అల్లరి నరేష్ నుండి రాబోతున్న ఇంట్రెస్టింగ్ సినిమా బచ్చలమల్లి. ఈ మూవీలో తన మేకోవర్ ను పూర్తిగా మేర్చేశాడు అల్లరి నరేష్. ఫుల్ మాస్ అవతార్ లో ఇంటెన్స్ రోల్లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాకు సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. మరోపక్క అప్పుడప్పుడు ఈసినిమా నుండి అప్ డేట్లను ఇస్తూ వస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా అల్లరి నేరష్ మాస్ అవతార్ సినిమాపై క్యూరియాసిటినీ పెంచేసింది. ఇప్పుడు మరో అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ తో వచ్చారు చిత్రబృందం. మా ఊరి జాతరలో అంటూ వచ్చే ఫస్ట్ సింగిల్ ప్రోమో ను తాజాగా రిలీజ్ చేశారు. విశాల్ చంద్రశేఖర్ కంపోజ్ చేసిన ఈపాటను గౌర హరి, సింధూరి విశాల్ ఆలపించిన ఈపాటకు శ్రీమణి లిరిక్స్ అందించారు. ఫుల్ సాంగ్ ను రేపు అంటే జులై 16 వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.
కాగా ఈసినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. రావు రమేష్, హరితేజ, ప్రవీణ్ పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించనున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా.. మానాడు, రంగం, మట్టి కుస్తీ చిత్రాలకు పనిచేసిన రిచర్డ్ ఎం నాథన్ కెమరామెన్ గా పని చేస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్. దర్శకుడు సుబ్బు స్వయంగా కథ, స్క్రీన్ ప్లే అందిస్తుండగా, విప్పర్తి మధు స్క్రీన్ ప్లే రైటర్ గా పని చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























