యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లెటెస్ట్ మూవీ “క” బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీపావళి విన్నర్ గా నిలిచిన ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి అభినందనలు అందించారు. క సినిమాను చూసిన మెగాస్టార్ మూవీ టీమ్‌కు తన బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఇక చిరుని కలిసిన అనంతరం సోషల్ మీడియాలో హీరో కిరణ్ అబ్బవరం దీని గురించి తెలుపుతూ పోస్ట్ పెట్టారు. అలాగే మెగాస్టార్‌తో కలిసి క టీమ్ దిగిన ఫోటోలను షేర్ చేసారు. ఈ సందర్భంగా చిరంజీవి గారికి తమ కృతజ్ఞతలు తెలిపారు క సినిమా టీమ్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా దర్శకద్వయం సుజీత్, సందీప్ తెరకెక్కించిన క సినిమాలో తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్స్‌గా నటించారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో నిర్మించారు. తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి రిలీజ్ చేశారు. ఆడియెన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్‌తో క సినిమా దిగ్విజయంగా రెండో వారంలోకి అడుగుపెట్టింది. దీపావళి విన్నర్‌గా ఈ చిత్రాన్ని ట్రేడ్ వర్గాలు డిక్లేర్ చేస్తున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: