ట్యాగ్ · 450 కథనాలు · పేజీ 23

ఓ బేబీ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

AA19 షూటింగ్ సెకండ్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం

స్పెషల్ మూవీ ప్రీమియర్ షో కు అద్భుత స్పందన

కార్తి ఖైదీ టీజర్ రిలీజ్

బాలయ్యకి జోడీగా ఇద్దరు క్రేజీ హీరోయిన్లు?

మహేష్ సినిమాలో రీ ఎంట్రీ పై రాములమ్మ

గొరిల్లా ట్రైలర్ రిలీజ్
అలా జరిగితే మహేష్ బాబు,అనిల్ రావిపూడి, దిల్ రాజు,అనిల్ సుంకర లను నేను సన్మానిస్తా - అదిశేషగిరావు
"లక్ష్యమే కాదు దానిని సాధించిన మార్గం కూడా ఉన్నతంగా ఉండాలి" అంటారు మహాత్మా గాంధీ. అలాగేే ఒక విజయవంతమైన సినిమా ఇవ్వాలి అనే లక్ష్యం మంచిదే అయినప్పటికీ దానిని నిర్మించే సమయము, అందుకు చేసే ఖర్చు కూడా హద్దులు దాట కూడదు. ఈతరం దర్శకులలో కొంతమంది మంచి హిట్ చిత్రాలను ఇవ్వగలుగుతున్నారు గానీ అనుకున్న బడ్జెట్లో , సకాలంలో ఇవ్వలేకపోతున్నారు. ఇందువల్ల కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ హద్దులు దాటి పోవటమే కాకుండా రకరకాల అనర్థాలకు కారణం అవుతున్నారు సదరు దర్శకులు.

ఓ బేబీ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
సక్సెస్ ఫుల్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నందినీ రెడ్డి దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్ పై రూపొందిన ఓ బేబీ మూవీ జూలై 5వ తేదీ రిలీజ్ కానుంది. నాగశౌర్య, సీనియర్ నటి లక్ష్మి, రాజేంద్రప్రసాద్, రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటించారు. మిక్కీ J మేయర్ సంగీతం అందించారు.

AA19 షూటింగ్ సెకండ్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్, హారిక &హాసిని బ్యానర్స్ పై AA19 మూవీ రూపొందుతున్న విషయంతెలిసిందే.AA19 మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. మరి కొన్ని రోజులలో ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమయి నిరవధికంగా జరుగుతుందని సమాచారం. పూజ హెగ్డే కథానాయిక కాగా, బాలీవుడ్ నటి టబు ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

స్పెషల్ మూవీ ప్రీమియర్ షో కు అద్భుత స్పందన
క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ , హీరో గా పలు చిత్రాలలో నటించిన అజయ్ ప్రధాన పాత్రలో, వాస్తవ్ దర్శకత్వంలో శ్రీలక్ష్మీ పిక్చర్స్ బ్యానర్ పై నందా లాల్ క్రియేషన్స్ నిర్మాణ సారథ్యం లో ది స్టోరీ ఆఫ్ ఏ మైండ్ రీడర్ ట్యాగ్ లైన్ తో రూపొందిన స్పెషల్ మూవీ జూన్ 14వ తేదీ రిలీజ్ కానుంది. రంగా , అక్షత జంటగా నటించిన స్పెషల్ మూవీ రిలీజ్ సందర్భంగా చిత్ర యూనిట్ పలువురికి ప్రీమియర్ షో ను ఏర్పాటు చేసింది.

కార్తి ఖైదీ టీజర్ రిలీజ్
వైవిధ్యమైన కథలను ఎంచుకోవడంలో హీరో కార్తీ ఎప్పుడూ ముందుంటాడు. అందుకే తను చేసిన సినిమాల్లో ఒకదానికొకటి సంబంధం లేకుండా.. డిఫరెంట్ గా ఉంటాయి. ఇక ఈ ఏడాది దేవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తి ఇప్పుడు ఖైదీ అంటూ మరో విభిన్నమైన కథతో ముందుకొస్తున్నాడు. ఇటీవల పోస్టర్‌తో సినిమాపై భారీ అంచనాలు పెంచిన యూనిట్ తాజాగా టీజర్ ను విడుదల చేసింది.

