డబ్బింగ్ కంప్లీట్ చేసుకున్న అరుణ్ విజయ్

2019 Latest Telugu Movie News, Arun Vijay Completed Dubbing For Saaho, Talented actor wraps up dubbing for Saaho, Arun Vijay s final work for Saaho is over, Arun Vijay Finished dubbing for saaho, Saaho Movie Latest News, Prabhas Saaho Movie Updates, telugu film updates, Telugu Filmnagar, Tollywood cinema News

సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ కమ్ భారీ యాక్షన్ మూవీ సాహో. రీసెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేసింది. దీనిలో ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా.. ఇటీవలే ఈ సినిమా నుండి ఇటీవలే ‘ద సైకో సయ్యాన్’ అనే వీడియో పాటను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలుపెట్టగా.. నటీనటులు డబ్బింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీనిలో భాగంగానే తాజా సమాచారం ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న అరుణ్ విజయ్ తన డబ్బింగ్ పూర్తి చేశాడు. ఈవిషయాన్ని తానే స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు.

ఇంకా ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. నీల్ నితిన్, జాకీ ష్రాఫ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, అరుణ్ విజయ్, మందిరా బేడీ ఇలా పులువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగష్ట్ 15వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. మరి సినిమా రిలీజ్ తరువాత కలెక్షన్ల పరంగా ఎన్నిరికార్డులు క్రియేట్ చేస్తుందో చూద్దాం..

[subscribe]

[youtube_video videoid=I7HwFFJGWhw]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 5 =