నాంది సినిమా తరువాత అల్లరి నరేష్, విజయ్ కనకమేడల దర్శకత్వంలో వస్తున్న సినిమా ఉగ్రం. హిట్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈసినిమాలో అల్లరి నరేష్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈసినిమా ఇంకా ఒక్క రోజులో ప్రేక్షకుల ముందుక రానుంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్ల దగ్గర నుండి టీజర్, ట్రైలర్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచేసింది. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే రేపటి వరకూ ఆగాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా టికెట్ రేట్లపై అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా టికెట్లను రీజనబుల్ రేట్లకే అందుబాటులోకి తీసుకొచ్చినట్టు అధికారికంగా తెలియచేశారు. ఏపీ ఇంకా తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లను తెలిపారు. తెలంగాణలో సింగిల్ స్క్రీన్ ను 110 రూపాయలకు అలానే మల్టీ ప్లెక్స్ లో 195 రూపాయలకు అలానే ఏపీలో సింగిల్ స్క్రీన్ 110 రూపాయలు అలానే మల్టీ ప్లెక్స్ లో 177 రూపాయలకు అందిస్తున్నారు.
#Ugram Grand Release Tomorrow💥💥
Watch it at your nearest theatres at affordable prices with your friends and family ❤️
Book your tickets now!
– https://t.co/c7ZhPSSs4E#UgramOnMAY5th@allarinaresh @mirnaaofficial @DirVijayK @sahugarapati7 @harish_peddi pic.twitter.com/r7kU7Kv6ZE— Shine Screens (@Shine_Screens) May 4, 2023
ఈసినిమాలో అల్లరి నరేష్ సరసన మిర్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈసినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. మాటలు అబ్బూరి రవి అందిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా, సిద్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. మరి చూద్దాం ఈసినిమా ఎంతవరకూ ప్రేక్షకులను అలరిస్తుందో.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: