కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Actress Samantha Akkineni

ట్యాగ్ · 96 కథనాలు · పేజీ 5

Actress Samantha Akkineni Joins Dubbing Session Of Family Man 2 Web Series
సినిమా వార్తలు

'ద ఫ్యామిలీ మ్యాన్ 2' డబ్బింగ్ స్టార్ట్ చేసిన సామ్

మనోజ్ బాజ్‌పెయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ద ఫ్యామిలీ మ్యాన్'.అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన ఈ సిరీస్ కు ఫుల్ వ్యూస్ తో పాటు, క్రేజ్ కూడా సొంతం చేసుకుంది. మొదటి సీజన్ సూపర్ హిట్ అవ్వడంతో రెండో సీజన్ కూడా తెరకెక్కిస్తున్న సంగతి కూడా విదితమే. తెలుగు దర్శకులు రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకేలు ఈ వెబ్‌ సిరీస్‌‌ను దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరు హిందీలో 'షోర్ ఇన్ ది సిటీ', 'గో గోవా గాన్' సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇక ఈ వెబ్ సిరీస్ లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఓ టెర్రరిస్ట్ పాత్రలో సమంత నటిస్తున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
Rakul Preet Accepts Samantha's Challenge
సినిమా వార్తలు

సామ్ 'గ్రో విత్ మీ' ఛాలెంజ్ పూర్తి చేసిన రకుల్

'గ్రో విత్ మీ' ఛాలెంజ్.. సమంత కొత్తగా ముందుకు తీసుకొచ్చిన ఛాలెంజ్. లాక్ డౌన్ సమయాన్ని ఒక్కొక్కరు ఒక్కోరకంగా వాడుకుంటున్నారు. అయితే ఈ లాక్ డౌన్ స‌మ‌యాన్ని క‌రెక్ట్‌గా వినియోగించుకుంటున్న వారిలో స‌మంత కూడా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే స‌మంత అర్బన్‌ వ్యవసాయానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌ లోని తన నివాసంలోని టెర్రస్‌పై ఉన్న ఖాళీ ప్లేస్లో సేంద్రీయ పద్దతుల్లో కూరగాయల్ని పండిస్తోంది. ఇక తాను మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ ఇలానే కాయకూరల్ని పండించుకొని తినాలని కూడా పిలునిస్తుంది. అంతేనా కావాల్సిన టిప్స్ కూడా చెపుతుంది సామ్. ఇక ఈ ఆలోచనలో భాగంగానే వచ్చిందే ' 'గ్రో…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

24 "క్యారెట్" ఆనందంలో సమంత

తెలుగు , తమిళ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ సమంత స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. గార్డెనింగ్ పై ఆసక్తి తో సమంత తన ఇంటి టెర్రస్ పై సేంద్రియ పద్ధతి లో ఆకు కూరలు , కూరగాయలు పండిస్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ తన జీవిత విశేషాలను సమంత అభిమానులతో పంచుకుంటున్నారు. సమంత ప్రస్తుతం విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందనున్న ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
Actress Samantha Akkineni Plans Her Entire Week Menu With Carrots From Her Home Garden
సినిమా వార్తలు

ఈవారం మెను మొత్తం 'క్యారెట్స్' అంటున్న సామ్

మాఇంట్లో ఈవారం మొత్తం మెను క్యారెట్స్ అంటుంది సమంత. మరి అందుకు కారణం ఏంటో తెలుసుకోవాలంటే అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే. లాక్ డౌన్ లో దొరికిన ఈ టైంను సామ్ చాలా బాగా ఉపయోగించుకుంటుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా అర్బన్ ఫార్మింగ్ చేస్తూ ఇంట్లోనే చక్కగా సేంద్రియ పద్దతి ద్వారా కూరగాయలు పెంచుతూ.. తనకు కావాల్సిన కాయకూరల్ని తానే స్వయంగా పండించుకుంటుంది. అంతేకాదు తనలాగే అందరూ ఇంట్లోనే కూరగాయలు పెంచుకోమని.. దానికి సంబంధించి టిప్స్ కూడా చెపుతుంది. వాటికి సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటోంది.

