
ట్యాగ్ · 1558 కథనాలు · పేజీ 49


లారెన్స్ డైరెక్షన్‌లో అమితాబ్?

మరోసారి పోలీస్‌గా, ఫ్యాక్షనిస్ట్ గా బాలయ్య?

‘ప్రభాస్20’ మూవీ అప్‌డేట్స్

మజిలీ త్రీ వీక్స్ వరల్డ్ వైడ్ షేర్స్

మెగా హీరో సినిమాలో కన్ఫామ్

కాంచన 3 ఫస్ట్ వీక్ కలెక్షన్స్

కార్తి - జ్యోతిక కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం

ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్

క్రేజీ కాంబినేషన్ లో మూవీ

జెర్సీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

మన్మథుడు నాగార్జున

జోరుగా మహర్షి మూవీ ప్రమోషన్స్

మహేష్ చిత్రంలో రమ్యకృష్ణ?

మ్యూజికల్ సెన్సేషన్ ‘ఖుషి’కి 18 ఏళ్ళు

బాలీవుడ్ రీమేక్ లో సూపర్ డీలక్స్

మల్టీ స్టారర్ మూవీ టైటిల్ లోగో విడుదల
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందనున్న యాక్షన్ థ్రిల్లర్ మల్టీ స్టారర్ మూవీ లో నాని, సుధీర్ బాబు నటిస్తున్నారు. మల్టీ స్టారర్ మూవీ V టైటిల్ లోగో ను ఈ రోజు చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. V మూవీ లో అదితి రావు హైదరి, నివేత థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేదిసంగీతంఅందిస్తున్నారు.V మూవీ లో నటిస్తున్న నాని, సుధీర్ బాబు, అదితిరావు హైదరి, నివేత థామస్ ట్విట్టర్ ద్వారా తమ స్పందనను తెలియజేశారు.

లారెన్స్ డైరెక్షన్‌లో అమితాబ్?
అమితాబ్ బచ్చన్… భారతీయ సినీ జగత్తులో రారాజు. దాదాపు ఐదు దశాబ్దాలుగా ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలకు తన నటనతో ఊపిరి పోస్తున్న మహానటుడు. ఏడు పదుల వయసు దాటినా కూడా ఎంతో హుషారుగా వరుస సినిమాలను చేస్తున్న ఈ సూపర్ స్టార్… ఇప్పుడు మరో డిఫరెంట్ రోల్‌లో కనిపించనున్నట్టు బాలీవుడ్ టాక్.

మరోసారి పోలీస్‌గా, ఫ్యాక్షనిస్ట్ గా బాలయ్య?
గత ఏడాది సంక్రాంతికి ‘జై సింహా’తో అలరించిన నటసింహం నందమూరి బాలకృష్ణ, కోలీవుడ్ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్… మరోసారి జట్టు కడుతున్న సంగతి తెలిసిందే. ‘జైసింహా’ను నిర్మించిన సి.కళ్యాణ్… ఈ సినిమాను కూడా నిర్మిస్తున్నాడు. కాగా.. మే నుంచి పట్టాలెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో బాలయ్య ద్విపాత్రాభినయం చేయబోతున్నట్టు సమాచారం. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో… చెన్నకేశవరెడ్డి (2002) తరహాలో ఫ్యాక్షనిస్ట్‌గా, పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడట బాలయ్య. అంతేకాదు… పోలీస్ పాత్ర పేరు ఎస్పీ రంజిత్ కుమార్ రానా అని టాక్. అలాగే… టైటిల్ కూడా…

‘ప్రభాస్20’ మూవీ అప్‌డేట్స్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, జిల్ ఫేమ్ రాధాకృష్ణ కాంబినేషన్‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పిరియాడిక్ లవ్ స్టోరీలో… ప్రభాస్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.

మహర్షి నుండి 'పాల పిట్ట' పాట రిలీజ్
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న 'మహర్షి' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు షురూ చేశారు. ఇందుకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సినిమా నుండి ‘ఛోటి ఛోటి ఛోటి బాతే.. మీటి మీటి మీటి యాదే', ‘‘నువ్వే సమస్తం.. నువ్వే సిద్ధాంతం….నువ్వే నీపంతం, నువ్వేలే అనంతం' 'ఎవరెస్ట్ అంచున పూసిన రోజా పువ్వే' పదరా పదరా అన్న పాటలు విడుదలవ్వగా.. వాటికి అద్భుతమైన స్పందన వస్తోంది. ఈరోజు ఈ సినిమా నుండి పాల పిట్ట అనే ఐదవ పాటను రిలీజ్ చేశారు.

బ‌్లాక్‌బస్టర్ సోషియో-ఫాంటసీ ఫిల్మ్ ‘యమలీల’కు 25 ఏళ్ళు
తెలుగు నాట… యమ సందడికి తిరుగులేదు. అందుకే… యమగోల(ఎన్టీఆర్), యముడికి మొగుడు (చిరంజీవి), యమదొంగ (జూనియర్ ఎన్టీఆర్) వంటి పేర్లతో వచ్చిన స్టార్ హీరోల సోషియో - ఫాంటసీ ఫిల్మ్స్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. అయితే… అప్పటివరకు హాస్య నటుడిగా రాణిస్తున్న ఓ యువ నటుడు… కథానాయకుడిగా మారి అలరించడమే కాకుండా… చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకున్న వైనం మాత్రం… యమ శబ్ధం ఉన్న యమలీలతోనే సాధ్యమైంది. ఆ హాస్య నటుడే… అలీ. భవిష్యవాణి, అమ్మ సెంటిమెంట్… ఈ రెండు అంశాలు ఈ సోషియో ఫాంటసీకి ప్రెష్ నెస్‌ను తీసుకొచ్చి… ఘనవిజయం ముంగిట నిలిపాయి. అలా… అలీ కెరీర్‌లో…

మజిలీ త్రీ వీక్స్ వరల్డ్ వైడ్ షేర్స్
శివ నిర్వాణ దర్శకత్వంలో నాగ చైతన్య, సమంత, దివ్యాన్ష కౌషిక్ ప్రధాన పాత్రల్లో ఈ నెల 5 న విడుదలైన మజిలీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఇప్పటివరకూ రిలీజ్ అయిన చిత్రాల్లో ఎఫ్ 2 తరువాత అంత స్థాయిలో హిట్ అయిన రెండో బ్లాక్ బ్లాస్టర్ హిట్ గా మజిలీ నిలిచింది. మజిలీ తరువాత పలు సినిమాలు రిలీజై అవి కూడా మంచి టాక్ తో దూసుకుపోతున్న నేపథ్యంలో కూడా మజిలీ తన కలెక్షన్స్ తాను రాబడుతూనే ఉంది. చైతు కెరీర్ లోనే ది బెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా మూడు వారాల్లో ప్రపంచ వ్యాప్తంగా 62.15 కోట్ల గ్రాస్ ను అలాగే 36.27 కోట్ల షేర్ ను రాబట్టింది. మరి మూడు వారాల్లో ఏ ఏరియాలో మజిలీ ఎంత…

మెగా హీరో సినిమాలో కన్ఫామ్
మెగా మేనల్లుడు సాయథరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన బుచ్చిబాబు దర్శకత్వంలో.. పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందిస్తున్న ఈ సినిమాను ఇటీవలే మెగా కుటుంబసభ్యుల సమక్షంలో లాంఛనంగా ప్రారంభించారు. మే నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

కాంచన 3 ఫస్ట్ వీక్ కలెక్షన్స్
లారెన్స్ కథానాయకుడిగా తెరకెక్కిన 'కాంచన 3' సినిమా ఈ నెల 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి టాక్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ను జోరుగా రాబడుతుంది. సినిమా విడుదలైన మొదటి వారంలోనే ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఒక్క తమిళ్ లోనే ఈ సినిమా వారం రోజుల్లో 60 కోట్లు కలెక్ట్ చేసి షాకిచ్చింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈసినిమా జోరు కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా తొలివారంలోనే 13 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇప్పటికే లాభాల బాట పట్టిన ఈ సినిమా, ఫుల్ రన్ లో 25 కోట్లకి పైగా వసూలు చేయవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈసినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో…

కార్తి - జ్యోతిక కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం
దృశ్యం ఫేమ్ జితూ జోసఫ్ డైరెక్షన్ లో కార్తి హీరోగా కొత్త సినిమా తెరకెక్కబోతున్నట్టు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కార్తి వదిన అయిన జ్యోతిక కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నారు. అందుకే అప్పుడే ఈ సినిమాపై క్రేజ్ ఏర్పడింది. అయితే ఇప్పుడు తాజాగా ఈసినిమా షూటింగ్ ను ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు చిత్రయూనిట్. ఈ విషయాన్ని కార్తి స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
'ఉండిపోరాదే' నిర్మాత అంటుంటే గర్వంగా ఉంది - నిర్మాత బెక్కం వేణు గోపాల్
డబ్బుండి కాదు.. ప్యాషన్ ఉండి నిర్మాతగా ఎదిగిన వ్యక్తి బెక్కం వేణుగోపాల్.. టీవీ ప్రొడక్షన్ మేనేజర్ గా, కెమెరా అసిస్టెంట్ గా కెరీర్ మొదలు పెట్టిన వేణుగోపాల్ ప్రస్తుతం చిన్న సినిమాల సక్సెస్ ఫుల్ నిర్మాతగా రాణిస్తున్నారు. ‘మేం వయసుకు వచ్చాం’ దగ్గరనుండి ఆయన చేస్తున్న ప్రయాణం ప్రస్తుతం చాలా ‘‘హుషారు’’గా సాగుతుంది. ఈ యేడాది మూడు సినిమాలు విడుదల చేయాలన్నది లక్ష్యంగా పనిచేస్తున్న బెక్కం వేణుగోపాల్ ఈరోజు తన పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ముచ్చటించారు.

ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్
ఫైనల్లీ ఏపీలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' రిలీజ్ కు డేట్ ఫిక్స్ చేశారు రామ్ గోపాల్ వర్మ. ఎన్నో వివాదల తరువాత ఏపీలో ఈ సినిమా విడుదలకు సిద్దమైంది. మార్చి 22న ఏపీ మినహా ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా రిలీజై మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ఇలాంటి సినిమా తీసినందుకు రామ్ గోపాల్ వర్మపై ప్రశంసలు కూడా కురిపించారు. అయితే ఏపీలో ఎన్నికల నేపథ్యంలో సినిమా రిలీజ్ ను ఆపేశారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఏపీలో ఈ సినిమా విడుదలపై స్టే విధించాలని ఈసీని కోరారు. దాంతో ఏపీలో రిలీజ్ కు బ్రేకులు పడ్డాయి.

క్రేజీ కాంబినేషన్ లో మూవీ
వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ కీర్తి సురేష్ దూసుకుపోతుంది. ఇక ఆది పినిశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు…అటు హీరోగా.. ఇటు విలన్ గా.. మరోవైపు కుమార బాబు లాంటి క్యారెక్టర్లు చేస్తూ తనని తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. జగపతి బాబు.. సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా, ఫాథర్ గా మంచి పాత్రలతో దూసుకుపోతున్నారు. మరి అలాంటి వీరి ముగ్గురి కాంబినేషన్ లో సినిమా వస్తే ఎలా ఉంటుంది.. క్రేజీ కాంబినేషన్ కదా.

జెర్సీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్
గౌతమ్ దర్శకత్వంలో నాని నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘జెర్సీ’ విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకొని సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈ సినిమాలో ముఖ్యంగా నాని నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. ఎమోషనల్ సీన్స్ లో నాని తన సహజనటనతో అందరిని కంటతడి పెట్టించాడని.. తన నటనే సినిమాకు హైలెట్ గా నిలిచిందని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబడుతుంది. మరి ఈసినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం..

మన్మథుడు నాగార్జున
వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ అసోసియేషన్ తో మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్స్ బ్యానర్స్ పై నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా సూపర్ హిట్ మూవీ మన్మథుడు సీక్వెల్ మన్మథుడు2 మూవీ రూపొందుతుంది. రావు రమేష్, వెన్నెల కిషోర్, సీనియర్ నటి లక్ష్మి, తమిళ నటి దేవదర్శిని, ఝాన్సీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ మూవీ RX 100 పాటలతో యూత్ లో హుషారు రేకిత్తించిన చైతన్ భరద్వాజ్ మన్మథుడు2 మూవీ కి సంగీతం అందిస్తున్నారు.

