బ‌్లాక్‌బ‌స్ట‌ర్ సోషియో-ఫాంట‌సీ ఫిల్మ్‌ ‘య‌మ‌లీల‌’కు 25 ఏళ్ళు

25 Years For Blockbuster Yamaleela Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,25 Years of Yamaleela Movie,Yamaleela Movie Completes 25 Years,Yamaleela Movie Latest Updates,Yamaleela Movie Turns 25 Years
25 Years For Blockbuster Yamaleela Movie

తెలుగు నాట‌… య‌మ‌ సంద‌డికి తిరుగులేదు. అందుకే… య‌మ‌గోల‌(ఎన్టీఆర్‌), య‌ముడికి మొగుడు (చిరంజీవి), య‌మ‌దొంగ‌ (జూనియ‌ర్ ఎన్టీఆర్‌) వంటి పేర్ల‌తో వ‌చ్చిన‌ స్టార్ హీరోల సోషియో – ఫాంట‌సీ ఫిల్మ్స్‌ బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించాయి. అయితే… అప్ప‌టివ‌ర‌కు హాస్య న‌టుడిగా రాణిస్తున్న ఓ యువ న‌టుడు… క‌థానాయ‌కుడిగా మారి అల‌రించ‌డ‌మే కాకుండా… చిర‌స్మ‌ర‌ణీయ విజ‌యాన్ని సొంతం చేసుకున్న వైనం మాత్రం… య‌మ‌ శ‌బ్ధం ఉన్న య‌మ‌లీల‌తోనే సాధ్య‌మైంది. ఆ హాస్య న‌టుడే… అలీ. భ‌విష్య‌వాణి, అమ్మ సెంటిమెంట్‌… ఈ రెండు అంశాలు ఈ సోషియో ఫాంట‌సీకి ప్రెష్ నెస్‌ను తీసుకొచ్చి… ఘ‌న‌విజ‌యం ముంగిట నిలిపాయి. అలా… అలీ కెరీర్‌లో మ‌ర‌పురాని చిత్రంగా నిలచిపోయింది య‌మ‌లీల‌. ఓ వైపు కామెడీతో ప్రేక్షకులను నవ్విస్తూనే… మరోవైపు మదర్ సెంటిమెంట్‌తో ప్రేక్షకుల కళ్ళు చెమర్చేలా నటించాడు అలీ.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ సినిమాల‌ను తెర‌కెక్కిస్తూ… వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న‌ ఎస్.వి.కృష్ణారెడ్డి.. ఆబాల‌గోపాలాన్ని అల‌రించేలా య‌మ‌లీల‌ను తీర్చిదిద్దిన తీరు ర‌మ‌ణీయం, క‌మ‌నీయం. అలాగే… మనీషా ఫిలిమ్స్ వారి నిర్మాణ విలువ‌లు ఈ చిత్రానికి మ‌రింత వ‌న్నె తెచ్చాయి. కిషోర్ రాఠి, అచ్చిరెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో అలీకి జోడీగా ఇంద్రజ న‌టించ‌గా… య‌ముడి పాత్ర‌లో మ‌రోసారి జీవించి అల‌రించారు కైకాల స‌త్య‌నారాయ‌ణ‌. మంజుభార్గవి, తనికెళ్ళ భరణి, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, లతాశ్రీ తదితరులు ముఖ్య భూమికలు పోషించిన ఈ చిత్రంలో… జుంబారే అంటూ సూప‌ర్‌స్టార్ కృష్ణ ఓ ప్ర‌త్యేక గీతంలో ద‌ర్శ‌న‌మివ్వ‌డం ఆయ‌న అభిమానుల‌ను అల‌రించింది. 1994 ఏప్రిల్ 28న విడుద‌లైన ‘య‌మ‌లీల’… నేటితో 25 వ‌సంతాల‌ను పూర్తిచేసుకుంది.

‘య‌మ‌లీల’ – కొన్ని విశేషాలు:

  • అలీ హీరోగా ప‌రిచ‌య‌మైన తొలి చిత్ర‌మిదే. ‘య‌మ‌లీల’ రిలీజైన ఏడాదికి అంటే… 1995 ఏప్రిల్ 27న అలీ, కృష్ణారెడ్డి క‌ల‌యిక‌లో మ‌రో సోషియో-ఫాంట‌సీ ఫిల్మ్ ‘ఘ‌టోత్క‌చుడు’ విడుద‌ల కావ‌డం విశేషం.
  • ఈ చిత్రాన్ని విక్ట‌రీ వెంకటేష్, రవీనా టాండన్ జంటగా ‘తక్‌దీర్‌వాలా’ పేరుతో హిందీలోనూ… కార్తీక్, సంఘవి జోడిగా ‘లక్కీమాన్’ పేరుతో తమిళంలోనూ రీమేక్ చేసారు.
  • ‘యమలీల’కు సీక్వెల్‌గా రెండు ద‌శాబ్దాల త‌రువాత అంటే 2014లో ‘యమలీల 2’ పేరుతో మ‌రో చిత్రాన్ని తెర‌కెక్కించాడు ఎస్వీ కృష్ణారెడ్డి. ఇందులో క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు య‌ముడి పాత్ర‌లో అల‌రించారు.

[subscribe]


[youtube_video videoid=pY_DTXu4D3Y]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 3 =