కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Allari Naresh

ట్యాగ్ · 88 కథనాలు · పేజీ 2

Bachhala Malli Second Single Released
సినిమా వార్తలు

బచ్చల మల్లి సెకండ్ సింగిల్ రిలీజ్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ ప్రధానపాత్రలో నటిస్తోన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'బచ్చల మల్లి'. కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా హీరోగా ఆయనకు 63వది కావడం విశేషం. 'సోలో బ్రతుకే సో బెటరు' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుబ్బు మంగదేవి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు.

Srikanth Mవాట్సాప్
Bachhala Malli Second Single Update
సినిమా వార్తలు

బచ్చల మల్లి సెకండ్ సింగిల్ అప్‌డేట్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ ప్రధానపాత్రలో నటిస్తోన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'బచ్చల మల్లి'. కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా హీరోగా ఆయనకు 63వది కావడం విశేషం. 'సోలో బ్రతుకే సో బెటరు' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుబ్బు మంగదేవి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ యూనిక్‌ కాన్సెప్ట్‌ మూవీ డిసెంబర్ 20న గ్రాండ్ రిలీజ్ కానుంది.

Srikanth Mవాట్సాప్
Allari Naresh's Bachhala Malli Release Date Announced
రిలీజ్ అప్‌డేట్

బచ్చల మల్లి రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ ఒకప్పుడు కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఇప్పుడు ఆయన రూట్ మార్చారు. గత కొంతకాలంగా వైవిధ్యభరిత సినిమాలు చేస్తున్నారు. ఒకే జోనర్‌కు పరిమితమవ్వకుండా డిఫరెంట్ జోనర్స్‌లో చిత్రాలు చేస్తున్నారు. ఇటీవల వచ్చిన 'నాంది, ఉగ్రం, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' సినిమాలు ఇందుకు ఉదాహరణ. వీటిలో నరేష్ చాలా సీరియస్ టైప్ పాత్రలలో నటించి మెప్పించారు.

Srikanth Mవాట్సాప్
allari naresh 63 movie officially launched
సినిమా వార్తలు

అల్లరి నరేష్ 63 మూవీ ప్రారంభం

అల్లరి సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తరువాత వరుసగా కామెడీ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నాడు అల్లరి నరేష్. ఇప్పుడు కాస్త తన పంథాను మార్చి విభిన్నమైన పాత్రలు చేస్తున్నాడు. ప్రస్తుతం తను బచ్చలమల్లి అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈసినిమాలో కూడా నరేష్ మల్లి అనే మాసీ పాత్రతో రానున్నాడు. ఇక ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. నరేష్ సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. హాస్య మూవీస్ బ్యానర్‌ పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించనున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం.. రిచర్డ్ ఎం నాథన్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Maa Oori Jatharalo song out from allari naresh Bachhala Malli movie
సాంగ్

బచ్చల మల్లి-మా ఊరి జాతరలో ఫుల్ సాంగ్ రిలీజ్

అల్లరి నరేష్ నుండి రాబోతున్న సినిమా బచ్చలమల్లి. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. ఈసినిమా నుండి ఇప్పటికే వచ్చిన అప్ డేట్లు అన్నీ సినిమాపై మంచి క్యూరియాసిటీని పెంచాయి. ముఖ్యంగా అల్లరి నరేష్ ఫుల్ మాస్ రోల్ లో కనిపిస్తుండటంతో ఈసినిమాకు అంత బజ్ పెరిగింది.

TFN Adminవాట్సాప్
allari naresh bachhala malli first single maa oori jatharalo song promo out now
సాంగ్

బచ్చలమల్లి-మా ఊరి జాతరలో సాంగ్ ప్రోమో రిలీజ్

అల్లరి నరేష్ నుండి రాబోతున్న ఇంట్రెస్టింగ్ సినిమా బచ్చలమల్లి. ఈ మూవీలో తన మేకోవర్ ను పూర్తిగా మేర్చేశాడు అల్లరి నరేష్. ఫుల్ మాస్ అవతార్ లో ఇంటెన్స్ రోల్‌లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాకు సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. మరోపక్క అప్పుడప్పుడు ఈసినిమా నుండి అప్ డేట్లను ఇస్తూ వస్తున్నారు.

