
ట్యాగ్ · 1558 కథనాలు · పేజీ 12


మహేష్ - వంశీపైడిపల్లి తనయల ఛాలెంజ్

'ఎవరు' టీజర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్
మహేష్ బాబు మనసులో మాట
మిస్టర్ కేకే లో హైలెట్ అదేనట..!
జులై , ఆగస్ట్ నెలలలో మూవీ మేళా

సోషియో ఫాంటసీ మూవీ లో కళ్యాణ్ రామ్ ?
గ్యాంగ్ లీడర్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్
నితిన్ సినిమా తరహాలోనే రాజ్ తరుణ్ చిత్రం?

`సరిలేరు నీకెవ్వరు`లో ప్రకాష్ రాజ్?
ఆగస్ట్ నెలలో రిలీజయ్యే టాలీవుడ్ మూవీస్
అల్లు అర్జున్ సినిమాలో సుశాంత్ పాత్ర అదేనా?
ఆగస్టు 15న కాజల్ డబుల్ ధమాకా
గుణ 369 ట్రైలర్ రిలీజ్

రిలీజ్ డేట్స్ మారిపోయాయి

సాహో అయిపోయింది - సెల్ఫీతో ప్రభాస్

ఇస్మార్ట్ శంకర్ కు ఇస్మార్ట్ బిజినెస్ జరిగిందట
సందీప్ కు తాప్సీ ఇన్ డైరెక్ట్ కౌంటర్

శర్వానంద్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌కి సేమ్ ఫార్ములా
యువ కథానాయకుడు శర్వానంద్ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆ చిత్రాలే `రణరంగం`, `96` రీమేక్, `శ్రీకారం`. ఆసక్తికరమైన విషయమేమిటంటే... వీటిలో రెండు సినిమాలు ఒకే టైమ్ పిరియడ్ చుట్టూ తిరిగే కథలు కావడం విశేషం. `రణరంగం` 90ల నాటి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ పిరియాడిక్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కితే... ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న `96` రీమేక్‌కి కూడా 90ల టచ్ ఉంటుంది. అంటే... ఈ ఏడాదిలో శర్వానంద్ నుంచి వస్తున్న బ్యాక్ టు బ్యాక్ మూవీస్... 90ల నేపథ్యంతో వస్తున్నాయన్నమాట. మరి... ఈ పిరియాడిక్ టచ్ శర్వానంద్‌కి ఏ మేరకు కలిసొస్తుందో చూడాలి. శర్వానంద్‌కి…

మహేష్ - వంశీపైడిపల్లి తనయల ఛాలెంజ్
మహేష్-వంశీ పైడిపల్లి కూతుర్లు ఏంటీ.. ఛాలెంజ్ ఏంటీ అనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే.. మహేష్ కూతురు సితార, వంశీ పైడిపల్లి కూతురు ఆధ్య ఇద్దరూ కలిసి ఆధ్య అండ్ సితార అనే కొత్త యూట్యూబ్ ఛానెల్ ను ప్రారంభించారు. దీనిలో భాగంగా.. త్రీ మార్కర్ ఛాలెంజ్ అనే గేమ్ ను ఆడారు. ఈ గేమ్ లో ఎవరు గెలిచారో చూడాలంటే మాత్రం కింద ఇచ్చిన లింక్ ను క్లిక్ చేయాల్సిందే.

