”విజయకృష్ణా సిల్వర్ క్రౌన్ అవార్డ్ తీసుకోవడం చాలా సంతోషంగా వుంది. కృష్ణ గారు రియల్ సూపర్ స్టార్. విజయ నిర్మల గారు ఆడపులి. వారి పేరు మీద ఈ అవార్డ్ ని తీసుకోవడం గర్వంగా ఫీలౌతున్నాను” అని అన్నారు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ మేరకు ఆయన ప్రముఖ నటీమణి, దర్శకురాలు విజయనిర్మల గారి జయంతి సందద్భంగా విజయకృష్ణా సిల్వర్ క్రౌన్ అవార్డ్ 2025ని అందుకున్న సందర్భంగా వ్యాఖ్యానించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రుతిలయ సీల్ వెల్ కార్పోరేషన్ కళాకారుల ఐక్యవేదిక సమక్షంలో విజయనిర్మల గారి జయంతిని పురస్కరించుకుని ప్రముఖ రచయిత దర్శకులు జంధ్యాల గారి 75 సం.ల వజ్రోత్సవ సంచిక ఆవిష్కరణ కార్యక్రమంలో అనిల్ రావిపూడి ఈ బహుమతిని అందుకున్నారు. నవరసరాయ డాక్టర్ నరేష్ వికె సమక్షంలో అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకకు తెలంగాణ రాష్ట్ర శానన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఇంకా ఈ వేడుకలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరో మంచు విష్ణు, శివబాలాజీ, పవిత్ర లోకేష్, జంధ్యాల అన్నపూర్ణ, శ్రీలక్ష్మీ, ప్రదీప్, సాయినాథ్ తో పాటు అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా విజయకృష్ణా సిల్వర్ క్రౌన్ అవార్డ్ గ్రహీత డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. “సభకు నమస్కారం. జంధ్యాల గారి పుస్తక ఆవిష్కరణలో పాల్గోవడం చాలా ఆనందంగా వుంది. అలాగే నేను విజయకృష్ణా సిల్వర్ క్రౌన్ అవార్డ్ తీసుకోవడం చాలా సంతోషంగా వుంది.”
“కృష్ణ గారు రియల్ సూపర్ స్టార్. విజయ నిర్మల గారు ఆడపులి. అత్యధిక సినిమాలు తీసిన మహిళా దర్శకురాలిగా రికార్డ్ సృష్టించారు. వారి పేరు మీద ఈ అవార్డ్ ని తీసుకోవడం గర్వంగా ఫీలౌతున్నాను. ఇలాంటి అవార్డ్ నాకు అందించిన నరేష్ గారు ధన్యవాదాలు. నరేష్ గారు గ్రేట్ సన్, వారి అమ్మగారి పేరు మీద ఈ అవార్డ్ ని కొనసాగించడం చాలా ఆనందంగా వుంది.”
“జంధ్యాల గారికి నేను ఏకలవ్య శిష్యుడిని. ఆయన సినిమాలు చూస్తూ కామెడీ టైమింగ్ నేర్చుకున్నాను. ఈ రోజు నేను కామెడీ పండిస్తున్నానంటే ఆ క్రెడిట్ జంధ్యాల గారికి దక్కుతుంది. నవ్వు ద్వారా ప్రజలు దగ్గరైనందుకు గర్వంగా ఫీలౌతున్నాను. వరుస హిట్స్ కొడుతున్నాను.”
“ఇంకా పీక్స్ రాలేదని భావిస్తున్న తరుణంలో 2025లో సంక్రాంతి వస్తున్నాం లాంటి ఓ హాస్య ప్రధానమైన సినిమాతో దేవుడు ఓ అద్భుతమైన సినిమా ఇచ్చాడు. నరేష్ గారు గ్రేట్ పర్శన్. ఆయనతో సంక్రాంతికి వస్తున్నాం సినిమా చేయడం ఆనందంగా వుంది. మళ్ళీ ఆయనతో కలసి పని చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ థాంక్ యూ” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: