తెలుగులోకి సాయిపల్లవి సైకలాజికల్‌ థ్రిల్లర్‌ ‘అథిరన్‌’

2019 Latest Telugu Film News, Sai Pallavi Psychological Thriller To Be Released In Telugu, Sai Pallavi Athiran Movie released in Telugu, Athiran Movie latest news, Actress sai Pallavi latest movie news, Sai Pallavi starrer Athiran to release in Telugu, Athiran telugu release updates, telugu film updates, Telugu Filmnagar, Tollywood cinema News
Sai Pallavi Psychological Thriller To Be Released In Telugu

ఫిదా సినిమాతో అందరినీ ఫిదా చేసిన తమిళ బ్యూటీ సాయిపల్లవి. ఈ సినిమాలో తెలంగాణ స్లాంగ్ తో మాట్లాడి అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాతో తెలుగులో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇక తెలుగులో సాయి పల్లవికి ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆమె మలయాళంలో చేసిన ‘అథిరన్‌’ సినిమాను తెలుగులోకి తీసుకొస్తున్నారు. వివేక్‌ దర్శకత్వంలో సాయి పల్లవి, ఫహాద్‌ ఫాజిల్‌, ప్రకాశ్‌రాజ్‌, అతుల్‌ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్‌ థ్రిల్లర్‌ ‘అథిరన్‌’ మూవీ సూపర్‌హిట్‌ అయిన సంగతి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు ఈ చిత్రాన్ని జయంత్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఎ.కె. కుమార్‌, జి. రవికుమార్‌ తెలుగులో అనువదిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘‘కేరళలో 1970లలో జరిగిన వాస్తవంగా జరిగిన ఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమిది. సాయి పల్లవితో పాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన ప్రకాశ్‌రాజ్‌, అలాగే అతుల్‌ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రభాస్‌ ‘సాహో’కి నేపథ్య సంగీతం అందిస్తున్న జిబ్రాన్‌ ఈ చిత్రానికి అద్భుతమైన నేపథ్య సంగీతం ఇచ్చారు. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆగస్టు చివరి వారంలో చిత్రాన్ని విడుదల చేయాలని అనుకుంటున్నాం. త్వరలో తెలుగు టైటిల్‌ ప్రకటిస్తాం’’ అని అన్నారు.

రెంజి పానికర్‌, లియోనా లిషోయ్‌, శాంతి కృష్ణ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: ఎం. రాజశేఖర్‌రెడ్డి, పాటలు: చరణ్‌ అర్జున్‌, మధు పమిడి కాల్వ, ఎడిటింగ్‌: అయూబ్‌ ఖాన్‌, కెమెరా: అను మోతేదత్‌, స్ర్కీన్‌ప్లే: పి.ఎఫ్‌. మాథ్యూస్‌, ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్: దక్షిణ్ శ్రీన్వాస్, నేపథ్య సంగీతం: జిబ్రాన్‌, స్వరాలు: పి.ఎస్‌. జయహరి, దర్శకత్వం: వివేక్‌, నిర్మాతలు: ఎ.కె. కుమార్‌, జి. రవికుమార్‌ [subscribe]

[youtube_video videoid=GyLOW3hf-KU]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.