'ఎవరు' టీజర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్
క్షణం, అమీ తుమీ, గూఢచారి సినిమాల హిట్లతో మంచి ఫామ్ లో ఉన్న టాలెంటెడ్ హీరో అడివి శేష్. సినిమా సినిమాకు వైవిధ్యం ఉండేలా చూసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం వెంకట్ రామ్ జీ దర్శకత్వంలో తాను ప్రధాన పాత్రలో 'ఎవరు' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ను మాత్రం చాలా సీక్రెట్ గా పూర్తి చేశాడు. మొదట ఈ సినిమాను ఆగష్ట్ 23వ తేదీన రిలీజ్ చేయాలనుకున్నారు. ఆ తరువాత ఆగష్ట్ 15వ తేదీకి మార్చారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా.. తాజాగా టీజర్ రిలీజ్ కు డేట్ ను ఫిక్స్ చేశారు. జులై 19వ తేదీన ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.
మన్మథుడు 2 - సాలిడ్ గా నాన్ థియేట్రికల్ రైట్స్ బిజినెస్
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో మన్మథుడు సీక్వెల్ మన్మథుడు 2 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుది దశలో ఉంది. ఇక ఇప్పటికే సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించిన సంగతి కూడా విదితమే. ఆగష్ట్ 9వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ నేపథ్యంలో డబ్బింగ్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేశారు. అన్ని కార్యక్రమాలు త్వరలోనే పూర్తి చేసి ఎట్టి పరిస్థితిల్లోనూ ఆగష్ట్ 9నే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు.
మహేష్ బాబు మనసులో మాట
చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ కు ఎంటరయి , రాజకుమారుడు మూవీ తో హీరో గా మారిన మహేష్ బాబు మురారి, ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను, అభిమానులను అలరించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సిల్వర్ జూబ్లీ మూవీ మహర్షి ఘనవిజయం సాధించి మహేష్ బాబు సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచింది.
మిస్టర్ కేకే లో హైలెట్ అదేనట..!
రాజేష్ ఎమ్ సెల్వ దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా కందరం కొండన్. తెలుగులో ‘మిస్టర్ kk’ అనే టైటిల్ తో సినిమాను రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. దీంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు చిత్రయూనిట్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పాల్గొన్న విక్రమ్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
జులై , ఆగస్ట్ నెలలలో మూవీ మేళా
రేపటి నుండి ఆగస్ట్ నెలాఖరు వరకు మాస్ , యాక్షన్, థ్రిల్లర్, లవ్, కామెడీ వంటి డిఫరెంట్ జానర్స్ లో మూవీస్ సందడి చేయనున్నాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా ఇస్మార్ట్ శంకర్ జులై 18 వ తేదీ, భరత్ కమ్మ దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక నటించిన డియర్ కామ్రేడ్ జులై 26వ తేదీ రిలీజ్ కానున్నాయి. అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ RX 100 మూవీ ఫేమ్ కార్తికేయ, అనఘ జంటగా నటించిన గుణ 369 మూవీ ఆగస్ట్ 2 వ తేదీ రిలీజ్ కానుంది.

సోషియో ఫాంటసీ మూవీ లో కళ్యాణ్ రామ్ ?
118 మూవీ సక్సెస్ తో నందమూరి కళ్యాణ్ రామ్ పలు మూవీస్ కు కమిట్ అవుతున్నారు. కళ్యాణ్ రామ్ ప్రస్తుతం ఎంత మంచివాడవురా మూవీ లో నటిస్తున్నారు. శతమానం భవతి, శ్రీనివాస కళ్యాణం వంటి కుటుంబ కథా చిత్రాల దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ , మెహరీన్ జంటగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఎంత మంచివాడవురా మూవీ రూపొందుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన యమదొంగ, మెగా స్టార్ చిరంజీవి నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరి సోషియో ఫాంటసీ మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఒక నూతన దర్శకుడు నరేట్ చేసిన స్క్రిప్ట్ కు ఇంప్రెసయి తాను కూడా ఆ జానర్ మూవీ లో నటించాలని కళ్యాణ్ రామ్ డిసైడ్ అయ్యారు. కళ్యాణ్ రామ్ సొంత…
గ్యాంగ్ లీడర్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్
విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో నాని ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా గ్యాంగ్ లీడర్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుది దశలో ఉంది. వచ్చే నెల 30 (ఆగష్ట్ 30) వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు కూడా ఇప్పటికే ప్రకటించేశారు. అంతేకాదు.. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా.. ఫస్ట్ సింగిల్ ను రేపు, టీజర్ ను 24వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

ఆల్‌టైమ్ మ్యూజికల్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఆత్మీయులు’కు 50 ఏళ్ళు
లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావుకు హిట్ జోడీగా రాణించిన కథానాయికల్లో కళాభినేత్రి వాణిశ్రీ ఒకరు. అలాంటి ఈ ఇద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘ఆత్మీయులు’. ప్రముఖ దర్శకుడు `విక్టరీ`మధుసూధనరావు రూపొందించిన ఈ సినిమాలో చంద్రమోహన్, విజయనిర్మల, చంద్రకళ, గుమ్మడి వెంకటేశ్వరరావు, నాగభూషణం, ధూళిపాళ, సూర్యకాంతం, పద్మనాభం, ప్రభాకర్ రెడ్డి తదితరులు ఇతర ముఖ్య భూమికలను పోషించారు. ఏయన్నార్‌తో పలు మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్‌ను నిర్మించిన `అన్నపూర్ణ పిక్చర్స్` అధినేత దుక్కిపాటి మధుసూధనరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి దాశరథి, శ్రీశ్రీ, కొసరాజు, ఆరుద్ర, సి.నారాయణరెడ్డి గీత రచన చేయగా…
నితిన్ సినిమా తరహాలోనే రాజ్ తరుణ్ చిత్రం?
నితిన్, నిత్యా మీనన్ స్టారర్ `గుండెజారి గల్లంతయ్యిందే`(2013)తో దర్శకుడిగా తొలి అడుగులు వేశాడు కొండా విజయ్ కుమార్. మొదటి ప్రయత్నంలోనే ఘనవిజయం అందుకున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్... ఆ తరువాత `ఒక లైలా కోసం` (2014)తో పలకరించాడు. నాగచైతన్య, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. ఈ నేపథ్యంలో... ఐదేళ్ళ సుదీర్ఘ విరామం తరువాత మరో సినిమాని తెరకెక్కించేందుకు సన్నద్ధమయ్యాడు. రాజ్ తరుణ్ హీరోగా కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఆగస్టు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌కి వెళ్ళనుందని సమాచారం. కాగా…

`సరిలేరు నీకెవ్వరు`లో ప్రకాష్ రాజ్?
`రాజకుమారుడు` టు `మహర్షి`... ఇదీ కథానాయకుడిగా సూపర్ స్టార్ మహేష్ బాబు పాతిక సినిమాల ప్రయాణం. ఈ జర్నీలో మహేష్‌కు సహ నటుడిగా కొనసాగిన ఆర్టిస్ట్ ఎవరంటే... ఠక్కున వినిపించే సమాధానం... విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. మేనమామ, తండ్రి, ప్రతినాయకుడు, ఉన్నతాధికారి... ఇలా ప్రిన్స్ పక్కన పలు విభిన్న పాత్రల్లో సందడి చేశాడు ప్రకాష్. ఈ నేపథ్యంలోనే... మహేష్ తదుపరి చిత్రం `సరిలేరు నీకెవ్వరు`లోనూ ఓ కీలక భూమిక పోషించే అవకాశం దక్కిందట ప్రకాష్‌కి. వినిపిస్తున్న కథనాల ప్రకారం... అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మహేష్ 26 `సరిలేరు నీకెవ్వరు` నుంచి సీనియర్…
ఆగస్ట్ నెలలో రిలీజయ్యే టాలీవుడ్ మూవీస్
ఆగస్ట్ నెల లో టాలీవుడ్ లో పండగ వాతావరణం నెలకొంది. సినీ అభిమానులను అలరించడానికి ఆగస్ట్ నెలలో పలు మూవీస్ రిలీజ్ కు సిద్ధం గా ఉన్నాయి. వినోద్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా నటించిన సోషల్ థ్రిల్లర్ బాలీవుడ్ బ్లాక్ బస్టర్ పింక్ మూవీ తమిళ రీమేక్ నేర్ కొండ పార్వై ఆగస్ట్ 8వ తేదీ రిలీజ్ కానుంది. సూపర్ హిట్ మన్మథుడు మూవీ సీక్వెల్ కింగ్ నాగార్జున హీరో గా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ కామెడీ మన్మథుడు2 9వ తేదీ రిలీజ్ కానుంది. సుధీర్ వర్మ దర్శకత్వం లో యంగ్ హీరో శర్వానంద్ గ్యాంగ్ స్టర్ గా నటించిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ రణరంగం 15 వ తేదీ రిలీజ్ కానుంది.
అల్లు అర్జున్ సినిమాలో సుశాంత్ పాత్ర అదేనా?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా ఏస్ ఫిల్మ్ మేకర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. టబు, రాజేంద్రప్రసాద్, నవదీప్, సునీల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో సుశాంత్, నివేదా పేతురాజ్ కీలక భూమికలు పోషిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... 2020 సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే... ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేమిటంటే... ఈ చిత్రం `కుండ మార్పిడి పెళ్ళి` కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోందట. వినిపిస్తున్న…
ఆగస్టు 15న కాజల్ డబుల్ ధమాకా
పుష్కరకాలంగా కథానాయికగా రాణిస్తోంది కాజల్ అగర్వాల్. జయాపజయాలతో సంబంధం లేకుండా ముందుకు సాగుతున్న ఈ అగ్రశ్రేణి కథానాయిక... ఈ పంద్రాగస్టు (ఆగస్టు 15)న రెండు సినిమాలతో సందడి చేయనుంది. ఆ చిత్రాలే `రణరంగం`(తెలుగు), `కోమలి`(తమిళ్). శర్వానంద్ కథానాయకుడిగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన పిరియాడికల్ గ్యాంగ్‌స్టర్ డ్రామా `రణరంగం` ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుండగా... `జయం` రవి హీరోగా ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన సిట్యుయేషనల్ కామెడీ డ్రామా `కోమలి` కూడా అదే రోజున థియేటర్లలోకి రానుంది. ఈ రెండు సినిమాల్లోనూ ఒకదానితో ఒకటి సంబంధం లేని…
గుణ 369 ట్రైలర్ రిలీజ్
ఇటీవలే హిప్పీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తికేయ ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో కార్తికేయ హీరోగా వాస్తవ సంఘటనల ఆధారం గా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'గుణ 369'. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. పాటలను కూడా ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

రిలీజ్ డేట్స్ మారిపోయాయి
ఇక నెలలో ఇస్మార్ట్ శంకర్, డియర్ కామ్రేడ్ తప్పించి పెద్దగా అంచనాలు ఉన్న సినిమాలు ఏం లేవని చెప్పొచ్చు. అయితే ఆగష్ట్ లో మాత్రం మంచి మంచి సినిమాలో బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్దంగా ఉన్నాయి. ఇక ఆగష్ట్ అంటే ఎన్ని సినిమాలు ఉన్న మన మైండ్ లో ఫిక్స్ అయిన ఒకే సినిమా సాహో. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఆగష్ట్ 15న రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాతో పాటు మన్మథుడు2, రణరంగం, ఎవరు, గ్యాంగ్ లీడర్ సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి.

సాహో అయిపోయింది - సెల్ఫీతో ప్రభాస్
2017 లో కొట్టిన కొబ్బరికాయకు.. దాదాపు రెండు సంవత్సరాల తరువాత గుమ్మడి కాయ కొట్టారు సాహో సినిమాకు. భారీ యాక్షన్ సినిమా కావడంతో రెండు సంవత్సరాలు తీసుకొని సుజీత్ ద బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చాడు. టీజర్ చూస్తేనే మనకు ఆ విషయం అర్థమైపోతుంది ఇంత టైమ్ ఎందుకు తీసుకున్నారో. ఈరోజుతో సినిమాకు సంబంధించిన చిత్రీకరణ అంతా పూర్తయింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ చిత్రబృందంతో కలిసి సెల్ఫీ దిగి... ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

ఇస్మార్ట్ శంకర్ కు ఇస్మార్ట్ బిజినెస్ జరిగిందట
సినిమా ఇండస్ట్రీలో సినిమాల రిలీజ్ టైమ్ లో చాలా తరచుగా వినిపించే మాట "టేబుల్ ప్రాఫిట్". అంటే రిలీజ్ సమయానికి నిర్మాత పెట్టిన పెట్టుబడి మీద అదనంగా కనిపించే లాభాన్ని "టేబుల్ ప్రాఫిట్" అంటారు. సరదాగా తెలుగులోకి తర్జుమా చేస్తే దీనిని “బల్ల లాభం” అనాలేమో.
సందీప్ కు తాప్సీ ఇన్ డైరెక్ట్ కౌంటర్
అర్జున్ రెడ్డి సినిమాను హిందీ కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా మంచి సూపర్ హిట్ కొట్టాడు సందీప్ రెడ్డి వంగా. కలెక్షన్ల పరంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు కలెక్షన్లు రాబడుతూ దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే బాలీవుడ్ ఎంట్రీ బాగానే ఉంది.. సందీప్ కు ఆఫర్లు కూడా బాగానే వస్తున్నాయి అనుకుంటుండగా.. ఈమధ్య కబీర్ సింగ్ సినిమాలోని ఓ సన్నివేశంపై పెద్ద వివాదమే రేగడంతో సందీప్ స్లో అయ్యాడు.