ఈశుక్రవారం టాలీవుడ్ నుండి రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించు కోనున్నాయి.అందులో ఒకటి రామబాణం కాగా మరొకటి ఉగ్రం.ఈరెండు సినిమాలను పోటీ పోటీగా ప్రమోట్ చేస్తున్నారు.ఈసినిమాల ట్రైలర్లు ప్రామిసింగ్ గా ఉండడంతో మంచి హైప్ వచ్చింది.ఇక ఈరెండు సినిమాల విషయానికి వస్తే రామబాణం ఎలాంటి కట్స్ లేకుండా యు/ఏ సర్టిఫికెట్ పొందింది.అంతేకాదు రన్ టైం కూడా చాలా క్రిప్సీగా వుంది.143 నిమిషాల రన్ టైం తో ఈసినిమా థియేటర్లలోకి రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
గోపిచంద్ హీరోగా నటించిన ఈసినిమాలో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటించగా జగపతి బాబు,కుష్బూ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.మిక్కీ జె మేయర్ సంగీతం అందించాడు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించగా శ్రీవాస్ డైరెక్ట్ చేసాడు.ఇంతకుముందు శ్రీవాస్,గోపించంద్ కాంబినేషన్ లో వచ్చిన లక్ష్యం,లౌక్యం సూపర్ హిట్లు అయ్యాయి.మరి ఈరామబాణంతో హ్యాట్రిక్ కొడతారో లేదో చూడాలి.
ఇక ఉగ్రం విషయానికి వస్తే సెన్సార్ బోర్డు ఈసినిమా యు/ఏ సర్టిఫికెట్ ఇవ్వగా 148నిమిషాల రన్ టైం తో థియేటర్లలోకి రానుంది.ఇన్సైడ్ టాక్ కూడా పాజిటివ్ గా ఉండడం సినిమా కు అడ్వాంటేజ్ కానుంది.అల్లరి నరేష్ నటించిన ఈసినిమాలో మిర్న హీరోయిన్ గా నటించగా శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు.షైన్ స్క్రీన్స్ నిర్మించిన ఈసినిమాను విజయ్ కనకమేడల డైరెక్ట్ చేసాడు.ఇంతకుముందు విజయ్ కనకమేడల,నరేష్ కాంబినేషన్ లో వచ్చిన నాంది సూపర్ హిట్ అయ్యింది.మరి ఉగ్రంతో కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తారో లేదో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: