లారెన్స్ డైరెక్ష‌న్‌లో అమితాబ్‌?

Amitabh Bachchan as Hijra in Lawrence Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Amitabh Bachchan as Hijra,Amitabh Bachchan Next in Lawrence Movie,Kanchana Movie Gets Bollywood Remake,Amitabh Bachchan To Plat Transgender Role in Kanchana Movie Remake,Amitabh Bachchan Role in Lawrence Kanchana Movie
Amitabh Bachchan as Hijra in Lawrence Movie

అమితాబ్ బచ్చన్… భార‌తీయ సినీ జగత్తులో రారాజు. దాదాపు ఐదు దశాబ్దాలుగా ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలకు తన నటనతో ఊపిరి పోస్తున్న‌ మహానటుడు. ఏడు పదుల వయసు దాటినా కూడా ఎంతో హుషారుగా వరుస సినిమాలను చేస్తున్న ఈ సూపర్ స్టార్… ఇప్పుడు మరో డిఫరెంట్ రోల్‌లో క‌నిపించ‌నున్నట్టు బాలీవుడ్ టాక్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో ఘన విజయం సాధించిన హారర్ కామెడీ ఫిల్మ్ ‘కాంచన’(2011)ను… ఇప్పుడు హిందీలో ‘లక్ష్మీ బాంబ్’ పేరుతో రీమేక్ చేస్తున్న విషయం విదితమే. ‘కాంచన’లో కోలీవుడ్ సీనియర్ నటుడు శరత్ కుమార్ హిజ్రాగా ఓ కీలక పాత్రలో నటించాడు. ఇప్పుడు ఆ పాత్ర కోసం బిగ్ బీ అమితాబ్‌ను సంప్రదించిందట‌ చిత్ర బృందం. ఆయన కూడా ఆ పాత్ర చేసేందుకు ఒప్పుకున్నట్టు సమాచారం. అయితే… దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వచ్చే అవ‌కాశ‌ముంది.

కాగా… హిందీ వెర్ష‌న్ ని కూడా లారెన్స్ డైరెక్ట్ చేస్తుండగా… లారెన్స్ పోషించిన పాత్ర‌లో అక్షయ్ కుమార్ క‌నిపించ‌నున్నాడు. అక్షయ్‌కు జంట‌గా కియారా అద్వాని నటిస్తోంది. ఇప్పటికే తొలి షెడ్యూల్‌లో భాగంగా ఓ పాటను కూడా చిత్రీకరించడం జరిగిందని స‌మాచారం. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ సినిమా తెరపైకి రానుందని బాలీవుడ్ టాక్‌.

[subscribe]


[youtube_video videoid=mp_KkZjckjg]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 18 =