TFN Adminవాట్సాప్
Actress Samantha Akkineni Releases Common Display Picture Of Akkineni Nagarjuna
సినిమా వార్తలు

కింగ్ నాగార్జున బర్త్ డే సీడీపీ రిలీజ్

లెజెండరీ యాక్టర్ , నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు తనయుడు నాగార్జున సక్సెస్ ఫుల్ "విక్రమ్ " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. తెలుగు , తమిళ , హిందీ భాషలలో సుమారు 100 సినిమాలతో మూడున్నర దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. బెస్ట్ యాక్టర్ గా 1 నేషనల్ , 9 నంది , 3 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ నాగార్జున అందుకున్నారు. "గీతాంజలి ", "శివ ", "హలో బ్రదర్ ", "క్రిమినల్ ", "నిన్నే పెళ్ళాడుతా ", "అన్నమయ్య ", " నేనున్నాను ", "సోగ్గాడే చిన్ని నాయనా " వంటి సూపర్ హిట్ మూవీస్ నాగార్జున సినీ కెరీర్ లో మైలు రాళ్ళు గా నిలిచాయి. నాగార్జున ప్రస్తుతం "వైల్డ్ డాగ్ ", "బ్రహ్మాస్త్ర "(హిందీ ) మూవీ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Samantha Akkineni Urges Everyone To Take Part With Her In Grow With Me Challenge
సినిమా వార్తలు

సామ్ 'గ్రో విత్ మీ ఛాలెంజ్'

మనం చేసే పనుల ద్వారా అందరికంటే మనం కాస్త విభిన్నం అని తెలుస్తుంది. టాలీవుడ్ లో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా అక్కినేని వారి కోడలు స్టార్ హీరోయిన్ సమంత తాను చేసేపనులు ద్వారా తాను కాస్త భిన్నం అని నిరూపిస్తుంది ఎప్పుడూ. తెలుగు సినిమా రంగంలో అడుగుపెట్టి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే నాగ చైతన్యను పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత క్రేజ్ ఏమన్నా తగ్గిందా అంటే.. అదే క్రేజ్.. అవే సూపర్ హిట్స్. పెళ్లైన తర్వాత కూడా వరుస సినిమాలతో.. హిట్స్ తో, ఆఫర్స్ తో దూసుకుపోతోందంటే అది కేవలం సమంతకు మాత్రమే సాధ్యమైంది. ఇక ఛారిటీ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూనే వుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

"బంగార్రాజు " మూవీ లో సమంత గెస్ట్ రోల్ ?

తెలుగు , తమిళ భాషల సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ సమంత స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ సమంత అభిమానులను ఆకట్టుకుంటున్నారు. "ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2 " వెబ్ సిరీస్ లో నటించిన సమంత, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందనున్న ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సమంత ఇప్పుడు ఒక తెలుగు మూవీ లో గెస్ట్ రోల్ లో నటించనున్నారని సమాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

గ్రీన్ చుడిదార్ లో సమంత

తెలుగు , తమిళ బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని సమంత స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. పలు తెలుగు , తమిళ మూవీస్ కు సమంత బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్అందుకున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ సమంత తన జీవిత విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. సమంత ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హిట్ "ఓ బేబీ " మూవీ తరువాత ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ పై ఆసక్తి చూపుతున్నారు. "ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2 " వెబ్ సిరీస్ లో నటించిన సమంత ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సమంత ట్రెండ్ సెట్టర్..!

టాలీవుడ్ హీరోయిన్లలో సమంత రేంజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొద్ది కాలానికే.. లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకొని స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఇక పెళ్లి తరువాత హీరోయిన్లకు పెద్దగా సినిమాలు రావు.. సక్సెస్ రేట్ కూడా తక్కువగానే ఉంటుంది.. కానీ అమ్మడు అదృష్టం ఏంటో కానీ పెళ్లి తరువాత కూడా అవకాశాలు తగ్గలేదు కదా.. వరుస హిట్లు కొట్టేస్తుంది. అందుకే ఇప్పుడు ఎంతో మందికి సమంత ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు.

TFN Adminవాట్సాప్
Picture Perfect: Chay Sam's adorable Pic from Rana Daggubati and Miheeka wedding
సినిమా వార్తలు

'చైసామ్' పిక్చర్‌ పర్ఫెక్ట్

గత మూడు నాలుగు రోజుల నుండి రానా-మిహికా ల పెళ్లి సందడి చూస్తూనే ఉన్నాం. హల్దీ ఫంక్షన్, మెహందీ, పూజ కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తూనే ఉన్నాయి. మొత్తానికి నిన్న రాత్రి రానా- మిహికాల వివాహం రామానాయుడు స్టూడియోలో అతికొద్ది సన్నిహితుల మధ్య జరిగిపోయింది. ఇక ఈ వివాహానికి సమంతా, నాగ చైతన్య, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఉపాసనలు కూడా హాజరయ్యారు. ఇక వీరికి సంబంధించిన ఫొటోలు కూడా బయటకొచ్చాయి. అయితే ఈ పెళ్లి సందడి మొదలైనప్పటి నుండి ఇప్పటివరకూ ఎన్నో ఫొటోలు బయటకొచ్చాయి. కానీ ఇప్పుడు ఒక ఫొటోకు మాత్రం నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆ ఫొటో ఎవరిదో కాదు నాగ చైతన్య-సమంతది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అక్కా చెల్లెళ్ళు గా సమంత , రష్మిక ?

