
ట్యాగ్ · 75 కథనాలు · పేజీ 3

'క్రాక్' - న్యూ ఇయర్ కి రానున్న ట్రైలర్
ఎంజాయ్ మూడ్ లో శృతి హాసన్
'క్రాక్' రిలీజ్ డేట్ ఫిక్స్
హీరో ప్రభాస్ తో నటించాలని ఉంది - శృతి హాసన్
శృతి హాసన్ ఫీలింగ్స్
"క్రాక్" గోవా షెడ్యూల్ పూర్తి
క్రాక్ సెట్ లో సూపర్ ఫన్ - ప్లాంక్ చాలెంజ్
ఫైనల్ షెడ్యూల్ కోసం 'గోవా' లో క్రాక్ టీమ్
శృతి హాసన్ ఫొటో షూట్స్
గ్యాప్ రాలేదు.. తీసుకున్నా అంటున్న శృతి
శృతి రియాక్షన్ కు బన్నీ షాక్
నా సేఫ్టీ నాకు ముఖ్యం అంటున్న శృతి
ప్రయాణానికి సిద్ధం - శృతి హాసన్
టాకీ పార్ట్ పూర్తిచేసుకున్న 'క్రాక్'

డాడీ బర్త్ డే కు శృతి స్వీట్ విషెస్
ఫేస్ ఫిల్టర్స్ తో క్రాక్ సెట్ లో శృతి ఫన్
సంక్రాంతి బరిలో "క్రాక్ "
నేను ఎంత ఒంటరిదాన్నో లాక్ డౌన్ లో తెలిసింది

2021 సంవత్సరంలో శృతిహాసన్ సినిమాల సందడి
తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. మల్టీ టాలెంటెడ్ శృతి కథానాయికగా రూపొందిన 2 తెలుగు , ఒక తమిళ మూవీ షూటింగ్స్ కంప్లీట్ అయ్యాయి. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ శృతి ఫొటో షూట్స్ లో పాల్గొన్న తన ఫొటోస్ ను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. 3 సంవత్సరాల తరువాత శృతి హాసన్ 2021 సంవత్సరంలో 3 సినిమాలతో సందడి చేయనున్నారు.
"క్రాక్ " మూవీ లో ప్రణీత స్పెషల్ సాంగ్
సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ , శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ "మూవీ జనవరి 14 వ తేదీ సంక్రాంతి పండగ కానుకగా రిలీజ్ కానుంది. గోపీచంద్ మలినేని , రవితేజ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ హ్యాట్రిక్ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్, సముద్ర ఖని , అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.
'క్రాక్' - న్యూ ఇయర్ కి రానున్న ట్రైలర్
మహారాజా రవితేజ, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో మూడో చిత్రం 'క్రాక్' రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసిన సంగతి కూడా కూడా. సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలు పెట్టారు చిత్రయూనిట్. తమన్ అందించిన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది.
ఎంజాయ్ మూడ్ లో శృతి హాసన్
మల్టీ టాలెంటెడ్ యాక్ట్రెస్ శృతి హాసన్ సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఫోటో షూట్స్ లో పాల్గొన్న ఫొటోస్ , సెల్ఫీ ఫొటోస్ ను శృతి సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " మూవీ లో శృతి కథానాయికగా నటించారు. "క్రాక్ "మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యింది. ఈ మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుందని సమాచారం.
'క్రాక్' రిలీజ్ డేట్ ఫిక్స్
కరోనా కారణంగా ఇన్ని రోజులు థియేటర్స్ మూతబడ్డాయి. ఇక ఇన్ని రోజులు డల్ గా ఉన్న బాక్స్ ఆఫీస్ వచ్చే సంక్రాంతికి మాత్రం పెద్ద ఎత్తున సందడి నెలకొనేలా కనిపిస్తుంది. చాలా సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు మరో సినిమా సంక్రాంతికి రెడీ అవుతుంది. అదే క్రాక్ సినిమా. మాస్ మహారాజా రవితేజ, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందుతున్న మూడో చిత్రం 'క్రాక్'. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.
హీరో ప్రభాస్ తో నటించాలని ఉంది - శృతి హాసన్
స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేశారు. విజయ్ సేతుపతి హీరోగా రూపొందుతున్న "లాభం "తమిళ మూవీ లో శృతి కథానాయికగా నటిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న "వకీల్ సాబ్ "మూవీ లో శృతి కథానాయికగా ఎంపిక అయ్యారు. "గబ్బర్ సింగ్ ", "కాటమ రాయుడు " మూవీస్ తో పవన్ కళ్యాణ్ , శృతి జోడీ ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.
