కంగువ రిలీజ్ ట్రైలర్ చూశారా?

Kanguva Telugu Release Trailer Out

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధానపాత్రలో నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కంగువ’. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌‌లో రూపొందుతోంది. ఇందులో దిశా పటాని హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాబీడియోల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక సూర్య 42వ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో సూర్య పలు గెటప్స్‌లో కనిపించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే ‘కంగువ’ నుంచి రిలీజైన మూవీ గ్లింప్స్ ‌వీడియో, పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ ఫైర్ సాంగ్ టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి. అలాగే అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న కంగువ మూవీ ట్రైలర్ కూడా ఇటీవలే రిలీజై సూపర్ రెస్పాన్స్ అందుకుంది. ఇక ఈ మూవీ నుండి రిలీజ్ చేసిన సాంగ్స్ అన్నీ మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేసాయి.

కాగా కంగువ నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా మొత్తం 10 భాషల్లో 3డీ వర్షెన్‌ సహా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. దీనిలో భాగంగా గురువారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగగా ఈ వేడుకకు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలియజేసారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుండి రిలీజ్ ట్రైలర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇంతకుముందు రిలీజ్ చేసిన ట్రైలర్‌లో చూపించని మరికొన్ని సీన్స్ ఇందులో కనిపించాయి. ఇప్పటికే మూవీపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉండగా.. ఈ రిలీజ్ ట్రైలర్ వాటిని మరింతగా పెంచేసింది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హెర్ప్ సూర్య చెప్పినట్టు 1,000 కోట్లు కలెక్ట్ చేస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

కాగా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా సుమారు 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్‌తో పాటు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ సంస్థ యూవీ క్రియేషన్స్ కూడా కలిసి నిర్మిస్తోంది. కాగా ఈ సినిమాను నైజాం ఏరియాలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతుండగా.. ఓవర్సీస్‌ రైట్స్‌ను ‘ఫార్స్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్’ సంస్థ దక్కించుకుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.