TFN Adminవాట్సాప్
allari naresh bachhala malli movie busy with dubbing work
సినిమా వార్తలు

డబ్బింగ్ తో బిజీగా బచ్చల మల్లి

అల్లరి నరేష్ ఇప్పుడు డిఫరెంట్ సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఒకే జోనర్ కు పరిమితమవ్వకుండా పలు జోనర్లు ట్రై చేయడానికి చూస్తున్నాడు. ఈమధ్య నాంది, ఉగ్రం, ఇట్లు మారేడుమిల్ల ప్రజానీకం అంటూ సీరియస్ పాత్రలు చేయగా సామిరంగ సినిమాలో మరోసారి గమ్యం సినిమాలోని తరహా పాత్రను చేశాడు. రీసెంట్ గా మళ్లీ తన కామెడీ యాంగిల్ ను బయటకు తీస్తూ ఆ ఒక్కటీ అడక్కు సినిమాతో వచ్చాడు. ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాతో రాబోతున్నాడు. అల్లరి నరేష్ హీరోగా సుబ్బు మంగదేవి దర్శకత్వంలో వస్తున్న సినిమా బచ్చలమల్లి.

TFN Adminవాట్సాప్
Aa Okkati Adakku 3days collections
బాక్సాఫీస్

ఆ ఒక్కటీ అడక్కు 3 డేస్ కలెక్షన్స్

అల్లరి నరేశ్ ఆ ఒక్కటీ అడక్కు బాక్సాఫీసు వద్ద డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంటుంది.ఎలక్షన్ ఫీవర్ అలాగే ఐపీఎల్ సీజన్ ను తట్టుకొని పర్వాలేదనే వసూళ్లను రాబట్టుకుంటుంది.గత శుక్రవారం థియేటర్లోకి వచ్చిన ఈసినిమా మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 5.14కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టుకుందని మేకర్స్ పోస్టర్ ద్వారా తెలియజేశారు.4కోట్ల షేర్ టార్గెట్ గా బరిలోకి దిగిన ఈసినిమా మరో రెండు కోట్లను రాబడితే బ్రేక్ ఈవెన్ ను చేరుకున్నట్లే. ఈవారంలో ఆ మార్క్ చేరుకొనే ఛాన్స్ వుంది.

Mahender Reddyవాట్సాప్
Naa Saami Ranga Movie Two Days Worldwide Collections, Naa Saami Ranga Movie Two Days Collections, Naa Saami Ranga Movie Collections, Two Days Worldwide Collections Naa Saami Ranga Movie, Naa Saami Ranga Collections, Nagarjuna Akkineni, Mirnaa, Allari
బాక్సాఫీస్

నా సామిరంగ 2 డేస్ క్రేజీ కలెక్షన్స్

ఈ సంక్రాంతికి కూాడా పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. అందులో కింగ్ నాాగార్జున హీరోగా వచ్చిన నా సామిరంగ మూవీ కూడా ఒకటి. బిన్ని విజయ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా నా సామిరంగ. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమా కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. చాలా కాలం తరువాత మాస్ రోల్ తో వచ్చిన నాగ్ మరోసారి తన సత్తా చూపించాడు. స్నేహం, ప్రేమ, కామెడీ, యాక్షన్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉండటంతో ఈసినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగానే కనెక్ట్ అవుతుంది.

TFN Adminవాట్సాప్
Naa Saami Ranga Movie teaser out now
ట్రైలర్ & టీజర్

నా సామిరంగ టీజర్ రిలీజ్

విజయ్‌ బన్నీ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వస్తున్న సినిమా నా సామిరంగ. ఈసినిమా మొదలై ఇన్ని రోజులు చాలా సైలెంట్ గా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. అంతేకాదు చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే పస్ట్ లుక్ తో పాటు ఫస్ట్ సింగిల్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక నిన్న అల్లరి నరేష్ ఇంట్రడక్షన్ గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేయగా గ్లింప్స్ అయితే ఆకట్టుకుంది. అల్లరి నరేష్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ కూడా ఆకట్టుకుంటుంది.

