ట్యాగ్ · 1558 కథనాలు · పేజీ 13

ఆగస్టులో మరో రెండు చిత్రాలతో బేబీ సందడి
ఫైనల్లీ ముగిసిన ఆదిత్యవర్మ
ఇప్పటికీ ఆ మైకంలోనే ఉన్నా

కమల్ హాసన్, AR రెహమాన్ కాంబినేషన్ మూవీ

రీమేక్‌లో నటిస్తున్న శ్రియ
'ప్రతిరోజు పండగే' సెకండ్ షెడ్యూల్ ప్రారంభం

గుణ 369 థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ డేట్
బాలీవుడ్ టాప్ 10లో తెలుగు దర్శకుల హవా

అన్న కథను తమ్ముడి కోసం
చైనాకు వెళుతున్న ఓ బేబి

గ్యాంగ్ లీడర్ ఫస్ట్ లుక్ రిలీజ్

అఖిల్ 4 - ఫైనల్లీ ఆన్ సెట్స్

డబ్బింగ్ కంప్లీట్ చేసుకున్న అరుణ్ విజయ్

దిల్ రాజు చేతిలోకి ఆది-కీర్తి సురేష్ సినిమా

కబీర్ సింగ్ మూవీ పై విజయ్ దేవరకొండ స్పందన
"లక్ష్మీ బాంబ్ " మూవీ విలన్
రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తమిళ భాషలో రూపొందిన హారర్ కామెడీ మూవీ ముని 2, తెలుగు డబ్బింగ్ వెర్షన్ కాంచన మూవీస్ ఘనవిజయం సాధించాయి. కాంచన మూవీ హిందీ భాషలో రీమేక్ అవుతుంది. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా రూపొందుతున్న లక్ష్మీ బాంబ్ మూవీ 2020 సంవత్సరం జూన్ 5 వ తేదీ రిలీజ్ కానుంది. కియారా అద్వానీ కథానాయిక.
మారుతి డైరెక్షన్ లో తాత మనవళ్లు గా సత్యరాజ్, సాయి తేజ్
`సుప్రీమ్` వంటి విజయవంతమైన చిత్రం తరువాత సాయితేజ్, రాశీ ఖన్నా కాంబినేషన్‌లో వస్తున్న సినిమా `ప్రతీ రోజు పండగే`. యూత్‌ఫుల్ చిత్రాల స్పెషలిస్ట్ మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని బన్నీ వాస్ నిర్మిస్తున్నాడు. ఇటీవలే పట్టాలెక్కిన ఈ సినిమా... ఇప్పటికే తొలి షెడ్యూల్‌ని పూర్తిచేసుకుంది. కాగా, రెండో షెడ్యూల్ ఈ రోజు (మంగళవారం) నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లో సీనియర్ యాక్టర్ సత్యరాజ్ కూడా జాయిన్ కానున్నాడని సమాచారం. కుటుంబ బంధాలకు పెద్ద పీట వేస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సాయితేజ్‌కి తాతయ్య పాత్రలో సత్యరాజ్…