శృతి హాసన్ ఫీలింగ్స్
మాస్ మహారాజా రవితేజ , శృతి హాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ పై వాస్తవ సంఘటనలతో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " మూవీ షూటింగ్ గోవా షెడ్యూల్ తో కంప్లీట్ అయ్యింది. వరలక్ష్మి శరత్ కుమార్ , సముద్ర ఖని , అలీ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. సూపర్ హిట్ "బలుపు "మూవీ తరువాత శృతి హాసన్ , "క్రాక్ "మూవీ లో నటించారు.ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన తరువాత శృతి తన ఫీలింగ్స్ ను వెల్లడించారు.
"క్రాక్" గోవా షెడ్యూల్ పూర్తి
సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ , స్టార్ హీరోయిన్ శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనలతో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ "మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. హీరో రవి తేజ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్ , సముద్ర ఖని , అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. కరోనా కారణంగా నిలిచిపోయిన "క్రాక్ "మూవీ షూటింగ్ అక్టోబర్ నెలలో పునః ప్రారంభం అయ్యింది.
క్రాక్ సెట్ లో సూపర్ ఫన్ - ప్లాంక్ చాలెంజ్
దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత శృతీ మళ్ళీ క్రాక్ సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇవ్వనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు టాకీ పార్ట్ పూర్తి చేసుకోగా ఇటీవలే షూట్ కోసం గోవా కూడా వెళ్లారు అయితే అక్కడ షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నారు. ఇక ఇదిలా ఉండగా శృతీ హాసన్ తాజాగా తన ఇన్‌స్టాలో చిన్న వీడియో ఒకటి పోస్ట్ చేస్తూ క్రాక్ సినిమా షూట్ గురించి చెప్పుకొచ్చింది.
ఫైనల్ షెడ్యూల్ కోసం 'గోవా' లో క్రాక్ టీమ్
మాస్ మహారాజా రవితేజ, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందుతున్న మూడో చిత్రం 'క్రాక్'. 'క్రాక్' తో హ్యాట్రిక్ హిట్ కోసం రెడీ అవుతున్నారు వీరిద్దరు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇటీవలే క్రాక్ టీం కూడా ఆఖరి షెడ్యూల్ ను మొదలుపెట్టేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని రామోజీ ఫిలింసిటీలో స్టార్ట్ చేయగా కొంత భాగం అక్కడ చిత్రీకరించారు. ఇక కొంతభాగం మిగిలిఉండగా ఇప్పుడు అది కంప్లీట్ చేయడానికి చిత్రయూనిట్ గోవా వెళ్లినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని రవితేజ తన ఇన్‌స్టా ద్వారా తెలియచేశారు. ఫైనల్ షెడ్యూల్ కోసం గోవా వెళ్తున్నట్టు పోస్ట్ లో పేర్కొన్నాడు.
శృతి హాసన్ ఫొటో షూట్స్
తెలుగు , తమిళ , హిందీ భాషల సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ మల్టీ టాలెంటెడ్ శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ శృతి అభిమానులను అలరిస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం లో మాస్ మహారాజా రవితేజ , శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనలతో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఎస్ పి జననాథన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా రూపొందుతున్న "లాభం "తమిళ మూవీ లో శృతి కథానాయికగా నటిస్తున్నారు.
గ్యాప్ రాలేదు.. తీసుకున్నా అంటున్న శృతి
అనగనగా ఓ ధీరుడు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శృతిహాసన్ ఆ తరువాత తక్కువ కాలంలోనే తెలుగులో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక కెరీర్ మంచి పీక్స్ లో వున్నప్పుడే సినిమాలకు దూరమైంది. దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్లీ కెరీర్ పై దృష్టి పెట్టింది. ప్రస్తుతం తెలుగు, తమిళ్ సినిమాలతో బిజీ గా ఉంది.
శృతి రియాక్షన్ కు బన్నీ షాక్
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన రేసుగుర్రం సినిమా మంచి విజయం దక్కించుకున్న సంగతి తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ‘కిక్’ శ్యామ్ అన్నదమ్ములుగా నటించిన ఈ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ అందరినీ అలరించింది. “టామ్ అండ్ జెర్రీ”లా నిత్యం పోట్లాడుకుంటూ ఉండే ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఉండే భావోద్వేగాలను.. వినోదాత్మకంగా వెండితెరపై ఆవిష్కరించాడు సురేందర్ రెడ్డి.
నా సేఫ్టీ నాకు ముఖ్యం అంటున్న శృతి
కరోనా ప్రభావం కాస్త తగ్గినట్టు అనిపిస్తున్నాఇప్పుడప్పుడే రిలాక్స్ అయ్యే పరిస్థితి లేదు. అందుకే కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ షూటింగ్ లు మొదలుపెడుతున్నారు. ఇక సెలెబ్రిటీస్ కూడా నిర్లక్ష్యం వద్దని జాగ్రత్తగా ఉండమని తమ సోషల్ మీడియా ద్వారా చెపుతూనే ఉన్నారు. ఇప్పుడు శృతి హాసన్ కూడా మరొకసారి తన సోషల్ మీడియా వేదికగా జాగ్రత్తలు తీసుకోమని చెపుతుంది. కోవిడ్ అనేది సీరియస్ హెల్త్ రిస్క్.. కరోనా ప్రభావం ఇంకా తగ్గలేదు.. సెట్స్ లో నిబంధనలు పాటించనప్పుడు ఒక వ్యక్తిగా ఒక నటిగా నా హెల్త్ గురించి జాగ్రత్తలు తీసుకునే రైట్ నాకుంది అంటూ చెప్పుకొచ్చింది ఈ భామ.
ప్రయాణానికి సిద్ధం - శృతి హాసన్
స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ "వకీల్ సాబ్ ", రవితేజ "క్రాక్ ", విజయ్ సేతుపతి "లాభం "(తమిళ ) మూవీస్ తో బిజీగా ఉన్నారు. ఇన్ స్టాగ్రామ్ లో 15. 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న శృతి ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ తన జీవిత విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. తన లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ శృతి అభిమానులను అలరిస్తున్నారు.
టాకీ పార్ట్ పూర్తిచేసుకున్న 'క్రాక్'
మాస్ మహారాజా రవితేజ, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందుతున్న మూడో చిత్రం 'క్రాక్'. ఇటీవలే క్రాక్ టీం కూడా ఆఖరి షెడ్యూల్ ను మొదలుపెట్టేసిన సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. త్వరలో హీరో హీరోయిన్లు రవితేజ, శ్రుతి హాసన్‌పై ఓ పాటను చిత్రీకరించనున్నారట. ఆ పాటతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుందని చెపుతున్నారు చిత్రయూనిట్.

డాడీ బర్త్ డే కు శృతి స్వీట్ విషెస్
బాలనటుడిగా "కలత్తూర్ కన్నమ్మ " మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయిన కమల్ హాసన్ దక్షిణాది భాషలతో పాటు హిందీ, బెంగాలీ బాషలలో 230 మూవీస్ కు పైగా నటించారు. పలు భాషల బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించి కమల్ హాసన్ స్టార్ హీరోగా రాణిస్తున్నారు. యాక్టర్ , రైటర్ , డ్యాన్సర్ , కొరియోగ్రాఫర్ , లిరిసిస్ట్ , ప్రొడ్యూసర్ , డైరెక్టర్ గా చిత్ర పరిశ్రమకు 6 దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న కమల్ హాసన్ ను పద్మశ్రీ , పద్మభూషణ్ పురస్కారాలతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది.
ఫేస్ ఫిల్టర్స్ తో క్రాక్ సెట్ లో శృతి ఫన్
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా క్రాక్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ లాక్ డౌన్ ముందే ముగింపు దశకు వచ్చింది. కేవలం 10-15 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలిఉండగా.. ఇక ఇప్పుడు షూటింగ్స్ మొదలవుతున్న నేపథ్యంలో క్రాక్ టీం కూడా ఆఖరి షెడ్యూల్ ను మొదలుపెట్టేసింది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో చివరి షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.
సంక్రాంతి బరిలో "క్రాక్ "
కరోనా మహమ్మారి కారణంగా చిత్ర పరిశ్రమ సంక్షోభంలో పడిన విషయం తెలిసిందే. థియేటర్స్ బంద్ అయ్యి , షూటింగ్స్ నిలిచిపోయి , రిలీజులు ఆగిపోయి చిత్ర పరిశ్రమ పలు నష్టాలకు గురిఅయ్యింది. 6 నెలల విరామం తరువాత షూటింగ్స్ కు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో పలు మూవీస్ షూటింగ్స్ పునః ప్రారంభం అయ్యాయి. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సినిమాలే కాకుండా , బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సినిమాలు కూడా విడుదలకు సిద్ధం అయ్యాయి. కొన్ని నియమ , నిబంధనలతో థియేటర్స్ రీ ఓపెన్ అయినా ప్రేక్షకాదరణ అంతంత మాత్రంగానే ఉంది.
నేను ఎంత ఒంటరిదాన్నో లాక్ డౌన్ లో తెలిసింది
ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా చెప్పే అలవాటు శ్రుతి హాసన్ ది. ఇక ప్రస్తుతం శృతి హాసన్ హైద్రాబాద్‌లో ఉన్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ తీసేసినప్పుడే ఇక్కడికి వచ్చేసింది. ప్రస్తుతం ఈ భామ క్రాక్ సినిమా షూటింగ్ లో ఉంది. ఇక ఇదిలా ఉండగా ఈ లాక్ డౌన్ లో చాలా విషయాలు తెలుసుకున్నా అంటుంది శృతి హాసన్.