మెగా మేనల్లుడు సాయథరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన బుచ్చిబాబు దర్శకత్వంలో.. పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందిస్తున్న ఈ సినిమాను ఇటీవలే మెగా కుటుంబసభ్యుల సమక్షంలో లాంఛనంగా ప్రారంభించారు. మే నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు పంజా వైష్ణవ్ తేజ్ చిత్రంలో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నట్టు స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అధికారికంగా ఓ పోస్టర్ ద్వారా తెలిపింది.

కాగా ఈసినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన హీరోయిన్ గా మనీషా నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి.
నటీనటులు: వైష్ణవ్ తేజ్, విజయ్ సేతుపతి తదితరులు
రచన, దర్శకత్వం: బుచ్చిబాబు సాన
బ్యానర్స్: మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్
సినిమాటోగ్రఫీ:శ్యామ్ దత్ సైనుద్దీన్
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఎడిటింగ్: నవీన్ నూలి
ఆర్ట్: మోనిక రామకృష్ణ
[subscribe]
[youtube_video videoid=QtGr3NQVyyk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























