అనిల్ రావిపూడి కిల్లింగ్ డ్యాన్స్

anil ravipudi grooves to bala krishnas blockbuster song

డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. పటాస్ తో డైరెక్టర్ గా కెరీర్ మొదలుపెట్టిన అనిల్ రావిపూడి ఆ సినిమా తరువాత వెనక్కి తిరిగి చూసుకేలేదు ఇప్పటివరకూ. పటాస్ దగ్గర నుండి చివరిగా వచ్చిన ఎఫ్3 వరకూ అన్నీ హిట్ లనే అందుకున్నాడు. ప్రస్తుతం అనిల్ నటసింహం బాలకృష్ణ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు అనిల్ రావిపూడి తనలో హిడెన్ టాలెంట్ ను బయటపెట్టాడు. నిజానికి అనిల్ రావిపూడిలో చిన్న డ్యాన్సర్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి ఏకంగా తన కిల్లింగ్ స్టెప్స్ తో మెస్మరైజ్ చేశాడు. అనిల్ రావిపూడి, కొరియో గ్రాఫర్ భాను ఇంకా యాక్షన్ కొరియోగ్రాఫర్ వెంకట్ ముగ్గురు కలిసి బాలయ్య పాటకు రీల్ చేశారు. బాలకృష్ణ సూపర్ హిట్ మూవీ లారీ డ్రైవర్ నుండి బాలయ్య బాలయ్య సాంగ్ కి స్టెప్స్ అదరగొట్టారు. ఇక ఈ రీల్ లో అనిల్ రావిపూడి తన డ్యాన్స్ తో అందరినీ ఫిదా చేసేశాడు. అనిల్ లో ఈ టాలెంట్ కూడా ఉందా అని నెటిజన్లు పొగడ్తలు కురిపిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Anil Ravipudi (@anilravipudi)

కాగా ఈసినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీలీల ఒక కీలక పాత్రలో నటిస్తుంది. అర్జున్ రాంపాల్ ఈసినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఈ చిత్రానికి కూడా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − seven =