జోరుగా మహర్షి మూవీ ప్రమోషన్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన మహర్షి మూవీ మే 9వ తేదీ రిలీజ్ కానుంది. పూజా హెగ్డే, అల్లరి నరేష్ ప్రధాన తారాగణం గా రూపొందిన మహర్షి మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పివిపి సినిమా బ్యానర్స్ పై మహేష్ బాబు సిల్వర్ జూబ్లీ మూవీ మహర్షి ప్రతిష్టాత్మకంగా రూపొందింది. నిర్మాతలు మహర్షి మూవీ ప్రమోషన్స్ జోరు పెంచారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య తిరిగే 4ట్రైన్స్ ను రెంట్ కు తీసుకొని మహర్షి మూవీ పోస్టర్స్ తో కవర్ చేశారు

వెంకటేష్ ‘ఆడవారిమాటలకు... అర్థాలేవేరులే!’కి పుష్కరకాలం
కుటుంబ కథా చిత్రాలకు చిరునామాగా నిలచిన కథానాయకుడు విక్టరీ వెంకటేష్. ఆయన నటించిన పలు కుటుంబ కథా చిత్రాలు విశేషాదరణ పొందాయి. వాటిలో ‘ఆడవారిమాటలకు… అర్థాలేవేరులే!’ ఒకటి. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో వెంకీ సరసన త్రిష కథానాయికగా నటించగా… ఇతర ముఖ్య పాత్రల్లో కోట శ్రీనివాస రావు, శ్రీరామ్, కె.విశ్వనాథ్, సునీల్, జీవా, కలర్స్ స్వాతి, రాజ్యలక్ష్మి, ప్రసాద్ బాబు తదితరులు నటించారు. సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎన్.వి.ప్రసాద్, ఎస్.నాగ అశోక్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. యువన్ శంకర్ రాజా స్వరకల్పనలో రూపుదిద్దుకున్న పాటలన్నీ చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. 2007…

మహేష్ చిత్రంలో రమ్యకృష్ణ?
సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంలో భారీ తారాగణమే నటించనుందని సమాచారం. కాగా… ఇప్పటికే ఈ సినిమాలోని ఓ పవర్‌ఫుల్ రోల్ కోసం లేడీ సూపర్ స్టార్ విజయశాంతి నటించనుందని వార్తలు వస్తుండగా… తాజాగా మరో సీనియర్ హీరోయిన్ కూడా ఇంకో ముఖ్య పాత్రలో నటించనున్నట్లు కథనాలు వస్తున్నాయి.

మ్యూజికల్ సెన్సేషన్ ‘ఖుషి’కి 18 ఏళ్ళు
‘ఖుషి’… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఎంతో ప్రత్యేకంగా నిలచిన బెస్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్. అలాగే… కథానాయకుడిగా పవన్ స్థాయిని అమాంతం పెంచిన సినిమా. ఆబాలగోపాలాన్ని అలరించిన ఈ స్టైలిష్ యూత్‌ఫుల్ మూవీకి ఎస్.జె.సూర్య దర్శకత్వం వహించాడు. పవన్ కి జోడీగా భూమిక జంటగా నటించిన ఈ చిత్రంలో శివాజీ, నాజర్, విజయ్ కుమార్, సుధ, అలీ, రాజన్ పి.దేవ్, ముంతాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలను పోషించారు. కథను కీలక మలుపు తిప్పే పాత్రలో చిత్ర దర్శకుడు ఎస్.జె.సూర్య కనిపిస్తాడు. తమిళ చిత్రం ‘ఖుషి’కి రీమేక్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమాని ఎ.ఎం.రత్నం నిర్మించాడు. అప్పట్లో మ్యూజికల్ గా సెన్సేషన్‌ను…

బాలీవుడ్ రీమేక్ లో సూపర్ డీలక్స్
టి. కుమార రాజా దర్శకత్వంలో విజయ్ సేతుపతి, సమంత, రమ్యకృష్ణ, విజయసేతుపతి, ఫాహద్ ఫాజిల్, మిస్కిన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా సూపర్ డీలక్స్. గత నెల 29వ తేదీన తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేయగా ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఒక్కొక్కరూ ఒక్కో డిఫరెంట్ క్యారెక్టర్ లో నటించి… కాదు కాదు ఆ పాత్రల్లో జీవించి మరీ పాత్రలకు ప్రాణం పోశారు. అందుకే ఈ సినిమా అంత మంచి ఆదరణను సొంతం చేసుకుంది.