మెగాభిమానులు ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న శుభ తరుణం రానేవచ్చింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’ టీజర్ వచ్చేసింది. ఈ మేరకు నేడు లక్నో వేదికగా మేకర్స్ టీజర్ లాంచ్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, హీరోయిన్స్ కియారా అద్వాణీ, అంజలి, నిర్మాత దిల్ రాజు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సహా చిత్ర యూనిట్ అంతా పాల్గొంది. కాగా అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న రామ్ చరణ్ మాల ధారణ నియమం ప్రకారం, నలుపు రంగు దుస్తులు ధరించి పాద రక్షలు లేకుండా ఈ కారక్రమానికి రావడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
గేమ్ ఛేంజర్ టీజర్ అయితే అద్భుతంగా ఉంది. యాక్షన్, విజువల్స్, టేకింగ్.. ఇలా ఏది చూసినా నెక్స్ట్ లెవెల్ అన్నట్టున్నాయి. ఈసారి శంకర్ మ్యాజిక్ వర్కవుట్ అయ్యేలా కనిపిస్తోంది. ఇక రామ్ చరణ్ అయితే అదరగొట్టేశాడు. డ్యూయల్ రోల్స్‌లో డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌తో కాంట్రాస్ట్ వేరియేషన్స్ చాలా బాగా చూపించాడు. అలాగే డైలాగ్ డెలివరీ, స్టంట్స్, డ్యాన్స్ అన్నింటిలో తన గ్రేస్ చూపించాడు. చూస్తుంటే, గేమ్ ఛేంజర్‌తో చరణ్ గట్టిగానే కొట్టబోతున్నాడని అర్ధమవుతోంది.
రామ్ చరణ్ క్యారక్టరైజేషన్ గురించి వివరిస్తూ మొదలైన టీజర్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. మధ్యలో చరణ్ పంచెకట్టుతో సరికొత్త అవతార్‌లో కనిపించి సర్‌ప్రైజ్ చేసాడు. చూడబోతే ఇది పొలిటీషియన్ పాత్ర అయివుండొచ్చు అనిపిస్తోంది. ఎస్ జే సూర్య, సముద్రఖని, శరత్ కుమార్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో కనిపించారు. వెన్నెల కిషోర్ కామెడీ బావుంది. ఇక మరో పాత్రలో చరణ్ స్టైలిష్ లుక్‌లో మెస్మరైజ్ చేసాడు. చివరిలో ‘ఐ యామ్ అన్ ప్రిడిక్టబుల్’ అంటూ చెప్పే డైలాగ్ టీజర్‌కే హైలైట్‌గా నిలిచింది.
ఇకఇదిలావుంటే, గ్లోబల్ స్టార్ నటించిన సినిమా టీజర్ విడుదల సందర్భంగా లక్నోలోని ఈవెంట్ జరిగే వేదిక వద్ద భారీగా హాజరైన మెగా ఫ్యాన్స్ సందడి చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చరణ్ సోలో హీరోగా చేసిన చిత్రం ఇదే కావడంతో ఎప్పుడెప్పుడు ఆయనను బిగ్ స్క్రీన్‌పై చూసేద్దామా అని వారంతా చాలా ఉత్సుకతగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు హిందీలోనూ ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో టీజర్ రిలీజ్ అయ్యాక ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్నంటాయి. ఇక ఈ టీజర్ చూస్తుంటే చరణ్ బ్లాక్ బస్టర్ కొట్టడం పక్కా అనిపిస్తోంది. దర్శకుడు శంకర్, హీరో రామ్ చరణ్‌ను ప్రజెంట్ చేసిన తీరుకు అందరూ ఫిదా అవుతున్నారు. మొత్తానికి ఈ టీజర్ ఇటు ఇండస్ట్రీలో, అటు అభిమానుల్లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేసిందనే చెప్పాలి.
‘భారతీయుడు 2’ రిజల్ట్ నిరాశపరచడంతో ఇప్పటివరకూ శంకర్ దర్శకత్వంపై మెగా ఫ్యాన్స్ కొంత సందేహపడిన మాట వాస్తవం. అయితే టీజర్ రిలీజ్ అయ్యాక వారి అనుమానాలు పటాపంచలు అయ్యాయి. టీజర్‌లో శంకర్ మార్క్ స్పష్టంగా కనపడింది. దీంతో ఒకప్పటి శంకర్ చిత్రాల రేంజ్‌లో ఈ మూవీ ఉండనుందని ఇప్పుడు వారు బలంగా విశ్వసిస్తున్నారు.
కాగా పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీలో చెర్రీ డ్యూయల్ రోల్స్ పోషిస్తుండటం విశేషం. పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతోన్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 10న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదలకానుంది.
కాగా ఈ చిత్రంలో కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, జయరామ్, సముద్రఖని, సునీల్, అంజలి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు కథను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు అందించగా.. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: