అల్లరి నరేష్ ఇప్పుడు డిఫరెంట్ సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఒకే జోనర్ కు పరిమితమవ్వకుండా పలు జోనర్లు ట్రై చేయడానికి చూస్తున్నాడు. ఈమధ్య నాంది, ఉగ్రం, ఇట్లు మారేడుమిల్ల ప్రజానీకం అంటూ సీరియస్ పాత్రలు చేయగా సామిరంగ సినిమాలో మరోసారి గమ్యం సినిమాలోని తరహా పాత్రను చేశాడు. రీసెంట్ గా మళ్లీ తన కామెడీ యాంగిల్ ను బయటకు తీస్తూ ఆ ఒక్కటీ అడక్కు సినిమాతో వచ్చాడు. ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాతో రాబోతున్నాడు. అల్లరి నరేష్ హీరోగా సుబ్బు మంగదేవి దర్శకత్వంలో వస్తున్న సినిమా బచ్చలమల్లి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రీసెంట్ గానే అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా నుండి నరేష్ గ్లింప్స్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఊరమాస్ గా ఉన్న ఈ గ్లింప్స్ అయితే సినిమాపై అంచనాలను పెంచేసింది. గ్లింప్స్ ను బట్టి నరేష్ ఫుల్ మాస్ అవతార్ లో కనిపించనున్నట్టు అర్థమవుతుంది. అంతేకాదు సెప్టెంబర్ లో ఈసినిమా రిలీజ్ అవుతుందని కూడా చెప్పారు. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈసినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. అంతేకాదు అల్లరి నరేష్ ఇప్పటికే డబ్బింగ్ ను కూడా మొదలుపెట్టాడట. తన పోర్షన్స్ వరకూ డబ్బింగ్ ను కూడా పూర్తి చేస్తున్నట్టు సమాచారం.
కాగా ఈసినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. రావు రమేష్, హరితేజ, ప్రవీణ్ పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించనున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా.. మానాడు, రంగం, మట్టి కుస్తీ చిత్రాలకు పనిచేసిన రిచర్డ్ ఎం నాథన్ కెమరామెన్ గా పని చేస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్. దర్శకుడు సుబ్బు స్వయంగా కథ, స్క్రీన్ ప్లే అందిస్తుండగా, విప్పర్తి మధు స్క్రీన్ ప్లే రైటర్ గా పని చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