ఆగస్టులో మరో రెండు చిత్రాలతో బేబీ సందడి
విలక్షణ పాత్రలకు చిరునామాగా నిలచిన నటి లక్ష్మి. కథానాయికగానే కాదు గుణచిత్ర నటి (క్యారెక్టర్ ఆర్టిస్ట్)గానూ తనదైన ముద్ర వేసింది ఈ టాలెంటెడ్ యాక్ట్రస్. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రాణించిన లక్ష్మి... స్వల్ప విరామం తరువాత `ఓ బేబీ`తో టాలీవుడ్‌లో రీ-ఎంట్రీ ఇచ్చింది. టైటిల్ రోల్‌లో తన మార్క్ నటనతో మరోమారు మెప్పించింది. అంతేకాదు, వచ్చే నెలలో రానున్న మరో రెండు ఆసక్తికరమైన చిత్రాల్లోనూ సందడి చేయనుంది లక్ష్మి. ఆ చిత్రాలే `మన్మథుడు 2`, `గ్యాంగ్ లీడర్`. ఆగస్టు 9న విడుదల కానున్న `మన్మథుడు 2`లో కింగ్ నాగార్జునకి అమ్మగా కనిపించనున్న…
ఫైనల్లీ ముగిసిన ఆదిత్యవర్మ
విజయ్ దేవరకొండ హీరోగా, సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా తెలుగులో ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక హిందీ లో కూడా ఈ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతూ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. తమిళ్ లో కూాడా ఈ సినిమాను రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మొదట స్టార్ డైరెక్టర్ బాలా దర్శకత్వం వహించారు. అయితే అనుకున్న అవుట్ పుట్ ఇవ్వని నేపథ్యంలో సినిమాను మళ్లీ రీషూట్ చేశారు. తెలుగు అర్జున్ రెడ్డి మూవీ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన గిరీశాయ దర్శకత్వం లో రీ షూట్ స్టార్ట్ చేశారు. ఇక అన్ని…
ఇప్పటికీ ఆ మైకంలోనే ఉన్నా
ఒక పక్క కొత్త సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంటే మరోపక్క వరల్డ్ కప్ మ్యాచ్ లు ఆడియన్స్ ను మొన్నటి వరకూ ఎంటర్ టైన్ చేశాయి. మొన్నటితో వరల్డ్ కప్ మ్యాచ్ ముగిసిపోయింది. కానీ ఆమ్యాచ్ ఇచ్చిన కిక్ ను మాత్రం ఇంతవరకూ మరిచిపోలేకపోతున్నారు చాలా మంది. ఇప్పటివరకూ జరిగిన ప్రపంచ కప్ చరిత్రలో.. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ మాత్రం ప్రత్యేకం. గతంలో ఎప్పుడు ప్రపంచ కప్ మ్యాచ్ లు జరిగినా... ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జట్టు తడబటం.. లక్ష్య చేధనలో మరో జట్టు సునాయాసంగా గెలవడమో చూశాం కానీ.. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో మాత్రం రెండు జట్లూ పోటా పోటీగా పరుగులు సాధించి.. టై తో…

కమల్ హాసన్, AR రెహమాన్ కాంబినేషన్ మూవీ
లెజండరీ యాక్టర్ కమల్ హాసన్ హీరోగా నటించిన, ఆస్కార్ అవార్డ్ గ్రహీత AR రెహమాన్ సంగీతం అందించిన తమిళ మూవీస్ ఇండియన్ (భారతీయుడు ), తెనాలి (తెనాలి ) ఘనవిజయం సాధించాయి. ఇప్పుడు కమల్ హాసన్ దర్శకత్వంలో రూపొందే యాక్షన్ థ్రిల్లర్ మూవీ కి రెహమాన్ సంగీతం అందించనున్నారు. కమల్ హాసన్ దర్శకత్వం లో రూపొందే చిత్రానికి సంగీతం సమకూర్చడం సంతోషం గా ఉందని రెహమాన్ ట్వీట్ చేశారు.

రీమేక్‌లో నటిస్తున్న శ్రియ
పెళ్ళయ్యాక సినిమాల విషయంలో కాస్త జోరు తగ్గించిన టాలెంటెడ్ బ్యూటీ శ్రియ... మళ్ళీ ఇప్పుడిప్పుడే వాటిపై దృష్టి సారిస్తోంది. ఇటీవల ఒకట్రెండు తెలుగు చిత్రాల్లో శ్రియ పేరు ప్రముఖంగా వినిపించినా... ఆ సినిమాలకి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే, తాజాగా ఓ తమిళ చిత్రానికి మాత్రం ఈ సీనియర్ హీరోయిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. `దృశ్యం` (మలయాళం) దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన మలయాళ చిత్రం `మై బాస్`(2012) ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో విమల్‌కి జోడీగా నటించనుంది శ్రియ. `సండక్కారి - ది బాస్` పేరుతో రూపొందనున్న ఈ సినిమాకి ఆర్.మాదేష్ దర్శకత్వం…

'సరిలేరు నీకెవ్వరు' ఫస్ట్ లుక్ అప్‌డేట్
సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రూపొందిస్తున్న ఈ సినిమాలో మహేష్‌కి జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది. అలనాటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓ కీలక పాత్రలో కనిపించనుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ సినిమాకి ఆర్.రత్నవేలు ఛాయాగ్రహణం అందిస్తున్నాడు. అనిల్ సుంకర, `దిల్`రాజు, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
'ప్రతిరోజు పండగే' సెకండ్ షెడ్యూల్ ప్రారంభం
మారుతి దర్శకత్వంలో సాయితేజ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఇటీవలే 'ప్రతిరోజు పండగే' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమా మొదటి షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. నేటి నుండి రెండో షెడ్యూల్ ను స్టార్ట్ చేసింది. ఈ షెడ్యూల్ లో సీనియర్ నటుడు సత్యరాజ్ కూడా పాల్గొననున్నారు.

