`సుప్రీమ్` వంటి విజయవంతమైన చిత్రం తరువాత సాయితేజ్, రాశీ ఖన్నా కాంబినేషన్‌లో వస్తున్న సినిమా `ప్రతీ రోజు పండగే`. యూత్‌ఫుల్ చిత్రాల స్పెషలిస్ట్ మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని బన్నీ వాస్ నిర్మిస్తున్నాడు. ఇటీవలే పట్టాలెక్కిన ఈ సినిమా… ఇప్పటికే తొలి షెడ్యూల్‌ని పూర్తిచేసుకుంది. కాగా, రెండో షెడ్యూల్ ఈ రోజు (మంగళవారం) నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లో సీనియర్ యాక్టర్ సత్యరాజ్ కూడా జాయిన్ కానున్నాడని సమాచారం. కుటుంబ బంధాలకు పెద్ద పీట వేస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సాయితేజ్‌కి తాతయ్య పాత్రలో సత్యరాజ్ కనిపిస్తాడని తెలుస్తోంది. అలాగే మారుతి మార్క్ వినోదానికి కూడా ఇందులో చోటు ఉంటుందని టాక్. తమన్ సంగీతమందిస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[subscribe]
[youtube_video videoid=yWrx_l6b2r8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: