ఉగ్రం పవర్ ఫుల్ టైటిల్ సాంగ్ రిలీజ్

power full title song released from ugram movie

అల్లరి నరేష్, విజయ్ కనకమేడల కాంబినేషన్ లో వచ్చిన నాంది సినిమా మంచి విజయం దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈసినిమాకు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. ఇక ఇప్పుడు వీరిద్దరూ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతున్నారు. ఉగ్రం అనే మరో యూనిక్ ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్ టైనర్ వస్తున్నారు. ఈసినిమా మే 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్ ల ను రిలీజ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మరోసారి వీరిద్దరూ హిట్ కొట్టే ఛాన్స్ ఉందన్న అభిప్రాయాలు వచ్చాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమా నుండి టైటిల్ సాంగ్ ని విడుదల చేశారు మేకర్స్. శ్రీచరణ్ పాకాల ఈ టైటిల్ ట్రాక్ ని హైలీ పవర్ ఫుల్ నెంబర్ గా కంపోజ్ చేశారు. గూస్ బంప్స్ తెప్పించే ఎమోషన్ తో ఈ పాటని స్కోర్ చేసి స్వయంగా అలపించారు. చైతన్య ప్రసాద్ ఈ పాటకు పవర్ ఫుల్ లిరిక్స్ అందించారు. టైటిల్ ట్రాక్ నరేష్ ఉగ్రరూపాన్ని ప్రజెంట్ చేసింది. పాటలో కనిపించిన విజువల్స్ ఇంటెన్సివ్, గ్రిప్పింగ్, స్టన్నింగ్ గా వున్నాయి.

ఈసినిమాలో అల్లరి నరేష్ సరసన మిర్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈసినిమాను షైన్ స్క్రీన్స్‌ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. మాట‌లు అబ్బూరి ర‌వి అందిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా, సిద్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. మరి చూద్దాం ఈసినిమా ఎంతవరకూ ప్రేక్షకులను అలరిస్తుందో.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − thirteen =