ఇంట్రెస్టింగ్ వీడియోతో అల్లరి నరేష్ 62 మూవీ అనౌన్స్ మెంట్

allari naresh 62 movie official announcement

అల్లరి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నరేష్ మొదటి సినిమానే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. ఇక ఆతరువాత కామెడీ సినిమాాలతో ప్రక్షకులకు కితకితలు పెట్టాడు. అయితే ఒకప్పుడు కామెడీ కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన అల్లరి నరేష్ ఇప్పుడు పాత్ర ప్రధానమైన సినిమాలు చేయడానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. చాలా కాలం సరైన హిట్ లేక బాధపడుతున్న అల్లరి నరేష్ మహేష్ మహర్షి సినిమాలో మంచి రోల్ చేసి ప్రశంసలు దక్కించుకున్నాడు. ఆతరువాత నాంది సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ కు నాంది పలికాడు. నాంది సినిమాలో తన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఆ తరువాత ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం సినిమాలు వచ్చాయి. ఈరెండు సినిమాలు కూడా మిశ్రమ స్పందనను దక్కించుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు మరో సినిమాతో రావడానికి సిద్దమయ్యాడు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా తన 62వ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇచ్చారు. సోలో బ్రతుకే సో బెటరు ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ఈసందర్భంగా యూనిక్ స్టైల్ లో కాన్సెప్ట్ వీడియోను రిలీజ్ చేశారు. కథ చెప్పడానికి నరేష్ కి ఫోన్ చేసిన దర్శకుడు.. ఆ స్టోరీని బార్ లో కూర్చోబెట్టి నేరేట్ చేస్తాడు. మూర్ఖత్వంతో బ్రతికే ఒక వ్యక్తి కథే ఈ సినిమా స్టోరీ లైన్ అని సింపుల్ గా చెప్పేశాడు. అలాగే అదే బార్ లో చిత్ర యూనిట్ ని కూడా అనౌన్స్ చేసేశాడు. 1990 నేపథ్యంలో ఈసినిమా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. సెప్టెంబర్ చివరి నుంచి షూట్‌ ను ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది.

కాగా ఈసినిమాను సామజవరగమనతో బ్లాక్ బస్టర్ అందించిన హాస్య మూవీస్ బ్యానర్‌ పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించనున్నారు.విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా.. మానాడు, రంగం, మట్టి కుస్తీ చిత్రాలకు పనిచేసిన రిచర్డ్ ఎం నాథన్ కెమరామెన్ గా పని చేస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్. దర్శకుడు సుబ్బు స్వయంగా కథ, స్క్రీన్ ప్లే అందిస్తుండగా, విప్పర్తి మధు స్క్రీన్ ప్లే రైటర్ గా పని చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × three =