TFN Adminవాట్సాప్
allari naresh interesting poster from Naa Saami Ranga movie
ఫస్ట్ లుక్

నా సామిరంగ- ఇంట్రెస్టింగ్ గా అల్లరి నరేష్ పోస్టర్

కింగ్ నాగార్జున కూడా జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక ప్రస్తుతం నాగార్జున నుండి రాబోతున్న సినిమా నా సామిరంగ. చాలా కాలం తరువాత మళ్లీ ఓ మాస్ సినిమాతో రాబోతున్నాడు నాగార్జున. విజయ్‌ బన్నీ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వస్తున్న సినిమా నా సామిరంగ. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి గ్లింప్స్‌తో పాటు ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే అనే ఫ‌స్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయ‌గా ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

TFN Adminవాట్సాప్
allari naresh 62 movie official announcement
సినిమా వార్తలు

ఇంట్రెస్టింగ్ వీడియోతో అల్లరి నరేష్ 62 మూవీ అనౌన్స్ మెంట్

అల్లరి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నరేష్ మొదటి సినిమానే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. ఇక ఆతరువాత కామెడీ సినిమాాలతో ప్రక్షకులకు కితకితలు పెట్టాడు. అయితే ఒకప్పుడు కామెడీ కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన అల్లరి నరేష్ ఇప్పుడు పాత్ర ప్రధానమైన సినిమాలు చేయడానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. చాలా కాలం సరైన హిట్ లేక బాధపడుతున్న అల్లరి నరేష్ మహేష్ మహర్షి సినిమాలో మంచి రోల్ చేసి ప్రశంసలు దక్కించుకున్నాడు. ఆతరువాత నాంది సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ కు నాంది పలికాడు. నాంది సినిమాలో తన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఆ తరువాత ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం సినిమాలు వచ్చాయి…

TFN Adminవాట్సాప్
allari naresh ugram movie getting super response in OTT
ఓటీటీ

ఓటీటీలో ఉగ్రం మూవీకి సూపర్ రెస్పాన్స్

నాంది సినిమా నుండి తన స్టోరీ సెలక్షన్ లో రూట్ మార్చాడు అల్లరి నరేష్. ప్రస్తుతం కాస్త సీరియస్, యాక్షన్ సినిమాలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా ఉగ్రం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కింది. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో నాంది రాగా ఆసినిమాకు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కడంతో మరోసారి ఉగ్రం తీశారు. ఈసినిమా కూడా రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. మొదటిసారి అల్లరి నరేష్ అంత సీరియ్ రోల్ లో ఇంకా యాక్షన్ సీక్వెన్స్ లలో నటించి మెప్పించాడు.

TFN Adminవాట్సాప్
ugram movie ott release date fixed
ఓటీటీ

ఉగ్రం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

విజయ్ కనకమేడల దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సినిమా ఉగ్రం. నాంది తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇది. మిస్సింగ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా మే 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరుస మిస్సింగ్ కేసులు నమోదు కావడం, వాటిని అల్లరి నరేశ్‌ పోలీసాఫీసర్‌గా ఎలా చేధించాడనే నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కింది. ఇక ఈసినిమాలో అల్లరి నరేష్ డ్యూయల్‌ షేడ్స్‌లో ప్రేక్షకులు ఇదివరకెన్నడూ చూడని లుక్‌లో కనిపించి.. మంచి టాక్‌ నే సొంతం చేసుకున్నాడు. నటనపరంగా మరోసారి సినీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు నరేష్. ఈ సినిమాలో ఫైట్స్ అయితే అదిరిపోయాయి. కలెక్షన్స్ పరంగా కూడా డీసెంట్ కలెక్షన్స్ ను…

TFN Adminవాట్సాప్
allari naresh ugram movie review
రివ్యూ

అల్లరి నరేష్ ఉగ్రం రివ్యూ..ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్

ఓవరాల్ గా చెప్పాలంటే హ్యూమన్ ట్రాఫికింగ్ ఎలా జరుగుతుంది అనే విషయాన్ని మరోసారి ఈసినిమాతో తెలియచేశారు. ఇక థ్రిల్లర్ మూవీస్ సినిమాలు చూసే వాళ్లకు ఈసినిమా చాలా బాగా నచ్చేస్తుంది. అందరూ ఒకసారి చూసి ఎంజాయ్ చేయచ్చు..

