ఒక్క శుక్రవారం చాలు, ఆ నెంబర్స్ మారిపోవడానికి

Hero Kiran Abbavaram Interesting Comments in KA Success Meet

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లెటెస్ట్ మూవీ ‘క’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీపావళి విన్నర్ గా ఈ సినిమాను ట్రేడ్ వర్గాలు డిక్లేర్ చేస్తున్నాయి. ఈ సినిమాలో తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. దర్శకద్వయం సుజీత్, సందీప్ ఈ సినిమాను రూపొందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించారు. తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి రిలీజ్ చేశారు. ఆడియెన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ తో క సినిమా దిగ్విజయంగా రెండో వారంలోకి అడుగుపెడుతోంది.

ఈ నేపథ్యంలో చిత్ర గ్రాండ్ సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. “మా ‘క’ సక్సెస్ మీట్ కు వచ్చి బ్లెస్ చేసిన పెద్దలందరికీ థ్యాంక్స్. మా మూవీకి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు. నాపై ప్రేమ చూపిస్తున్న ప్రతి ఒక్కరినీ గుర్తుంచుకుంటాను” అని అన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “క రిలీజ్ కు ముందు నెగిటివ్ గా మాట్లాడిన వారు 99 పర్సెంట్ ఉండేవారు. పెద్ద సినిమాల మధ్య మీ సినిమా ఎందుకు అన్నారు. మంచి మూవీ అని చెప్పినా ఎవరూ నమ్మలేదు. కానీ మేము చెప్పిన విషయాన్ని ప్రేక్షకులే నిజం చేశారు. క టీమ్ అందరికీ మూవీ సక్సెస్ క్రెడిట్ ఇస్తాను. సక్సెస్ ఫెయిల్యూర్స్ నా ఒంటికి పట్టవేమో, అందుకే ఫెయిల్యూర్, సక్సెస్ కు ఒకేలా రియాక్ట్ అవుతున్నాను” అని తెలిపారు.

” నాకు సక్సెస్ కంటే నా జర్నీ ముఖ్యం. ఈ జర్నీనే సంతృప్తినిస్తోంది. మరెంతో మంది కొత్త దర్శకులను పరిచయం చేయాలి. ఏ హీరోను అతని మార్కెట్ బట్టి డిసైడ్ చేయొద్దు. ఒక్క శుక్రవారం చాలు, ఆ నెంబర్స్ మారిపోవడానికి. మా మూవీని ఆదరిస్తున్న వాళ్లను పర్సనల్ గా వచ్చి కలుస్తాను. మీ ప్రోత్సాహంతో మరిన్ని మంచి మూవీస్ చేస్తాను” అని చెప్పారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.