బచ్చల మల్లి-మా ఊరి జాతరలో ఫుల్ సాంగ్ రిలీజ్

Maa Oori Jatharalo song out from allari naresh Bachhala Malli movie

అల్లరి నరేష్ నుండి రాబోతున్న సినిమా బచ్చలమల్లి. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. ఈసినిమా నుండి ఇప్పటికే వచ్చిన అప్ డేట్లు అన్నీ సినిమాపై మంచి క్యూరియాసిటీని పెంచాయి. ముఖ్యంగా అల్లరి నరేష్ ఫుల్ మాస్ రోల్ లో కనిపిస్తుండటంతో ఈసినిమాకు అంత బజ్ పెరిగింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు మ్యూజికల్ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా నుండి మా ఊరి జాతరలో అనే పాటను రిలీజ్ చేశారు మేకర్స్. విశాల్ చంద్రశేఖర్ కంపోజ్ చేసిన ఈపాటను గౌర హరి, సింధూరి విశాల్ ఆలపించగా.. శ్రీమణి లిరిక్స్ అందించారు. అల్లరి నరేష్, అమృత అయ్యర్ మధ్య వచ్చే ఈ పాట అయితే ఆకట్టుకుంటుంది. భాను కొరియోగ్రఫి అందించిన ఈపాటలో విజువల్స్ చాలా బాగున్నాయి.

కాగా ఈసినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన వంటి హిట్లు అందించిన హాస్య మూవీస్ బ్యానర్‌ పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈసినిమాను నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా.. మానాడు, రంగం, మట్టి కుస్తీ చిత్రాలకు పనిచేసిన రిచర్డ్ ఎం నాథన్ కెమరామెన్ గా పని చేస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్. దర్శకుడు సుబ్బు స్వయంగా కథ, స్క్రీన్ ప్లే అందిస్తుండగా, విప్పర్తి మధు స్క్రీన్ ప్లే రైటర్ గా పని చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.