గుణ 369 థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ డేట్
స్ప్రింట్ ఫిల్మ్స్ , జ్ఞాపిక ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై శ్రీమతి ప్రవీణ కడియాల సమర్పణ లో అనిల్ కడియాల, తిరుమల రెడ్డి నిర్మాణ సారథ్యం లో అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ RX 100 ఫేమ్ యూత్ ఫుల్ హీరో కార్తికేయ, అనఘ జంటగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ గుణ 369 మూవీ ఆగస్ట్ 2వ తేదీ రిలీజ్ కానుంది. సాయి కుమార్, ఆదిత్య మీనన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.
బాలీవుడ్ టాప్ 10లో తెలుగు దర్శకుల హవా
హిందీనాట పలువురు తెలుగు దర్శకులు తమదైన ముద్ర వేశారు. అయితే, అక్కడి టాప్ 10 హయ్యస్ట్ గ్రాసర్స్‌లో మన టాలీవుడ్‌కి చెందిన దర్శకులు చోటు దక్కించుకోవడం అరుదనే చెప్పాలి. ఇప్పుడలాంటి రేర్ రికార్డును ఇద్దరు దర్శకులు సొంతం చేసుకున్నారు. వాళ్ళే... రాజమౌళి, సందీప్ రెడ్డి వంగా. ప్రస్తుతం బాలీవుడ్ టాప్ 10 హయ్యస్ట్ గ్రాసర్స్‌లో తొలి, పది స్థానాల్లో ఈ దర్శకులు రూపొందించిన చిత్రాలు ఉండడం వార్తల్లో నిలుస్తోంది. రాజమౌళి రూపొందించిన ఎపిక్ ఎంటర్‌టైనర్ `బాహుబలి - ది కంక్లూజన్` హిందీ అనువాదం అత్యధిక వసూళ్ళతో మొదటి స్థానంలో నిలిస్తే... పదో స్థానంలో సందీప్ రెడ్డి వంగా…

అన్న కథను తమ్ముడి కోసం
దొరసాని సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేశాడు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా కూడా హీరో హీరోయిన్ల నటనకు మాత్రం మంచి ప్రశంసలు దక్కాయి. ఇక ఈ సినిమా రిలీజైందో లేదో అప్పుడే మరో సినిమాను ట్రాక్ లో పెట్టే పనిలో పడినట్టు తెలుస్తోంది. అయితే ఈ సారి మాత్రం అన్న విజయ్ దేవరకొండ..తమ్ముడి రెండో సినిమాను లైన్లో పెట్టనున్నట్టు తెలుస్తోంది.
చైనాకు వెళుతున్న ఓ బేబి
నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ఓ బేబి. ఈ నెల 5వ తేదీన విడుదలైన ఈ సినిమా ప్రతి సినీ ప్రేక్షకుడికి నచ్చి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో సమంత చేసిన నటనపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అటు కామెడీ తో ఎమోషనల్ గా కూడా ఈసినిమా కదిలించడంతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతుంది. రెండో వారంలోనూ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబడుతున్న ఈ చిత్రం సమంత కెరీర్లో ‘ఓ బేబీ’ ఒక మైలురాయిలాగే నిలిచిపోయేలా ఉంది.

ప్రారంభానికి ముందే రచ్చ రంబోలా అవుతున్న బిగ్ బాస్ - 3
బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ - 3 జులై 21 నుండి ప్రారంభం కానుంది. దాంతోపాటు హడావుడి, హంగామా, పబ్లిసిటీ,బజ్,క్రేజ్, క్యూరియాసిటీ, నెగిటివ్ టాక్, ట్రోలింగ్స్, తిట్లు, శాపనార్థాలు, టీవీ చర్చా కార్యక్రమాలు, వాటి కింద పచ్చి బూతుల కామెంట్లు- పోలీస్ కేసులు వంటి సకల దరిద్రాలు ప్రారంభమయ్యాయి.

గ్యాంగ్ లీడర్ ఫస్ట్ లుక్ రిలీజ్
విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా గ్యాంగ్ లీడర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. రిలీజ్ డేట్ కూడా ఎప్పుడో ఫిక్స్ చేసేశారు. ఆగష్ట్ 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇక ఇటీవలే ఈ సినిమా నుండి ప్రీ లుక్ ను రిలీజ్ చేయగా.. ఇప్పుడు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

అఖిల్ 4 - ఫైనల్లీ ఆన్ సెట్స్
అఖిల్ అక్కినేని కథానాయకుడిగా `బొమ్మరిల్లు` భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. గత కొద్ది కాలంగా ఈ సినిమాపై పలు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కొత్త దర్శకులతో పని చేయాలా..? లేక అనుభవం ఉన్న దర్శకులను ఎన్నుకోవాలా..? అనే విషయంలో చర్చలు జరిగిన అనంతరం ఫైనల్ గా బొమ్మరిల్లు భాస్కర్ తో సినిమా చేయడానికి అంగీకరించాడు. ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది ఈ సినిమా. ఈరోజు నుండి రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ జరుపుకుంటుంది. మరో పది రోజుల వరకూ ఇక్కడే షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాపై ప్రస్తుతం అఖిల్ ఉన్న సన్నివేశాలను…
సాహో సాంగ్ పై పాకిస్తానీ సింగర్ ట్వీట్ కు థండరింగ్ రెస్పాన్స్
"బాహుబలి" సిరీస్ తో ప్రపంచవ్యాప్తమైన క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ తదుపరి చిత్రం "సాహో " రిలీజ్ కోసం వరల్డ్ ఫిలిం ట్రేడ్ మొత్తం ఎదురు చూస్తుందనటంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న విషయానికి ప్రపంచ వ్యాప్త అభిమానులు నుండి విశేషమైన స్పందన లభించడం దీనికి వచ్చిన క్రేజ్ కు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

డబ్బింగ్ కంప్లీట్ చేసుకున్న అరుణ్ విజయ్
సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ కమ్ భారీ యాక్షన్ మూవీ సాహో. రీసెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేసింది. దీనిలో ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా.. ఇటీవలే ఈ సినిమా నుండి ఇటీవలే 'ద సైకో సయ్యాన్' అనే వీడియో పాటను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

దిల్ రాజు చేతిలోకి ఆది-కీర్తి సురేష్ సినిమా
కీర్తి సురేష్, ఆది పినిశెట్టి, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో బాలీవుడ్ డైరెక్టర్ నగేష్ కుకునూర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో నగేష్ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయంకానున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాకు సంబంధించి ఈరోజు ఓ ఎగ్జైటింగ్ అప్ డేట్ ఇవ్వనున్నట్టు నాలుగు రోజుల క్రితం చిత్రయూనిట్ తెలిపిన సంగతి తెలిసిందే కదా. తాజాగా అదేంటో రివీల్ చేశారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు సమర్పిస్తున్నట్టు తెలిపారు. దానితో పాటు సినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ ను కూడా త్వరలోనే రిలీజ్ చేయబోతున్నట్టు తెలిపారు.

కబీర్ సింగ్ మూవీ పై విజయ్ దేవరకొండ స్పందన
సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన అర్జున్ రెడ్డి మూవీ ఘనవిజయం సాధించి, బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచి, హీరో విజయ్ దేవరకొండ కు స్టార్ డమ్ ఇచ్చింది. అర్జున్ రెడ్డి మూవీ ని షాహిద్ కపూర్ హీరో గా సందీప్ రెడ్డి వంగ హిందీ భాషలో కబీర్ సింగ్ పేరుతో రూపొందించగా కమర్షియల్ గా ఘనవిజయం సాధించింది. 250 కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేసి దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. హీరో షాహిద్ కపూర్ సినీకెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ గా నిలిచింది.