బాలీవుడ్ టాప్ 10లో తెలుగు ద‌ర్శ‌కుల హ‌వా

2019 Latest Telugu Movie News, Tollywood Directors in the race of Top 10 Bollywood Directors, Two Telugu Directors in top 10 Bollywood, Telugu Directors In Bollywood, Sandeep Reddy Vanga Latest Movie News, Director Rajamouli Latest Movie Updates, Telugu Directors Influence On bollywood,Telugu Flim Updates, Telugu flimnagar, Tollywood Cinema Latest News

హిందీనాట ప‌లువురు తెలుగు ద‌ర్శ‌కులు త‌మ‌దైన ముద్ర వేశారు. అయితే, అక్క‌డి టాప్ 10 హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్స్‌లో మ‌న టాలీవుడ్‌కి చెందిన ద‌ర్శ‌కులు చోటు ద‌క్కించుకోవ‌డం అరుద‌నే చెప్పాలి. ఇప్పుడలాంటి రేర్ రికార్డును ఇద్ద‌రు ద‌ర్శ‌కులు సొంతం చేసుకున్నారు. వాళ్ళే… రాజ‌మౌళి, సందీప్ రెడ్డి వంగా. ప్ర‌స్తుతం బాలీవుడ్ టాప్ 10 హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్స్‌లో తొలి, ప‌ది స్థానాల్లో ఈ ద‌ర్శ‌కులు రూపొందించిన చిత్రాలు ఉండ‌డం వార్త‌ల్లో నిలుస్తోంది. రాజ‌మౌళి రూపొందించిన ఎపిక్ ఎంట‌ర్‌టైన‌ర్ `బాహుబ‌లి – ది కంక్లూజ‌న్‌` హిందీ అనువాదం అత్య‌ధిక వ‌సూళ్ళ‌తో మొద‌టి స్థానంలో నిలిస్తే… ప‌దో స్థానంలో సందీప్ రెడ్డి వంగా తెర‌కెక్కించిన `క‌బీర్ సింగ్‌` (`అర్జున్ రెడ్డి` రీమేక్) నిల‌చింది. ఆ మ‌ధ్య‌లో అంటే… టాప్ 2 టు టాప్ 9 స్థానాల్లో `దంగ‌ల్‌, సంజు, పీకే, టైగ‌ర్ జిందా హై, బ‌జ‌రంగి భాయ్ జాన్‌, ప‌ద్మావ‌త్‌, సుల్తాన్‌, ధూమ్ 3` ఉన్నాయి. మొత్తానికి డ‌బ్బింగ్ సినిమాతో రాజ‌మౌళి, రీమేక్ సినిమాతో సందీప్‌… బాలీవుడ్‌లో సత్తా చాట‌డం విశేషం. మున్ముందు… ఇదే శైలిని కొన‌సాగించే తెలుగు ద‌ర్శ‌కులు ఎవ‌ర‌వుతారో చూద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[subscribe]

[youtube_video videoid=lHRWojyTBJM]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − six =