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రీజనబుల్ ధరకే ఉగ్రం టికెట్లు

నాంది సినిమా తరువాత అల్లరి నరేష్, విజయ్ కనకమేడల దర్శకత్వంలో వస్తున్న సినిమా ఉగ్రం. హిట్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈసినిమాలో అల్లరి నరేష్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈసినిమా ఇంకా ఒక్క రోజులో ప్రేక్షకుల ముందుక రానుంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్ల దగ్గర నుండి టీజర్, ట్రైలర్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచేసింది. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే రేపటి వరకూ ఆగాలి.

TFN Adminవాట్సాప్
Ugram and Ramabanam run time reveal
సినిమా వార్తలు

ఉగ్రం,రామబాణం రన్ టైం రివీల్

ఈశుక్రవారం టాలీవుడ్ నుండి రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించు కోనున్నాయి.అందులో ఒకటి రామబాణం కాగా మరొకటి ఉగ్రం.ఈరెండు సినిమాలను పోటీ పోటీగా ప్రమోట్ చేస్తున్నారు.ఈసినిమాల ట్రైలర్లు ప్రామిసింగ్ గా ఉండడంతో మంచి హైప్ వచ్చింది.ఇక ఈరెండు సినిమాల విషయానికి వస్తే రామబాణం ఎలాంటి కట్స్ లేకుండా యు/ఏ సర్టిఫికెట్ పొందింది.అంతేకాదు రన్ టైం కూడా చాలా క్రిప్సీగా వుంది.143 నిమిషాల రన్ టైం తో ఈసినిమా థియేటర్లలోకి రానుంది.

Mahender Reddyవాట్సాప్
Ugram Hilarious promotions videos
సినిమా వార్తలు

హిలేరియస్ గా ఉగ్రం ప్రమోషన్స్ వీడియోలు

అల్లరి నరేష్ నటించిన లేటెస్ట్ మూవీ ఉగ్రం మరో మూడు రోజుల్లో థియేటర్లలోకి రానుంది.విజయ్ కనకమేడల డైరెక్ట్ చేశాడు.ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన నాంది సూపర్ హిట్ అనిపించుకుంది దాంతో ఉగ్రంకు హైప్ వచ్చింది.దానికి తోడు ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గా ఉండడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.ప్రస్తుతం టీం అంతా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీ గా వున్నారు. అందులో భాగంగా నిన్న గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది.అయితే ఈ సారి ప్రమోషన్స్ విషయంలో ఉగ్రం టీం డిఫ్రెంట్ గా ఆలోచించింది.

Mahender Reddyవాట్సాప్
allari naresh ugram movie pre release event highlights
సినిమా వార్తలు

ఉగ్రం లో హై ఇంటెన్స్ రోల్ లో చూస్తారు-అల్లరి నరేష్

‘నాంది’ తో విజయవంతమైన చిత్రాన్ని అందించిన హీరో అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల మరో యూనిక్, ఇంటెన్స్ మూవీ ‘ఉగ్రం’ తో వస్తున్నారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది గ్రాండ్‌గా నిర్మించారు. మిర్నా మీనన్ కథానాయికగా నటిచింది. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌ ట్రెమండస్ రెస్పాన్స్ తో ఉగ్రంపై అంచనాలని పెంచాయి. మే 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపధ్యంలో ‘ఉగ్రం’ ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. హీరోలు అడివి శేష్, నిఖిల్, సందీప్ కిషన్, విశ్వక్ సేన్, దర్శకులు హరీష్ శంకర్, అనిల్ రావిపూడి శివ నిర్వాణ, విఐ ఆనంద్, వశిష్ట ఈ వేడుకకు హాజరయ్యారు.

TFN Adminవాట్సాప్
power full title song released from ugram movie
సాంగ్

ఉగ్రం పవర్ ఫుల్ టైటిల్ సాంగ్ రిలీజ్

అల్లరి నరేష్, విజయ్ కనకమేడల కాంబినేషన్ లో వచ్చిన నాంది సినిమా మంచి విజయం దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈసినిమాకు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. ఇక ఇప్పుడు వీరిద్దరూ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతున్నారు. ఉగ్రం అనే మరో యూనిక్ ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్ టైనర్ వస్తున్నారు. ఈసినిమా మే 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్ ల ను రిలీజ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మరోసారి వీరిద్దరూ హిట్ కొట్టే ఛాన్స్ ఉందన్న అభిప్రాయాలు వచ్చాయి.

TFN Adminవాట్సాప్

షేర్