ఆ సినిమాల స్టోరీలైన్‌తో మహేష్ `సరిలేరు నీకెవ్వరు`?
తాజాగా విడుదలైన మహర్షితో హయ్యస్ట్ గ్రాసర్‌ని అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు… ప్రస్తుతం తన తదుపరి చిత్రం సరిలేరు నీకెవ్వరుపై దృష్టి సారించాడు. ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌ను సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడు. మహేష్ సరసన రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి, రాజేంద్రప్రసాద్, జగపతిబాబు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కృష్ణ పుట్టినరోజు సందర్భంగా నిన్న (మే 31) టైటిల్ ఖరారు చేయడంతో పాటు… చిత్రాన్ని కూడా లాంఛనంగా ప్రారంభించారు.

బాలయ్యకి జోడీగా ఇద్దరు క్రేజీ హీరోయిన్లు?
నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ‘రూలర్’ (ప్రచారంలో ఉన్న పేరు) అనే సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహించనున్న ఈ పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో జగపతిబాబు ప్రతినాయకుడిగా నటించనున్నాడు. ఇదిలా ఉంటే… గత కొద్ది రోజులుగా ఈ సినిమా ఆగిపోయిందనే వార్తలు వినిపిస్తుండగా… తాజాగా ది తెలుగుఫిల్మ్‌నగర్. కామ్‌తో అవన్నీ నిరాధార కథనాలేనని చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు… త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుందని ఆయన వివరణ ఇచ్చాడు. దీంతో… రూమర్లకు చెక్ పడింది.

`సరిలేరు నీకెవ్వరు`తోనూ... `దిల్` రాజు సెంటిమెంట్ రిపీట్ అవుద్దా?
దిల్ రాజు… విజయవంతమైన చిత్రాలను చిరునామాగా నిలచిన ఈతరం నిర్మాత. తొలి చిత్రం ‘దిల్’ నుంచి తాజా చిత్రం ‘మహర్షి’ వరకు ఆయనది ఇదే బాణీ. ప్రస్తుతం… దాదాపు అరడజను సినిమాలతో ఈ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ ఫుల్ బిజీగా ఉన్నాడు. వీటిలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ ఒకటి. అనిల్ సుంకర, మహేష్ బాబుతో కలసి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాడు రాజు. శుక్రవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైన ఈ సినిమా… త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌కి వెళ్ళనుంది. అంతేకాదు… 2020 సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించేశారు కూడా.

మహేష్ సినిమాలో రీ ఎంట్రీ పై రాములమ్మ
లేడి సూపర్ స్టార్ గా టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన నటి విజయశాంతి. 1980 లో కిలాడి క్రిృష్ణుడు సినిమాతో.. సూపర్ స్టార్ హీరో కృష్ణ కు జోడిగా హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైన విజయశాంతి ఆ సినిమా విజయంతో ఆ తరువాత వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. కృష్ణ, శోభన్ బాబు లాంటి హీరోల పక్కన చేస్తూనే.. చిరంజీవి, బాలకృష్ణ లాంటి హీరోల పక్కన కూడా పలు హిట్ సినిమాలు తీసి దాదాపు రెండు దశాబ్దాల పాటు సినీ ఇండస్ట్రీని ఏలింది. అంతేకాదు ప్రతిఘటన, కర్తవ్యం, ఓసేయ్ రాములమ్మ అనే లేడి ఒరియెంటెడ్ సినిమాలతో అందరి హీరోయిన్ల కంటే తాను భిన్నమని నిరూపించుకుంది. అందుకే లేడి సూపర్ స్టార్ అనే బిరుదు వరించింది.

గొరిల్లా ట్రైలర్ రిలీజ్
డాన్ శాండీ దర్శకత్వంలో జీవా హీరోగా, షాలినీ పాండే హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా గొరిల్లా. ఈసినిమాను గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఆల్ ఇన్ పిక్చర్స్ నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. జూన్ 21వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.