ కు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడికి మహేష్ బాబు బర్త్ డే విషెస్ అందించారు. నేను వర్క్ చేసిన డైరెక్టర్స్ లో కూలెస్ట్ డైరెక్టర్ అనిల్ కు హ్యాపీ బర్త్ డే.. ఈ ఏడాది ట్రెమెండెస్ గా ఉండాలి అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.
Happy birthday to one of the coolest directors I’ve worked with @AnilRavipudi!! Wishing you a tremendous year ahead! 🙂 pic.twitter.com/dqX5hKpgoi
— Mahesh Babu (@urstrulyMahesh) November 23, 2021
కాగా గతంలో అనిల్ రావిపూడి-మహేష్ కాంబినేషన్ లో సరిలేరు నీకెవ్వరు సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ఎంత బ్లాక్ బ్లస్టర్ అయిందో కూడా తెలుసు. ఇటీవల మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ సినిమా ఉండనుందని వార్తలు వచ్చాయి. చూద్దాం మరి ఎప్పుడు ఆ సినిమా మొదలవుతుందో.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: