సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన అర్జున్ రెడ్డి మూవీ ఘనవిజయం సాధించి, బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచి, హీరో విజయ్ దేవరకొండ కు స్టార్ డమ్ ఇచ్చింది. అర్జున్ రెడ్డి మూవీ ని షాహిద్ కపూర్ హీరో గా సందీప్ రెడ్డి వంగ హిందీ భాషలో కబీర్ సింగ్ పేరుతో రూపొందించగా కమర్షియల్ గా ఘనవిజయం సాధించింది. 250 కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేసి దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. హీరో షాహిద్ కపూర్ సినీకెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ గా నిలిచింది.
భరత్ కమ్మ దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన డియర్ కామ్రేడ్ మూవీ జులై 26 వ తేదీ రిలీజ్ కానుంది. డియర్ కామ్రేడ్ మూవీ ప్రమోషన్స్ భారీ ఎత్తున జరుగుతున్నాయి. ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ మీడియా తో సమావేశమయ్యారు. కబీర్ సింగ్ మూవీ ని వీక్షించారా అడిగిన ప్రశ్నకి విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ అని, తాను నటించిన క్యారెక్టర్ లో షాహిద్ కపూర్ నటించారని, ఆ మూవీ స్టోరీ తనకు తెలుసునని, ఇందులో కొత్త ఏముందని, నేనెందుకు కబీర్ సింగ్ మూవీ చూడాలని అన్నారు. దర్శకుడు సందీప్ తన మనిషని, కబీర్ సింగ్ బిగ్ హిట్ కావాలని కోరుకున్నానని, బ్లాక్ బస్టర్ గా నిలవడం తనకు సంతోషంగా ఉందన్నారు.
[subscribe]
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.