స్టార్ హీరోయిన్ సమంత , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక అక్కా చెల్లెళ్ళు గా ఒక మూవీ లో నటిస్తున్నారని సమాచారం. ఇటీవల ఒక యువదర్శకుడు అక్కా చెల్లెళ్ళు కథ తో సమంత , రష్మిక లను సంప్రదించారని, కథ వినగానే ఇద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని , ఉమెన్ సెంట్రిక్ మూవీ గా రూపొందనున్న ఈ మూవీ ని ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనుందని సమాచారం. ఇద్దరు ట్యాలెంటెడ్ హీరోయిన్స్ కలిసి నటిస్తున్నారనే వార్త అభిమానులలో సంతోషం కలిగించింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'జీరో బడ్జెట్ గార్డెనింగ్' టిప్స్ ఇస్తున్న సామ్..!

లాక్ డౌన్ లో రియల్ లైఫ్ లో సమంత ఎంత సింపుల్ గా ఉంటుందో తెలుస్తుంది. లాక్ డౌన్ లో ఉన్న ఖాళీ సమయాన్ని భర్త చైతన్య తో కలిసి ఎంజాయ్ చేస్తూనే మరో పక్క గార్డెనింగ్ చేస్తూ, కూరగాయలు పండిస్తూ కాలక్షేపం చేస్తుంది. అంతేకాదు ఇంటి టెర్రస్‌పై ఖాళీగా ఉన్న ప్రదేశంలో కూరగాయలు పండించింది. వాటికి సంబందించిన ఫొటోలను కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంది. అంతేకాదు ఎలా పెంచాలి.. దీనికోసం ఏమేం చేయాలి.. టెర్రస్ పై ఉన్న ఖాళీ స్థలాన్ని ఎలా ఉపయోగించుకోవాలి.. కూరగాయలను ఎలా పండించాలి ఇలా పలు సూచనలు కూడా ఇచ్చింది. ఇక ఇప్పుడు మరోసారి అర్బన్ ఫార్మింగ్ ఎలా చేసుకోవాలో చెపుతుంది. దానికోసం ఒక వీడియోను కూడా…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సాధారణంగా ఉండమంటున్న 'సామ్'..!

సమంత సినిమాల గురించి కానీ.. సమంత నటన గురించి కానీ ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి... తన నటనతో.. టాలెంట్ తో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. ఇండస్ట్రీకి రావాలనుకుంటున్న చాలా మంది అప్ కమింగ్ హీరోయిన్స్ కు సమంత ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. కేవలం సినిమాలే కాదు ఇంకా చాలా విషయాల్లో సమంత ఆదర్శంగా నిలుస్తుందని చెప్పొచ్చు. సమాజ సేవ చేసే విషయంలోనూ..ఫ్యాషన్ విషయంలోనూ.. సింపుల్ సిటీ లోనూ చాలా విషయాల్లో సామ్ స్పూర్తినిస్తుంది. ఇక

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సమంత ఇంటి వ్యవసాయం

కరోనా మహమ్మారి కారణం గా షూటింగ్స్ నిలిచిపోవడంతో సినీ సెలబ్రిటీస్ 4 నెలలుగా ఇంటికే పరిమితం అయ్యారు.సినీ సెలబ్రిటీస్ తమ తమ వ్యాపకాలతో టైమ్ పాస్ చేస్తున్నారు. టాలీవుడ్ , కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత తన ఇంటి టెర్రస్ పై ఆర్గానిక్ ఆకు కూరలు, కూరగాయలు పండిస్తున్న విషయం తెలిసిందే. తనకెంతో సంతోషాన్ని ఇచ్చే వ్యాపకం ఇది అని సమంత చెప్పారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రష్మిక పై సమంత ప్రశంసలు

బ్లాక్ బస్టర్ "సరిలేరు నీకెవ్వరు ", "భీష్మ " వంటి మూవీస్ తో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న "పుష్ప " మూవీ లో నటిస్తున్నారు. రష్మిక హీరోయిన్ గా రూపొందిన "పొగరు "(కన్నడ ), "సుల్తాన్" (తమిళ ) మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి. "సుల్తాన్" తమిళ మూవీ తో రష్మిక కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ద్వి భాషా చిత్రానికి సమంత గ్రీన్ సిగ్నల్

సక్సెస్ ఫుల్ "ఏ మాయ చేసావె " మూవీ తో ప్రేక్షకులను మాయ చేసిన సమంత టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. సమంత హీరోయిన్ గా నటించిన బృందావనం, దూకుడు, ఈగ, అత్తారింటికి దారేది , మనం, జనతా గ్యారేజ్, రంగస్థలం, మజిలీ మూవీస్ ఘనవిజయం సాధించాయి. సక్సెస్ ఫుల్ "ఓ .. బేబీ " తరువాత సమంత మరే మూవీ ని అంగీకరించలేదు.

Team TFNవాట్సాప్

షేర్