డాక్టర్ కావాలనుకొని యాక్టర్ అయ్యాను అంటూ పలువురు పలు సందర్భాల్లో అనడం చూస్తుంటాం. అలానే ఇండస్ట్రీలో కూడా కొంతమంది ఏదో కావాలనుకుంటారు.. కానీ ఇండస్ట్రీలో సెటిల్ అవుతారు. ఇక కొంతమంది ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలనుకున్నా పలు కారణాల వల్ల సెటిల్ అవ్వలేరు. అయితే ఓ డైరెక్టర్ మాత్రం అయితే మాములు ఆర్టిస్ట్అవుతా కానీ హీరో మాత్రం అవ్వను అంటున్నాడు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు టాలీవుడ్ వరుస హిట్లతో టాప్ డైరెక్టర్ గా ఉన్న అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఎఫ్ 3 సినిమా మే 27న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసందర్బంగా అనిల్ రావిపూడి కూడా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నాడు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిల్ రావిపూడి పలు ఆసక్తిర విషయాలు తెలిపాడు. ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిల్ రావిపూడిని హీరో కావాలనే ఆలోచన ఏమైనా ఉందా అని అడుగగా.. “ఆర్టిస్టుగా చేయాలని ఉందిగానీ .. హీరోగా చేసేయాలనే ఆశ లేదు. హీరోగా చేయడమనేది పెద్ద బరువు .. చాలా పెద్ద బాధ్యత. మనపై సినిమాలు ఆడతాయా లేదా? .. ఫ్లాప్ వస్తే ఎట్లా? అనే టెన్షన్ నేను పడలేను. మామూలు ఆర్టిస్ట్ గా అయితే డైలీ పేమెంట్ ఇస్తారు .. టైమ్ టు టైమ్ పనిచేసి వచ్చేయవచ్చు” అంటూ చెప్పుకొచ్చాడు.
కాగా వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న ఈసినిమాలో తమన్నా, మెహ్రీన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంకా సునీల్, సోనాల్‌చౌహన్‌లు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. చూద్దాం ఎఫ్ 2 సీక్వెల్ గా వస్తున్నఈసినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: