సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న ‘మహర్షి’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు షురూ చేశారు. ఇందుకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సినిమా నుండి ‘ఛోటి ఛోటి ఛోటి బాతే.. మీటి మీటి మీటి యాదే’, ‘‘నువ్వే సమస్తం.. నువ్వే సిద్ధాంతం….నువ్వే నీపంతం, నువ్వేలే అనంతం’ ‘ఎవరెస్ట్ అంచున పూసిన రోజా పువ్వే’ పదరా పదరా అన్న పాటలు విడుదలవ్వగా.. వాటికి అద్భుతమైన స్పందన వస్తోంది. ఈరోజు ఈ సినిమా నుండి పాల పిట్ట అనే ఐదవ పాటను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పాల పిట్టలో వలపు.. నీ పైట మెట్టుపై వాలిందే అని సాగే ఈపాటను రాహుల్ సిప్లిగంజ్, ఎంఎం మానసి ఆలపించారు. అంతేకాదు మహేష్, పూజా వేసుకున్న కలర్ ఫుల్ దుస్తులు, స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి.
కాగా ‘మహర్షి’ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. నరేష్, మీనాక్షి దీక్షిత్, సోనాల్ చౌహాన్, జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్, ప్రకాశ్‌రాజ్, పోసాని, రావు రమేశ్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. దిల్‌రాజు, అశ్వినీ దత్, ప్రసాద్ వి పొట్లూరి ఈ సినిమాను నిర్మించారు. మే 9వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది
[subscribe]
[youtube_video videoid=P_wMsPd1zzk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: