ప్రభాస్‌తో హోంబలే ఫిల్మ్స్ మెగా కొలాబరేషన్

Hombale Films and Prabhas All Set to Join Forces For 3 Mega Films

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్, స్పిరిట్, కల్కి 2, ఫౌజీతో ఎక్స్‌ట్రార్డినరీ ప్రాజెక్ట్‌లను సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ కోలీవుడ్ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ మ్యాసీవ్ స్కేల్‌లో రూపొందే మూడు మెగా సినిమాల కోసం ఆయన చేతులు కలిపారు. ఈ హిస్టారికల్ కొలాబరేషన్‌లో సలార్ పార్ట్ 2 తర్వాత, ఎడిషినల్‌గా రెండు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రానున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇది ఇప్పటి వరకు ప్రభాస్, ప్రొడక్షన్ హౌస్ మధ్య జరిగిన లార్జెస్ట్ డీల్ సూచిస్తూ, కొత్త అధ్యాయానికి నాంది పలికింది. హోంబలే ఫిల్మ్స్ హై-క్యాలిబర్, బిగ్గెస్ట్ స్టార్స్‌తో చేసే ప్రాజెక్ట్స్ లైనప్‌ని కొనసాగుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక సినిమాలు భారతీయ ప్రేక్షకులకు అద్భుతమైన మూవీస్ అందించాలనే హోంబాలే విజన్ పునరుద్ఘాటిస్తున్నాయి.

హోంబలే ఫిల్మ్స్ అద్భుతమైన కంటెంట్‌తో, కమర్షియల్‌గా సక్సెస్ ఫుల్ చిత్రాలకు పేరుగాంచిన విజనరీ నిర్మాణ సంస్థగా ఎదిగింది. KGF చాప్టర్ 1, KGF చాప్టర్ 2, కాంతార, సలార్ 1 ప్రపంచవ్యాప్త విజయాలతో హోంబలే అద్భుతమైన లైనప్‌ను నిర్మించింది. ఇందులో ఇప్పుడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంతార 2, KGF చాప్టర్ 3 అలాగే ప్రభాస్‌తో కొత్త వెంచర్‌లు ఉన్నాయి.

అలాగే ఇండియన్ సినిమాస్‌లో అత్యంత డిమాండ్ ఉన్న సూపర్ స్టార్‌లలో ఒకరైన ప్రభాస్, హోంబలే ల్యాండ్‌మార్క్ చిత్రం సలార్ 2లో నటించనున్నారు. తద్వారా హోంబలేతో మల్టీ-ఫిల్మ్స్ డీల్ భారతదేశంలోని ప్రముఖ నిర్మాణ సంస్థతో అతని గొప్ప అనుబంధాన్ని సూచిస్తోంది. హోంబలే బ్యానర్‌లో నాలుగు చిత్రాలను హెడ్‌లైన్‌గా ఉంచింది.

ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ నుంచి మూడు బ్యాక్-టు-బ్యాక్ ప్రాజెక్ట్ డేట్స్‌ని పొందడం ఒక రేర్ అచీవ్మెంట్. విజన్‌తో కూడిన ఈ కొలాబరేషన్ ఇరువురి కాన్ఫిడెన్స్‌ని నొక్కి చెబుతుంది. అన్ని పరిశ్రమలను ఏకీకృతం చేసి, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ మార్కెట్‌ల నుంచి మెయిన్ స్ట్రీమ్ బిజినెస్‌ని పొందగలిగే బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్.

KGF 1, KGF 2, సలార్ పార్ట్ 1 వంటి సినిమాతో హోంబలే విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సలార్ పార్ట్ 2తో భాగస్వామ్యం ప్రారంభమవుతుంది. హోంబలేతో కలిసి ప్రభాస్ మరపురాని చిత్రాలను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు.

ఇక ఈ సందర్భంగా హోంబలే ఫిల్మ్స్ వ్యవస్థాపకుడు విజయ్ కిరగందూర్ ఈ కొలాబరేషన్‌పై మాట్లాడుతూ.. “హోంబలేలో, సరిహద్దులను దాటే పవర్ అఫ్ స్టొరీ టెల్లింగ్‌ని మేము విశ్వసిస్తాము. ప్రభాస్‌తో మా కొలాబరేషన్ రాబోయే తరాలకు స్ఫూర్తినిచ్చే, ఎంటర్‌టైన్‌మెంట్‌ను పంచే టైమ్‌లెస్ సినిమాలని రూపొందించే దిశగా ఒక అడుగు” అని పేర్కొన్నారు.

భారతీయ చలనచిత్ర చరిత్రలో హోంబలే ఒక పవర్‌హౌస్‌గా కన్నడలో KGF & కాంతార, తెలుగులో సలార్, తమిళంలో రఘు తాత, మలయాళంలో ఫహాద్ ఫాసిల్ ప్రధాన పాత్రలో ధూమమ్‌తో సహా అన్ని మార్కెట్‌లలో హిట్‌ను అందించగలిగిన ఏకైక నిర్మాణ సంస్థగా హోంబలే ఫిల్మ్స్ సంచలనం సృష్టిస్తోంది. కాగా ప్రభాస్-హోంబాలే భాగస్వామ్యం ఇండియన్ సినిమాలో కొత్త శకానికి నాంది పలికింది. ఇది న్యూ బెంచ్ మార్క్స్ ని సెట్ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంటుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.