క టీమ్‌ను అభినందించిన మెగాస్టార్ చిరంజీవి
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లెటెస్ట్ మూవీ "క" బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీపావళి విన్నర్ గా నిలిచిన ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి అభినందనలు అందించారు. క సినిమాను చూసిన మెగాస్టార్ మూవీ టీమ్‌కు తన బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఇక చిరుని కలిసిన అనంతరం సోషల్ మీడియాలో హీరో కిరణ్ అబ్బవరం దీని గురించి తెలుపుతూ పోస్ట్ పెట్టారు. అలాగే మెగాస్టార్‌తో కలిసి క టీమ్ దిగిన ఫోటోలను షేర్ చేసారు. ఈ సందర్భంగా చిరంజీవి గారికి తమ కృతజ్ఞతలు తెలిపారు క సినిమా టీమ్.
పూర్తి వార్త చదవండి


















